బీసీలు చట్టసభల్లో కూర్చుని ఆత్మగౌరవం చాటుకుంటున్నారు
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జగన్ చేసిన న్యాయంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాసనమండలి సభ్యుల ఎంపిక నిర్ణయమేనని అందుకు నిదర్శనం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. జగనన్న పాలనలో సామాజికన్యాయం జరుగుతుందని నిరూపితమయిందన్నారు. చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం నాడు నినాదమైతే.. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానంగా అమల్లోకి రావడం ఒక బీసీ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇది గొప్పనిర్ణయం. ఈరోజు నూతనంగా ఎంపికజేసిన 18 మంది శాసనమండలి సభ్యుల్లో సామాజికన్యాయం పాటించి బీసీలకు పెద్దపీట వేయడం చరిత్రలో గుర్తుండాల్సిన రోజుగా చెబుతున్నాము. ఇన్నాళ్లూ తమకు సామాజిక గుర్తింపు లేదని .. తమకూ అవకాశాలిస్తే చట్టసభల్లో కూర్చొని ఆత్మగౌరవాన్ని చాటుకుంటామని ఉవ్విళ్లూరిన మా వర్గాల్ని ముఖ్యమంత్రి జగనన్న అక్కున చేర్చుకున్నారు. శాసనమండలి సభ్యుల నియామకంలో అరుదైన గొప్ప నిర్ణయం తీసుకుని అణగారిన వర్గాల కోరికలను నెరవేర్చారు. ఈ విషయం పట్ల సమాజంలో పెద్దలు, సామాజికవేత్తలు ఆలోచించాలని కోరుతున్నాను.
టిప్పు పేరు వాడకండి.. వాడితే చర్యలు తీసుకుంటాం
కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిప్పు సుల్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ టిప్పు సుల్తాన్ ను విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు టిప్పు పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై టిప్పు వారసులు స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్ పేరు ఉపయోగించవద్దని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టిప్పు సుల్తాన్ 7వ తరం వారసుడు సహబ్జాదా మన్సూర్ అలీ మాట్లాడుతూ.. టిప్పు సుల్తాన్ పేరును రాజకీయాల్లోకి లాగొద్దని, ఇలా చేస్తే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు టిప్పు కుటుంబం, అనుచరుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. టిప్పు కోసం ఏ పార్టీ కూడా ఏం చేయలేదని.. ఆయన పేరును ఓట్లను పొందేందుకే వాడుకుంటున్నాయని విమర్శించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు
కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ పి.జాషువా. గన్నవరం సంఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమై, జరిగిన ఘర్షణ లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది. పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు. తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమలు.ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
జెఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత.. పెరియార్, కారల్ మార్క్స్ ఫోటోలు దగ్ధం
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది. ఇది ఏబీవీపీ పనే అని జెఎన్‌యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ ట్వీట్ చేశారు. క్యాంపస్ లో మతసామరస్యానికి ఏబీవీపీ భంగం కలిగిస్తోందని ఆరోపించింది. ఈ చర్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఖండించారు. తమిళ విద్యార్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమిళ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వైస్ ఛాన్సలర్‌ను అభ్యర్థించారు. జెఎన్‌యూలో పెరియార్, కార్ల్ మార్క్స్ వంటి నాయకుల చిత్రాలను ధ్వంసం చేయడం, తమిళ విద్యార్థులపై ఏబీవీపీ దాడి చేయడం పిరికిపంద చర్య అని, అత్యంత ఖండనీయమని, యూనివర్శిటీ అడ్మిన్ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని స్టాలిన్ ట్వీట్ చేశారు.
