ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌కు భారీ ధర దక్కింది. రూ.11.5…
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు…
బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా…