జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?: ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్‌కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్…
ఫైల్స్ దగ్ధం కేసులో మాజీ ఆర్డీవో అరెస్ట్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పరార్ అయిన మురళి కోసం మదనపల్లి, తిరుపతి, హైదరాబాద్ లో అధికారులు గాలించారు. ఇక, తిరుపతిలోని కేఆర్ నగర్ లో ఉన్నట్లు తెలుసుకొని వెళ్లిన అతడ్ని సీఐడీ డీఎస్పీ డీవీ వేణుగోపాల్ బృందం అరెస్టు చేసింది.…
ఈ నెల 9న చిత్తూరులో జగన్ పర్యటన: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే, ఇప్పటికే హెలిప్యాడ్ కు అనుమతిచ్చిన…