Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. సహజ మిత్రుడు, పార్ట్‌నర్ అంటూ అసదుద్దీన్ గురించి రేవంత్ మాట్లాడారు. ఎంఐఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మూడు పార్టీల మధ్య జరుగుతోందన్నారు. ప్రచారంలో ముగ్గురు ఉంటున్నారని.. ఎన్నికల్లో ఇద్దరే అవుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు.
80 శాతం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఆంధ్ర అభివృద్ధి చాలా ఉందన్నారు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అనుకున్నామని.. కానీ తెలంగాణలో స్వేచ్ఛ లేదని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ధర్మ గంట ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా దర్బార్ లేదన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు అని.. అందుకే పార్టీకి 80 సీట్లు ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
Read Also: Congress: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు
కేసీఆర్ 25 సీట్లకు దాటరని.. బీజేపీ సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కానుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. పార్లమెంట్ బీఆర్‌ఎస్ వ్యవహారాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరని పేర్కొన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌లో పోటీ చేయాలని రేవంత్ అన్నారు. బీజేపీతో కొట్లాడినట్లు కనిపిస్తూ కాంగ్రెస్‌ను మింగేస్తారని.. అందుకే ధృతరాష్ట్ర కౌగిలికి మేం సిద్ధంగా లేమన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయని రేవంత్ చెప్పారు. మహారాష్ట్రలో కేసీఆర్ బీజేపీ టాస్క్ అమలు చేస్తున్నారన్నారు. లక్ష కోట్ల దోపిడీతో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని రేవంత్ ఆరోపించారు. దీనిపై కేంద్రం ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. తెలంగాణ విభజన తర్వాత అన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!