మోడీని ప్రజలు విశ్వసిస్తున్నారు..నితీష్ ఎన్నటికీ పీఎం కాలేడు
ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ ఫలించదని అన్నారు. నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రాన్నే నిర్వహించలేకపోతున్నారని.. తనను ప్రధాని అభ్యర్థిగా చేయాలని అందర్ని నితీష్ కుమార్ వేడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశం మారింది, ప్రజలు మారారు.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారని..నితీష్ కుమార్ రాజకీయ విశ్వసనీయతనను పెంచుకోలేకపోతున్నారని విమర్శించారు. బీహార్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని.. ఆయన పార్టీ గందరగోళంలో ఉంది.. కాంగ్రెస్ ఆయనకు ఏమాత్రం సపోర్టు ఇవ్వడం లేదు.. నితీష్ జీ మీరు దేవేగౌడ, ఐకే గుజ్రాల్ గా మారాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు
బీఆర్‌ఎస్‌లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే సాయన్న ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న తుది శ్వాస విడిచారు. అయితే.. గత కొన్ని రోజులుగా సాయన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. టీడీపీ తరుఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. రెండుసార్లు బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. సాయన్న మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. యన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.
భూములు అమ్మి 13 వేల కోట్లు సమీకరించనున్న తెలంగాణ సర్కార్
రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు నిధుల నిర్వహణ కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం, ఆక్రమణలను క్రమబద్ధీకరించడం ద్వారా రూ.13,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయిస్తోంది. పోచారం, బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి ప్రభుత్వం వేలం నిర్వహించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయం లక్ష్యం రూ.10,000 కోట్లకుగానూ రూ.6,900 కోట్లు రాబట్టింది. భూముల విక్రయం ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి దృష్టి సారించారు. పన్నేతర ఆదాయాన్ని పెంచేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఫైనాన్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది. జీఎస్టీ వసూళ్లు కాకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ తదితర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ ఏడాది జనవరి వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.92,000 కోట్లు వచ్చాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, జిల్లా కలెక్టర్లు ఉపయోగించని ప్రభుత్వ భూములను గుర్తించారు,
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం
ప్రపంచంలో ఇటీవల కాలంలో వరసగా భూకంపాలు నమోదు అవుతున్నాయి. టర్కీ భూకంప విషాదం ముగియకముందే పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ఆదివారం భూకంపం వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అస్సాం, భూటాన్ దేశం తూర్పు ప్రాంతాల వరకు ప్రకంపనలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12.12 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూటాన్ సరిహద్దుల్లోని పశ్చిమ కమెంగ్ లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు నమోదు కాలేదు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వతాలు అధికంగా భూకంపాలు సంభవించే జోన్ లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఇదిలా ఉంటే ఏదో ఓ రోజు హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ పెరుగుతోంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది ఉత్తరం వైపుగా కదులుతూ.. ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను నెట్టుతోంది. ఈ పరిణామం ఏదో సందర్భంలో భారీ భూకంపానికి దారి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి
రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసి నాయకులు కార్యకర్తలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నిన్న మహా శివరాత్రి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శివ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసిపి అఫీషియల్ ట్విట్టర్ లో జగన్ అభ్యంతరకర దుస్తులు ధరించి శివతత్వం గురించి ట్విట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. అలాంటివి పోస్ట్ చేసే నైతిక అర్హత వైసీపీ పార్టీకి గానీ ముఖ్యమంత్రికి కాని లేదన్నారు. హిందువులకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలోని శివాలయాల ఎదుట నిరసన దీక్షలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈమధ్య బీజేపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని హాస్టళ్ళను సందర్శించారని ప్రహరీ గోడలు లేక హాస్టల్ లలో పందులు కుక్కలు తిరుగుతున్నాయన్నారు.
చిన్నారి రేవతి మరణం బాధించింది
నాలుగేళ్ల కిందట నేను పోరాట యాత్ర చేస్తున్న సందర్భంలో విశాఖ నగరంలో కలిసిన చిన్నారి ఎస్. రేవతి శివైక్యం చెందిందన్న బాధాకర విషయం నా మనసును తీవ్రంగా కలచివేసింది. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోపి వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేది.. నాలుగేళ్ల కిందట నన్ను ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు ఉంటుందనుకుంటా. అటువంటి ఆరోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం నన్ను అబ్బురపరచింది.కొన్ని భక్తి గీతాలు కూడా నా ఎదుట పాడి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆమెకు నేను ఇచ్చిన మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ పై పాఠశాలకి కూడా వెళ్తుందని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను, అయితే తనకున్న వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం. తుది శ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్న వీడియో మనసును కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా, 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నారితో ఉన్న ఫోటో విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
మాజీ ఎంపీ పొంగులేటికి వ్యతిరేకంగా ఐక్యతా సమావేశాలు
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలు ఒక విషయంలో ఐక్యతారాగం వినిపిస్తున్నారు. వారంతా ఒక్క త్రాటి మీదకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం కొలిక్కి వస్తాయో కాని, వారి సమావేశాలు మాత్రం అందరిని ఆకర్షిస్తున్నాయంట. ఇప్పటికే ఒక్క దఫా హైదరాబాద్ లో సమావేశాలు అయిన నేతలు మరోసారి ఖమ్మంలో సమావేశం కానున్నారు. ఇది అంతా మాజీ ఎంపి పొంగులేటిని ఎదుర్కోవడం కోసం అధిష్టానం చూసించిన మేరకు జరుగుతున్నాయని తెలుస్తోంది. మ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ యేడాది ప్రారంభం నుంచి ఆత్మీయ సమావేశాల పేరిట మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో సస్పెన్షన్ ల పర్వానికి కూడా తెర తీశారు. అలా అధికార పార్టీలో ఇప్పుడు సంచనాలకు కారణం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపి గా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతలు ఒక్కటి అవుతున్నారు. ఇప్పటికే ఒక్కసారి హైదరాబాద్ లో నేతలు అందరు సమావేశం అయ్యారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఒక్కసారి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం అయ్యారు. మాజీ ఎంపి పొంగులేటి వర్గం వైపు ఎవ్వరు వెళ్లకుండా కట్టడి చేయాలని అదే విదంగా అందరు కలసి కట్టుగా ఉండాలని భావించారు.
ఈ లక్షణాలు ఉంటే మీకు లివర్ సమస్యలు ఉన్నట్టే
మన శరీంలో లివర్ 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మనజీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్ ఫిల్టర్ చేస్తుంది. మనంతిన్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను.. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రించేందుకు లివర్ కీలకంగా మారింది. ఇక ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను, కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అయితే.. చాలా వరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. అంతేకాకుండా.. లివర్ సమస్యలు ఉంటే కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కానీ.. నిజానికి, లివర్ సమస్యలను గుర్తించడం కష్టమే అని చెప్పాలి. మనకు సాధారణంగా, కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. మరికొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. అయితే.. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ.. ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే మీ లివర్‌లో సమస్య ఉందని అర్థం.
ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలబడ్డ జూనియర్ ఎన్టీఆర్
బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా కొనఊపిరితో పోరాటం చేసిన నందమూరి తారకరత్న కన్నుమూశారు. తారకరత్న అకాల మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి సంచలనంగా ఎంట్రీగా ఇచ్చారు. వచ్చీ రావడంతోనే ఒకే రోజు 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. ఏ హీరోకి ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. తారకరత్న 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా ఏ హీరో ఆయన రికార్డ్‌ని బ్రేక్ చేయలేకపోయారు. తారకరత్న ప్రారంభించిన తొమ్మిది సినిమాలలో.. ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న లాంటి సినిమాలు విడుదల కాగా.. కొన్ని పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయాయి. అయితే ఆయన ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీ నుండి అవకాశాలు లేక కనుమరుగై పోయారు. ఈయన నటించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత ఈయన నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.