నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ‘రాబిన్ హుడ్’ ప్లాప్ అవడంతో.. ‘తమ్ముడు’ విజయం నితిన్ కెరీర్‌కి చాలా కీలకం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.. అయితే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్..
విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఎంపీ బృందాలకు నేడు ప్రధాని మోడీ విందు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను మట్టికరిపించింది నరేంద్ర మోడీ సర్కార్. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి, పాక్ కి వ్యతిరేకంగా మద్దతు మూటగట్టుకోవడానికి దేశంలో అన్ని పార్టీలకు చెందిన అఖిలపక్ష ప్రతినిధి ఎంపీల బృందం ప్రపంచ రాజధానులను సందర్శించి టెర్రరిజంపై భారత్ వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ఈ ప్రతినిధి బృందాల్లో 50 మందికి పైగా వ్యక్తులు ఉన్నారు.. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎంపీలు కాగా, వీరందరూ.. 33 విదేశీ రాజధానులతో పాటు యూరోపియన్ యూనియన్‌ను సందర్శించిన ఈ ప్రతినిధుల బృందంలో మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.
కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా..? ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ సీఎం..!
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాజీ సీఎం, వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో చంద్రబాబు గారు.. అంటూ, అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిది గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది.
రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!
వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా, ప్లాంట్ ద్వారా బయోగ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంత్రి నారాయణకు ఈ ప్లాంట్ పనితీరు, శక్తి వినియోగ విధానం, నిర్వహణ విధానాలను పూర్తిగా వివరించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ప్లాంట్లను పరిశీలించి, వాటిలో బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయడం లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టారు.
నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్.. కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని గంటల్లో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదలవుతుంటుంది. కానీ ఈసారి ఆలస్యం జరుగుతోంది. ఇందుకు ముఖ్య కారణం శాఖల విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, సామాజిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సేవలు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగించే విషయమై రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలు అధిష్టానానికి వివరించినట్టు సమాచారం.
ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు..
ప్రముఖ శక్తిపీఠం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియను నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పరిచారకులకు బదిలీలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇటీవల మాజీ ఈవో కేఎస్ రామారావు బదిలీ కాలపరిమితి ముగియడంతో, ప్రస్తుత ఈవో శీనా నాయక్ బదిలీల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న వేద పండితులు, అర్చకులు, పరిచారకులు ఎవరెక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం 9 మంది ఉద్యోగులు, 40 మంది అర్చకులు, 20 మంది పరిచారకులు, 3 మంది వేద పండితులను కొత్తగా బదిలీ చేశారు. ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వృత్తిపరమైన అనుభవాన్ని విస్తరించేందుకు, ఆలయ నిర్వహణ మరింత సవ్యంగా సాగేందుకు ఈ మార్పులు సాయపడతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న వ్యక్తి.. తీవ్ర ఉద్రిక్తత!
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి నాన్ వెజ్ తింటున్నట్లు భక్తులు గమనించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆలయాధికారులు అతడి దగ్గరికి వచ్చి ఏం తింటున్నాడని ప్రశ్నించగా.. సదరు వ్యక్తి తాను ‘కుస్కా’ (సాదా బిర్యానీ) ఆర్డర్ చేసుకున్నాను. కానీ, పొరపాటున దాంతో పాటు చికెన్ ముక్కను ప్యాక్ చేశారని తెలిపాడు.
అమానుషం.. భారతీయ విద్యార్థికి బేడీలు.. వీడియో వైరల్
అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టూడెంట్‌ను కింద పడేసి చేతులకు బేడీలు వేసి నేలకు నొక్కిపెట్టారు. అనంతరం అతడిపై ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. దీంతో ఆ విద్యార్థి నొప్పితో విలవిలలాడిపోయాడు. మొత్తం నలుగురు అధికారులు అతన్ని పట్టుకున్నారు. చాలాసేపు అతని వీపుపైనే ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని నేరస్థుడిలా పట్టుకోవడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు కనిపిస్తే.. పంపించేయాలి కానీ ఇలా సంకెళ్లు వేయడమేంటి? అని నిలదీస్తున్నారు.
మణికొండలో వృద్ధురాలి అదృశ్యం.. వికారాబాద్‌లో హత్య కలకలం
హైదరాబాద్ శివారులోని మణికొండలో తప్పిపోయిన వృద్ధురాలి మిస్టరీకి తెరపడింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన బాలమ్మ అనే వృద్ధురాలి అదృశ్యంపై జరిగిన విచారణ దారుణ హత్యను బయటపెట్టింది. వృద్ధురాలిపై అత్యాశ పెంచిన మరో మహిళ ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 3న వాకింగ్‌కు వెళ్లిన బాలమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కోడలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలమ్మతో సన్నిహిత సంబంధాలు ఉన్న అనిత అనే మహిళపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దృష్టిపెట్టి నార్సింగ్ పోలీసులు అనితను ట్రేస్ చేసి ఈనెల 7న వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.