ఎస్పీని కలిసిన వైఎస్ సునీత.. వైఎస్ వివేకా కేసులో హాట్ కామెంట్స్..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హాట్ కామెంట్స్ చేశారు ఆయన కూతురు వైఎస్ సునీత.. గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నాన్న గారి హత్య గుర్తుకు వస్తుందన్న ఆమె.. గొడ్డలి పోటుతో వివేకా పడి ఉంటే.. గుండె పోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారు. హత్య తర్వాత లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టామన్నారు. నేను పెట్టలేదు.. అప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లో అదే జరుగుతుంది. అప్పుడు టీడీపీ నేతలు చంపారని నమ్మ బలికారు.. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి మా బంధువు.. అతనిపై ఎంపీ అవినాష్ అనుచరులు దాడి చేయించారాని అనుమానంగా ఉందన్నారు.. గత 6 ఏళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా.. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు సునీత.. వైఎస్ వివేకా హత్య.. సునీతా రాజశేఖర్ రెడ్డి చేయించారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసినవారికి శిక్ష పడాలి. నాన్న మళ్లీ తిరిగిరాడు. ప్రజలు అలోచించి నిజం బయటికి వచ్చేలా చూడాలి.. వివేకా హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారు. రేపు వివేకా పుట్టినరోజు.. నా తల్లి నాకు పులివెందుల రావద్దని చెప్తుంది.. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది.. నా మీద, నా భర్త మీద కేసులు పెడుతున్నారు… బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు వైఎస్ సునీత..
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. అతడిని వెంటనే విడుదల చేయండి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.. అసలు, అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, రిమాండ్ విధింపులో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది ఏపీ హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినప్పుడు అరెస్టు అయిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.. తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా కిషోర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
బట్టతల మీద జుట్టు తెప్పిస్తామంటూ గుండు గీయించారు..! పీఎస్‌కు బాధితుడు
బట్టతల మీద జుట్టు తెప్పిస్తామని డబ్బులు తీసుకుని వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ మోసం చేశారని కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సురేష్ అనే వ్యక్తి.. తలపై జట్టు లేని చోట హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తామని వచ్చిన ప్రకటనతో మోసపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. 98 వేల రూపాయల ప్యాకేజీతో జుట్టు తెప్పిస్తామని చెప్పి తనవద్ద 10 వేలతో పాటు కంపెనీ వారు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 80 వేలు ఫైనాన్స్ చేయించి కంపెనీకి జమచేశారని చెబుతున్నాడు సురేష్.. 9 నెలల నుంచి వెళ్ళిన ప్రతి సారి టెస్టులకు 3 వేల నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అయ్యేదని ఫిర్యాదు చేశాడు. ఈ నెల 5వ తేదీన ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి గుండు గీయించారని.. ఆ తర్వాత షుగర్, బీపీ కంట్రోల్ లో లేదని ట్రీట్మెంట్ చేయలేమని చెబుతున్నారని వాపోయాడు.. తాను బయటికి రాలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, వీఆర్ఎస్ హెయిర్ ప్లాంటేషన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సురేష్..
గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే 20 శాతం రాయితీతో పాటు మరిన్ని వెసులుబాట్లు..!
విజయవాడలో జరిగిన గ్రీన్ ఆంధ్రా సమ్మిట్ 2025కు హాజరైన మంత్రి నారాయణ… కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ – CII ఆధ్వర్యంలో నోవాటెల్‌లో ఒకరోజు సదస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. IGBC సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించారు.. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నాం.. గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో 20 శాతం రాయితీతో పాటు డెవలప్‌మెంట్ చార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం ఇచ్చాం అని వెల్లడించారు.. గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తారు.. IGBC ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్‌కు 10 శాతం, గోల్డ్ బిల్డింగ్ కు 15 శాతం, ప్లాటినం బిల్డింగ్‌కు 20 శాతం ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తాం అని తెలిపారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కన్నారు.. ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ..
రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో దోస్తీ డ్రామా.. మోడీతో కుస్తీ డ్రామా
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్ కు తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పిటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టారు. ఐఏఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారు.. బిఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు అన్నారు. మళ్లీ వచ్చేది మేమే మీ లెక్కలన్ని సెటిల్ చేస్తాము.. ఎవరెవరు ఎగిరిపడ్డారో వారి సంగతి చూస్తాం.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది.. రేవంత్ రెడ్డి అత్తా, కొడళ్లకు మధ్య పంచాయతీ పెట్టిండు.. రేవంత్ రెడ్డి విచిత్రమైన వ్యక్తి రేవంత్ రెడ్డికి సమస్య ఉంది.. కేసీఆర్ పేరు ఎత్తనిది రేవంత్ రెడ్డి మాట్లాడడు.. కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు.. ఆరోగ్యం డీలా పడింది సెట్ చేసుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి నిద్రలో కేసీఆర్ పేరు తలుస్తున్నారు.. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి దోస్తీ డ్రామా.. మోదీతో రేవంత్ రెడ్డి కుస్తీ డ్రామా అని ఎద్దేవా చేశారు.