సామాజిక న్యాయం.. జగన్ తోనే సాధ్యం
ఏపీలో సామాజిక న్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందన్నారు మంత్రి జోగి రమేష్. గతంలో అనేకమంది బలహీనవర్గాల వారు సీఎంలుగా చేశారు.. కానీ సామాజిక న్యాయం చేసింది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్టీ, ఎస్సీలు మైనారిటీల మీద ప్రేమ ఉంటే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతున్నా.. 2014 నుంచి 2019 వరకూ సామాజిక న్యాయం ఏం చేశావు.. 2019 నుంచి 2023 వరకూ జగన్ హయాంలో సామాజిక న్యాయం ఏం జరిగిందో చర్చిద్దాం.. ఆ చర్చలోనే చంద్రబాబు బట్టలిప్పి పారిపోయేలా చేస్తాం అన్నారు మంత్రి జోగి రమేష్. బలహీనవర్గాల వారికి డీబీటీ ద్వారా 2 లక్షల కోట్లు వారి చెంతకు చేర్చాం.. చంద్రబాబు హయాంలో ఆయన తాబేదార్లకు న్యాయం జరిగింది. చీఫ్ మినిస్టర్ టు కామన్ మేన్ బటన్ నొక్కుతుంటే.. ప్రతి గడపగడపకు న్యాయం జరుగుతోంది. బీసీ మేధావులు, బీసీలలో ఉన్న ఉపాధ్యాయులు అన్ని వర్గాల వారు జగన్ పక్షాన అడుగులు వేయాలని మంత్రి జోగి రమేష్ కోరారు.సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం అన్నారు. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్మేసుకున్నారన్నారు. ఒక జాలరి చట్టసభకు వెళుతున్నారంటే, ఒక వడ్డీ కులస్తులు శాసనమండలికి వెళుతున్నాడంటే అదంతా జగన్ చలవే అన్నారు. ఇవాళ బీసీలు అందరూ తలెత్తుకుని తిరగగలుగుతున్నారు. జాతీయ పార్టీలు కూడా జగన్ మార్గంలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి జోగి రమేష్. గన్నవరం సంఘటన గురించి నాకు తెలియదు.. చూసిన తర్వాత స్పందిస్తానన్నారు జోగి రమేష్. శాసనమండలి ఎన్నికల్లో ఎస్.సి.ఎస్ టి…బి.సి లకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. ఎమ్.ఎల్.ఏ.లు..ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించాం. రేపు ఎం.ఎల్.సి.అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు.స్థానిక ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తాం అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
పెళ్ళికి ముందే విరిగిన మంచం.. ముఖం చాటేసిన వరుడు
కాసేపట్లో పెళ్లి.. మండపంలో మతపెద్ద అన్నీ సిద్ధం చేసుకుని పెళ్లి చేయించేందుకు రెడీగా ఉన్నాడు. పెళ్లి కూతురు కూడా పెళ్లి బట్టలు ధరించి మండపంలోకి మత పెద్ద ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో పెళ్లికొడుకు ఎక్కడా అంటూ మతపెద్ద పిలుపు రానే వచ్చింది. హా ఇక్కడే అంటూ పెళ్లి కొడుకు.. మండపంలోకి రమ్మంటే రానని భీష్మించుకున్నాడు. ఏంటి నాయనా ఏమైంది అని అడుగగా నాకు ఈ పెళ్లి వద్దన్నాడు. విన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏమైంది చెప్పు అని అడుగగా అతడు చెప్పిన మాటలకు బంధువులంతా కంగుతిన్నారు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ లో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన వస్తువులనే వరుడికి పెట్టిపోతల కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు.
ఇలాంటి సినిమా తీయడం ఆషామాషీ కాదు
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సార్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి, నటీనటులు సంయుక్త మీనన్, సుమంత్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకను ప్రారంభించే ముందు ఇటీవల స్వర్గస్తులైన సినీ నటుడు నందమూరి తారకరత్నకు నివాళులు అర్పిస్తూ చిత్ర బృందం కాసేపు మౌనం పాటించారు.
సూపర్ హిట్ మూవీ రీమేక్ కి రంగం సిద్ధం…
సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వడం అనేది ఎన్నో ఏళ్లుగా తరచుగా జరుగుతున్నదే. తమిళ్, తెలుగు, మలయాళ హిట్ సినిమాల రైట్స్ ని హిందీ హీరోలు, నిర్మాతలు కొని నార్త్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పైన రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. కార్తీ ఖైదీ సినిమాని జయ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీగా ఈ రెండు సినిమాల్లాగే మరో చిన్న బడ్జట్ సూపర్ హిట్ సినిమా హిందీలో వెళ్తోంది. ప్రదీప్ రంగనాధన్, ఇవాన హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్ టుడే’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తమిళనాడులో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ 70 కోట్లకి పైగా రాబట్టి సెన్సేషనల్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ప్రేమించుకున్న ఒక జంట, తమ ఫోన్స్ మార్చుకుంటే వచ్చే ఇబ్బందిని ప్రదీప్ రంగనాధన్ సూపర్బ్ గా చూపించాడు. యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అయిన లవ్ టుడే సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు దిల్ రాజు. తెలుగులో కూడా లవ్ టుడే సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి ఇక్కడ కూడా హిట్ అయ్యింది. రెండు సౌత్ భాషల్లో హిట్ అవ్వడంతో హిందీ చిత్ర పరిశ్రమ దృష్టి లవ్ టుడే సినిమాపై పడింది.