హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..
మెగా స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో, యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్‌లో ఈ ఘటన సంభవించింది. అయితే సినిమాలోని కీలకమైన సముద్రం సన్నివేశాలు షూట్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ సెట్ వేశారు. ఆ సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో, ఒక్కసారిగా నీళ్లన్నీ సెట్‌లోకి దూసుకొచ్చాయి. నీళ్ల వేగానికి లొకేషన్‌లో ఉన్న సిబ్బందితో కెమెరాలు, ఇతర వస్తువులు కొట్టుకువచ్చాయి. దీంతో సెట్‌లో ఉన్న కొంత మంది సిబ్బందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇందులో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేయగా, ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారట. ప్రజంట్ ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, గాయపడిన వారు త్వరగా సురక్షితంగా కోలుకోవాలని, మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్ కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..
సీనియర్ హీరోయిన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నావారిలో లయ ఒకరు. తక్కువ సినిమాలే చేసినప్పటికి దాదాపు అందరు హీరోలతో జత కట్టింది.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లయ.. చాలా గ్యాప్ తర్వాత ‘తమ్మడు’ మూవీ తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
మొదటి రోజు బౌలర్లదే.. ఒక్కరోజే నేలకూలిన 14 వికెట్లు..!
లార్డ్స్ మైదానంలో బుధవారం (జూన్ 11)న ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2025లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి రోజు ఆట రసవత్తరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజుతోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే కష్టాలలో పడింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా కట్టడి చేశారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0), కామెరాన్ గ్రీన్ (4) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా, మానస్ లబుషేన్ (17) కూడా నిలదొక్కుకోలేకపోయారు. అయితే సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 112 బంతుల్లో 10 ఫోర్లు 66 పరుగులు, బియూ వెబ్‌స్టర్ 92 బంతుల్లో 11 ఫోర్లు 72 పరుగులతో మిడిలార్డర్ ను నిలబెట్టారు. ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పగా చివరికి ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పేసర్ కగిసో రబాడా అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీశాడు. అతడు 15.4 ఓవర్లలో 51 పరుగులకు 5 వికెట్లు తీసాడు. మరోవైపు జాన్సన్ మూడు వికెట్లు తీసి మద్దతు ఇచ్చాడు. మిగిలిన రెండు వికెట్లు మార్క్రామ్, మహరాజ్ తీసుకున్నారు.
లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!
అమరావతిలో మద్యం స్కాం (లిక్కర్ కేసు) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ (Special Investigation Team) హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలని కోరుతూ, ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిట్ తన కౌంటర్‌లో వెల్లడించిన ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, గతంలో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే తిరస్కరించిందని.. అలాగే దాని అనంతరం దర్యాప్తులో స్పష్టత ఏర్పడిందని పేర్కొన్నారు. వీటితోపాటు మద్యం అక్రమ కార్యకలాపాల్లో వ్యూహ రచన అమలు మిథున్ రెడ్డిదే అని, ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని.. వేర్వేరు మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు రూ.5 కోట్ల మేర నిధులు చేరాయని సిట్ తన కౌంటర్‌లో తెలిపింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హై అలర్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ అణ్వాయుధం కోసం పని చేస్తోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లోని అణు కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని విడిచి వెళ్లేందుకు విదేశాంగ అనుమతి ఇచ్చింది. పెంటగాన్ సైనిక కుటుంబాలు యూఎస్ స్థావరాల నుంచి స్వచ్ఛందంగా విడిచిపెట్టి వెళ్లేందుకు అనుమతిచ్చింది.
ఫార్మాసిటీలో విషవాయువు లీక్.. ఇద్దరు మృతి..!
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న జేఎన్ ఫార్మా సిటీలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సాయిశ్రేయాస్ (ఎస్.ఎస్) ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిల్వ చేసిన కెమికల్స్ లెవెల్స్‌ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ సమయంలో మ్యాన్‌హోల్‌ను ఓపెన్ చేయడంతో ప్రమాదవశాత్తూ తీవ్ర విషపూరిత వాయువులు బయటకు విడుదలయ్యాయి. దీనివల్ల అక్కడి పని చేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెలుగులోకి మరో హనీమూన్ కేసు.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో శవం..
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లై రెండు వారాలు గడవక ముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఈ ఘటన మరువక ముందే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇలాంటి ఘటన మరోక్కటి జరగడంతో.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అగర్తాలాలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి మిస్సింగ్ వెనుక ఉన్న సిక్రెట్ ను పోలీసులు ఛేదించారు. అయితే, త్రిపురలోని ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్‌లో ఐస్ క్రీం ఫ్రీజర్‌లో దాచిన ట్రాలీ బ్యాగ్‌లో ఒక యువకుని శవం దొరికింది. ఆ మృతదేహాం ఎవరిది అని పోలీసులు ఆరా తీయగా.. అగర్తాలా స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేస్తున్న సరిఫుల్ ఇస్లాం అనే యువకుడిదిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిఫుల్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తేలింది.. అయితే, ఇక్కడే అసలై ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. ఆ అమ్మాయి బంధువు దిబాకర్ సాహా కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. వారి ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.
బాబా సిద్ధిఖీ హత్య కేసులో కుట్రదారుడు అక్తర్ అరెస్ట్
ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్‌ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న బాంద్రా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. కార్యాలయంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ హత్య జరగడంతో దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ హత్య కేసులో కుట్రదారుడైన జీషన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో జీషాన్ అక్తర్ (22)ను అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో జూన్ 15 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గురువారం నాటి వాతావరణ సూచనల ప్రకారం, కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు.
హనుమకొండ పాఠశాలలో టాయిలెట్‌లో కొండచిలువ కలకలం
హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్‌లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్‌లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.