నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల. ఆగస్ట్ నెల ఆన్లైన్ ఆర్జిత, ఇతర టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్. మే 21న ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం. 22న ఉదయం 10 గంటలకు మరిన్ని టికెట్లు విడుదల. 22న మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్ సేవలు విడుదల. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల. ఏపీ: నేడు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు. కొత్త విధ్యావిధానంపై…
ఈ సాలా కప్ నమ్దే.. ఇదే జరిగితే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి అవుట్..! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. పలు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్ రద్దు వల్ల రెండు జట్లకు…
ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పీఎస్ఎల్వీ – సి61…
చైనాలో భూకంపం.. తీవ్రత 4.5గా నమోదు చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6:59 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీవారి భక్తులను మోసగించిన ట్రావెల్ ఏజెంట్.. లక్షా 25 వేలు వసూలు చేసి..! కలియుగ ప్రత్యక్షదైవం…
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే…
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ. విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు…
పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది.. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి…
భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్! బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్తో అలరిస్తూనే ఉంది. ఇదిలా…
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా…