రెండు కుటుంబాలను ఆగం చేసిన వివాహేతర సంబంధం
మెదక్ జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. హావేలి ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన నరేష్ (31), సునీత (28) మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇద్దరికీ కుటుంబాలు ఉన్నప్పటికీ, వారి సంబంధం తీవ్రతరమైంది. నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, సునీతకూ భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వ్యవహారం గ్రామంలో తెలిసిపోయింది. పెద్దలు పంచాయతీ పెట్టి వారిద్దరిని మందలించారు. దీనితో మనస్తాపానికి లోనైన సునీత, ఈ నెల 5వ తేదీన పురుగుల మందు తాగింది. ఆమెను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ జూన్ 7న మృతి చెందింది.
హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్
హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మృతదేహం ఆస్పత్రి సొరంగంలో లభ్యమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గత నెలలో మొహమ్మద్ సిన్వర్‌ను చంపేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లోని ఆస్పత్రి కింద ఉన్న సొరంగం నుంచి మొహమ్మద్ సిన్వర్‌ను మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించారు. మరో సీనియర్ హమాస్ నాయకుడు, రఫా బ్రిగేడ్ కమాండర్ మొహమ్మద్ షబానా కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారని, ఇంకా అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. సైనిక ఆపరేషన్ సమయంలో ఈ సొరంగం బయలపడిందని. ఈ స్థలాన్ని హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించిందని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు.
లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..
దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు (జూన్ 9న) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అంచనాలకు మించి అరశాతం మేర కీలక రేట్లను తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తి (CRR)లో కోత విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న నిర్ణయాలతో షేర్ మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 280 పాయింట్లు పుంజుకొని 82,469 దగ్గర ట్రేడింగ్ అవుతున్నాయి. ఇక, నిఫ్టీ 88 పాయింట్లు పైకి ఎగిసి 25,091 వద్ద కొనసాగుతోంది.
మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.. బహిరంగ లేఖ విడుదల చేసిన ముద్రగడ..!
మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా ఓ భారంగా లేఖను విడుదల చేసారు. ఈ లేఖలో ఆయన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖలో.. ఈ మద్య మాకుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయి. ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని.. వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారని.. నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బందించి చిన్న కొడుకు, వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారని.. ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100 శాతం కారణం అని అన్నారు.
రైల్లో నుంచి జారిపడి ఐదుగురు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ సంఘటన సమయంలో, పుష్పక్ ఎక్స్‌ప్రెస్- కసారా లోకల్ ఒకదానికొకటి దాటుతున్నాయి.
నా కూతురికి ఏ పాపం తెలియదు.. సీబీఐ విచారణకు సోనమ్ తండ్రి డిమాండ్
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తున్నారని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్‌తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
ఏంటి ట్రంప్ మావా.. అప్పుడు బైడెన్ను ట్రోల్ చేశావ్.. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి..!
కర్మ అనేది ఎవరినీ వదలదు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సేమ్ ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైంది ఇప్పుడు. గతంలో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కాలు జారీ కిందపడిన సందర్భంలో అతడిపై ట్రంప్ సెటైర్లు వేశారు. తాజాగా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు ట్రంప్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా యూజర్లు డొనాల్డ్ ట్రంప్‌పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
సిట్ ఆఫీసుకు ప్రభాకర్ రావు.. అధికారుల ప్రశ్నల వర్షం..!
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్‌లోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట సోమవారం హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో అనేకమంది ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుండి కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని SIT భావిస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయంపై, అలాగే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఆర్థికంగా సహాయపడినవారిపై నిఘా పెట్టిన కోణంలో SIT ప్రశ్నలు సంధించనుంది.
భారత్లో విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే ఎన్ని కేసులంటే..?
కరోనా వైరల్ మరోసారి దేశ ప్రజల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. భారత్‌లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 6 వేల 133 కు చేరుకుంది. అంతే కాదు, గడిచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు నమోదు కాగా.. ఆరుగురు కోవిడ్ తో మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు కరోనా వల్ల తుది శ్వాస విడిచారు. అయితే, ఇప్పటి వరకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 65కి చేరుకుంది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీలో అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులను ఆరోగ్య శాఖ గుర్తించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేశారు.
స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఆసుపత్రికి తరలింపు..!
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంగళవారం ఉదయం గ్రామ దేవత అయిన మూల పెద్దమ్మ దేవరలో గండా దీపం మోసిన అనంతరం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గండా దీపం మోసిన వెంటనే అలసట, అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న అనుచరులు, పార్టీ శ్రేణులు ఆమెను అత్యవసరంగా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.