భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందులో కాశ్మీర్ అంశంపై కూడా ఉందని పేర్కొన్నారు. శాంతి చర్చలకు రావాలని ఆహ్వానించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే…
తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ. విజయవాడ: లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు…
పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది.. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి…
భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్! బుల్లితెర యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు దాదాపు చాలా సినిమాలు చేసింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మాత్రం ఫుల్‌గా పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. ఈ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు పదేళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్తో అలరిస్తూనే ఉంది. ఇదిలా…
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా…
నేటి నుంచి 4 రోజుల తెలంగాణలో వర్షాలు. పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో నేటి నుంచి మరో 25 చోట్ల స్లాట్ విధానం. భారీగా రిజిస్ట్రేషన్లు ఉన్న 3 చోట్ల అదనపు సిబ్బంది. స్లాట్ విధానంలో రోజుకు 45…
త్రిషకు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని.. ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం …
ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన! పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి…