జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి 'వాల్తేరు వీరయ్య'గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ 'వాల్తేరు వీరయ్య' సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. 'నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ' అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది.
ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ మరోసారి సత్తా చాటింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఈ పాటలో రామ్చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ముందుగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు రాములు మృతికి రైతు జే.ఏ.సి. సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.