మెదక్ జిల్లాకు ఓ పనికి మాలిన మంత్రి ఉన్నాడు.. మరోసారి కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాకి ఓ పనికి మాలిన మంత్రి ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాడని.. కమీషన్లు, పర్స౦టేజీల గురించి మాత్రమే పట్టించుకుంటాడని విమర్శించారు. జిల్లా మంత్రి ఒకరైతే.. జిల్లా మీద పెత్తనం చేలాయించేటాయన ఇంకో జిల్లావారు అంటూ మండిపడ్డారు. రైతు ధర్నాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై ఫైర్ అయ్యారు.
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఆపేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు..!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్‌పై 50% శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు.. భారత్ రష్యన్ చమురు కొనుగోలును ఆపివేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ట్రంప్ ఊహించలేదు కావొచ్చు. రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తుంది కాబట్టే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌పై ట్రంప్ చేసిన 9 అసత్య ఆరోపణలు ఇవే.. మొత్తం అబద్ధాలే..!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అనేక విమర్శలు గుప్పించారు. భారత్ రష్యాకు ఆర్థికంగా సహాయం చేస్తోందని అన్నారు. రష్యన్ చమురు కొనుగోలుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. నిన్న 50% టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. రష్యా నుంచి భారత్‌కు పెరుగుతున్న చమురు దిగుమతులు ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని ట్రంప్, పాశ్చాత్య మీడియా పేర్కొంటున్నాయి. కానీ వాస్తవం వేరేలా ఉంది. ఇది ఈ వాదనలు ఎంత అబద్ధాలు.. ట్రంప్ భారత్‌పై చేసిన 9 అబద్ధాల గురించి తెలుసుకుందాం.
చాహల్, ధనశ్రీ విడాకులకు ఇదే కారణమా? కొత్త డేటింగ్ పై పుకార్లు తీవ్రం
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయిన తర్వాత, అతడు ఆర్జే మహ్‌వాష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వార్తల్లో నిలుస్తున్నాయి. వారిద్దరూ దీని గురించి ఎటువంటి కన్ఫర్ మేషన్ ఇవ్వనప్పటికీ, వారు కలిసి కనిపించిన తీరును బట్టి, ఇద్దరి మధ్య ఏదో బంధం అల్లుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ధనశ్రీ జీవితంలో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈలోగా, ధనశ్రీ కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో ప్రేమలో ఉందని పుకారు వచ్చింది. వాస్తవానికి, ధనశ్రీ వర్మ నూతన సంవత్సర వేడుకల చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఆమె ప్రతీక్ ఉటేకర్‌తో చాలా హాయిగా కనిపించింది. ఆ చిత్రంలో, ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని కనిపించారు. ఈ చిత్రం అభిమానులను షాక్ కు గురిచేసింది. ధనశ్రీ ప్రతీక్‌తో డేటింగ్ చేస్తుందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. అందుకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారా? అని భావించారు.
స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీపిక పదుకొణెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రినీ హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. చాలా నెలలుగా మూవీ షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. స్పిరిట్ లో ప్రభాస్ తో నటించేందుకు యాక్టర్ల కోసం వెతుకుతున్నాడు. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం మేల్ యాక్టర్స్ కావాలని.. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఛాన్స్ ఇస్తామని తెలిపింది.
మరో ఇంట్రెస్టింగ్ పాత్రతో వస్తున్న రాజ్ బీ శెట్టి
‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేసిన టీంసో ఫ్రమ్ సు, స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల విజయం తర్వాత, కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నారు. దర్శకుడు గురుదత్ గనిగ ‘కరవాలి’ అంటూ కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను తెరపైకి తీసుకు రాబోతోన్నారు. విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించబోతోన్నారు. ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ శక్తివంతమైన పాత్రలో రాజ్ బి శెట్టి కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరింత హైప్ పెరిగినట్టు అయింది.
ఆగస్టు 29న ‘అర్జున్ చక్రవర్తి’
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్లు వ్యూస్ దాటింది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ చేసి ‘అర్జున్ చక్రవర్తి’ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా వుంది. అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాతో పాటు హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో అర్జున్ చక్రవర్తి అలరించబోతుందని ఈ సాంగ్ ప్రామిస్ చేస్తోంది.