Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 08 06 2025

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :June 8, 2025 , 9:14 pm
By Gogikar Sai Krishna
  • ఎన్ఐఏ చేతికి సుహాస్ శెట్టి హత్య కేసు..
  • తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..!
  • సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..
  • దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..!
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

దారుణ హత్య.. ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు..!

అనంతపురం నగరంలో మరోసారి నరమానవత్వం కలవరపెట్టే ఘటన జరిగింది. ఇంటర్ సెకెండియర్ చదువుతున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యచేశారు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానవీయ సంఘటన అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో చోటు చేసుకుంది. అక్కడ ఓ విద్యార్థినీ కాలిపోయిన మృతదేహం గుర్తించబడింది.

బలూచిస్తాన్ ప్రజలకు పెరగనున్న కష్టాలు.. అణచివేతకు పాకిస్తాన్ కొత్త చట్టం..

పాకిస్తాన్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలు ఆయుధాలతో పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించింది. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఇది ఆ ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ చట్టం ఈ ప్రాంతంలో అణచివేత, అశాంతిని మరింతగా పెంచుతుందని హెచ్చరించారు.

ముగిసిన మాగంటి గోపీనాథ్కు అంత్యక్రియలు..

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర, జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. ఈ సందర్భంగా మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల గుండా యాత్ర సాగింది. అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాగంటి పాడెను స్వయంగా మోస్తూ గౌరవం తెలిపారు. అభిమానులు తమ నాయకుడిని చివరిసారి చూడాలని భారీగా తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.

ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..!

నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల ప్రాంతంలో రహదారి అభివృద్ధికి మరింత ఊతమిచ్చే దిశగా కీలక అడుగు పడింది. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల వద్ద జాతీయ రహదారి NH-167K పేవ్డ్ షోల్డర్స్‌తో కూడిన రెండు వరుసల రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ యంత్రాన్ని ఆపరేట్ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

సూట్‌కేసులో 9 ఏళ్ల బాలిక.. అత్యాచారం చేసి, హత్య..

ఢిల్లీలో దారుణం జరిగింది. 09 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, రక్తస్త్రావం అవతున్న స్థితిలో ఆమెను సూట్‌కేస్‌లో కుక్కి చంపినట్లు ఆదివారం పోలీస్ అధికారులు తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత, శనివారం సాయంత్రం నెహ్రూ విహార్‌లోని ఫ్లాట్‌లోని రెండో అంతస్తులో సూట్‌కేస్ కనిపించింది. ఇందులో బాలిక అపస్మారస్థితిలో కనిపించింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్), ఆశిష్ మిశ్రా మాట్లాడుతూ.. నిన్న రాత్రి 8.40 గంటల ప్రాంతంలో, తొమ్మిదేళ్ల మైనర్ బాలిక గాయపడిన స్థితిలో కనిపించినట్లు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. బాలికను ఆమె తండ్రి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దయాల్‌పూర్ పోలీసులు తెలిపారు. అయితే, బాలిక చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాలికపై లైంగిక వేధింపుల సంకేతాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

బెంగాల్, తమిళనాడుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..

తమిళనాడులో పర్యటిస్తు్న్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా, అధికార పార్టీ డీఎంకేపై విరుచుకుపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన పార్టీ డీఎంకే నాలుగేళ్లలో అవినీతికి సంబంధించి అన్ని పరిమితుల్ని దాటిందని ఆదివారం అన్నారు. మధురైలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. 2026లో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిజ్ఞ చేశారు. తమిళనాడులో డీఎంకే అవినీతికి కేంద్రంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 450 కోట్ల పోషకాహార కిట్లను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ద్వారా వారు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, పేదలకు ఆహారం అందకుండా చేశారని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం రూ. 4600 కోట్ల ఇసుక కుంభకోణానికి పాల్పడిందని, దీని వల్ల రాష్ట్రంలోని పేద ప్రజలు అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సి వచ్చిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌‌‌ 2025 ఫలితాలు విడుదల..!

ఏపీ ఈఏపీసెట్‌ 2025 ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలు ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుండి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్‌ 2025 లో మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇక ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగాల్లో టాపర్స్ లిస్ట్ ఇలా ఉంది.

తప్పులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు గతంలో చేసిన తప్పిదాలు క్షమించరానివని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు తప్పులు చేయుటం వల్లే డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని విమర్శించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ, పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్ధవంతంగా పూర్తయ్యే విధంగా కాంప్రమైజ్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు

ఒక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కలలు.. నిజానికి ఏకంగా బానిస జీవితం మారాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టుచేశారు. మస్కట్‌కి చెందిన వ్యక్తి సుందర్‌, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు ప్రతి వ్యక్తిపై వసూలు చేస్తూ, దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తున్న వైనం భయాందోళనలు కలిగిస్తుంది. “మీరు డబ్బులు కట్టనవసరం లేదు… అన్నీ నేనే చూసుకుంటా” అంటూ విశ్వాసం కలిగించి, లక్షలాదిమంది అమాయకులను మోసం చేశారు. టికెట్లు, విజిట్ వీసాలు పంపించి, అక్కడి షేక్‌లకు అప్పగిస్తూ వాణిజ్యంగా మార్చేశారు.

ఎన్ఐఏ చేతికి సుహాస్ శెట్టి హత్య కేసు..

గత నెలలో కర్ణాటకలోని మంగళూర్‌లో మాజీ బజరంగ్ దళ్ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత కోస్తా కర్ణాటక ప్రాంతంతో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. 2022లో 23 ఏళ్ల మహమ్మద్ ఫాజిల్ అనే వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన శెట్టిని మే 1న కిన్నిపాడు సమీపంలో దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో స్థానిక పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. సుహాస్ హత్యను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన ఎన్ఐఏ ఈ కేసులో నిందితులందర్ని ప్రశ్నిస్తుంది. ఐదు నుంచి ఆరుగురు నిందితులు సుహాస్ కారును అడ్డగించి అతడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP EAPCET 2025 Results
  • huma traffecking
  • Maganti Gopinath
  • NIA
  • phone tapping

తాజావార్తలు

  • King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Hyderabad: మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్

  • Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

  • Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions