తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాలుగా వున్నారనే ప్రచారం వుంది. తాజాగా వీళ్ళిద్దరూ ఐక్యతారాగం వినిపించారు. కలిసి కనిపించారు. తెలంగాణలో పీసీసీ పీఠం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకరికి పదవి దక్కగానే.. మరొకరు ఒంటికాలిపై లేచారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. కానీ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తారు. మనసులు కలిశాయా.. మనుషులు కలిశారా అని అనుకుంటున్న తరుణంలోనే చర్చల్లోకి వస్తారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్న…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనుకుంటున్న తరుణలో ఆ ప్లేసును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు వచ్చేసరికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక్కడి ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు తమ…
ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపాడు. డీసీసీలు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలి. ఈ విషయంలో సామాజిక కోణం ఉంది. నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలి. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది. 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు…
ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా…
ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారు. అది దళిత, గిరిజనుల కోసం పెట్టిన సభ కాదు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రేవంత్ దొడ్డి దారిన పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ భాషను చూస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలని కోట్లాది ప్రజలకు ఉంది. కుక్క కాటుకు చెప్పు అనే రీతిలో రేవంత్ కు తగిన శాస్తి చేయాలి. సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడిన భాష ను…