శంభో శివశంభో.. భక్తులతో పోటెత్తిన మహానంది
మహా శివరాత్రికి శైవక్షేత్రాలు భక్తజనసంద్రంగా మారాయి. శివనామస్మరణతో , ఓంకార నాదంతో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది మారుమోగుతోంది. మహానంది క్షేత్రంలో అంగుళం స్థలం ఖాళీ లేకుండా జన సంద్రమైంది. ఆధ్యాత్మిక ,. సాంస్కృతిక కార్యక్రమాలు హంగామాతో తన్మయం చెందారు లక్షలాదిమంది భక్తులు. అర్ధరాత్రి దాటాక కమనీయంగా, కన్నుల పండుగగా మహానందీశ్వర స్వామి, కామేశ్వరి దేవి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగింది. మహానందీశ్వరుని సన్నిధిలో శివరాత్రి జాగరణ చెయ్యడానికి విచ్చేశారు వేలాది మంది భక్తులు. శివనామ స్మరణ చేస్తూ ఓంకారం పలుకుతూ క్యూ లైన్ లో నిరీక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు మహానందీశ్వర స్వామి. ఇటు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురంలో సుందరగిరిపై స్వయంభువుగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జ్వాలా సంపుటిత మహా సుదర్శన యజ్ఞం కన్నుల పండువుగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా లోక శాంతి కోసం యజ్ఞాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 17 వేల రుద్రనామాలతో రుద్రహోమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. యజ్ఞంలో 1331 కలశాలను ఉంచి సహస్ర కలషాభిషేకం చేశారు. శాలిగ్రామ అభిషేకాలు నిర్వహించారు.
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు
ఏపీలో ప్రశాంతమైన వాతావరణంలో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ముగిసాయి..రాష్ట్ర వ్యాప్తంగా 411 పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రిలిమినరీ పరీక్షలు ఏపీ వ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది.. ఉదయం మొదటి పేపర్, మధ్యాహ్నం రెండో పేపర్ కు 88 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు.. 411 పోస్టులకు 1,71,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 1,51,243 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.. రేపు ఉదయం 11 గంటల్లోపు రెండు పేపర్లకు సంబంధించి పోలీసు నియామక మండలి కీ విడుదల చేయనుంది.. వాటిపై అభ్యంతరాలను ఈ నెల 23 వ తేది లోపు తెలపాలని అభ్యర్థులను సూచించింది. ఇటు జిల్లా్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20కేంద్రాల్లో జరిగిన పరీక్షల్లో సుమారు 13వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో సెంటర్ల వద్ద అభ్యర్థుల హడావుడి కనిపించింది.
టొమేటో తింటే.. వీర్యం నాణ్యత పెరుగుతుందా?
ఇటీవలి కాలంలో వంధ్యత్వ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్ళయి ఏళ్ళు గడుస్తున్నా.. పిల్లలు కలగడం లేదు. ఏడాది.. రెండేళ్ళు.. ఐదేళ్ళు.. ఇలా పిల్లల కోసం భార్యాభర్తలు ఎదురుచూస్తున్నారు. వీర్యం నాణ్యతను మెరుగుపరిచేందుకు, పురుషుల సంతాన సామర్థ్యం పెంచే శక్తి టొమేటోలకు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. టొమాటోలలో ఉండే లైకోపీన్ అనే పోషక పదార్థం వీర్యం నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న పురుషులు రోజూ రెండు చెంచాల టొమేటో రసం తీసుకుంటే వారి వీర్యం నాణ్యత పెరుగుతుందని ఇంగ్లాండ్ కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై మరింత విస్తృత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో దాదాపు సగం మంది దంపతులు వంధ్యత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారని, సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై చేసిన అధ్యయనాల వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. వదులుగా ఉండే లోదుస్తులను ధరించడంతో పాటు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. మందులతో కాకుండా ఆహారం ద్వారా వీర్యంలో నాణ్యత పెంచుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు కూడా సాధ్యమైనంత మేరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, గర్భం దాల్చే అవకాశాలను పెంచేందుకు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
లంకపల్లితో తారకరత్నకు అనుబంధం.. ఏటా శివరాత్రికి పూజలు
తెలుగు రాష్ట్రాలు, సినీ అభిమానులు తారకరత్నను మరిచిపోలేక పోతున్నారు. 23 రోజులు మృత్యువు తో పోరాడి తారక్ రత్న కనుమూయడంతో నందమూరి కుటుంబంతో పాటు యావత్ సినీ లోకం, ఆయన అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్న వారు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తారకరత్న ఇక లేరన్న వార్త ఖమ్మం జిల్లా వాసుల్ని కలచివేసింది. ముఖ్యంగా ఆయన ఎక్కువగా సందర్శించే లంకపల్లి వాసులలో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సిని హీరో తారక్ రత్న కి నున్న రామకృష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహంతో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు వచ్చి అడవిలో కొలువై ఉన్న నీలాద్రీశ్వరుని దర్శించుకొని స్నేహితుడు రామకృష్ణ తో రెండు మూడు రోజులు గడిపేవారు తారకరత్న.2007 సంవత్సరం నుండి ప్రతి యేటా నీలాద్రీశ్వురుని దర్శించుకోవడం తారకరత్నకు పరిపాటిగా మారింది. ఆ పరమ శివుని దర్శించుకొని వెళ్లే క్రమంలో లంకపల్లి వాసులతో తారక్ కు మంచి అనుబంధం ఏర్పడింది. శివరాత్రి వచ్చింది అంటే చాలు లంకపల్లి కి తారక్ రత్న వస్తాడు అని నున్న రామకృష్ణ ఇంటి వద్ద తారక్ ని చూడటానికి ఫోటోలు దిగటానికి క్యూ కట్టేవాళ్ళమని మిత్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తారక్ రత్న ప్రతి ఒక్కరిని బంధుత్వం కలుపు కొని తమ్ముడు,బాబాయి అని అప్యాయతగా పలకరించే వారని చెబుతున్నారు.
బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు
నందమూరి బాలకృష్ణపై తారకరత్నకు అంతులేని అభిమానం.బాలయ్యను తారకరత్న ఆప్యాయంగా బాల బాబాయ్ అంటూ పిలుస్తుండేవాడు. బాలయ్య సిగ్నేచర్ ను తారకరత్న టాటుగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పుడు బాలయ్యే దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు.. బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ కూడా ఇప్పించారు. తాను ఎక్కడున్నా ప్రతి సోమవారం బెంగళూరు వెళ్లి తారకరత్న పరిస్థితి గమనించేవారు. కానీ శనివారం తారకరత్న చనిపోయిన తర్వాత.. ‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తెలియగానే బాలయ్య అన్న మొదటి మాట ఇది. తారకరత్న ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు బాలకృష్ణ. కానీ అవేవీ ఫలించలేదు. అయితే ఉదయం నుంచి తారకరత్న పెద్ద కూతురు.. నిషిక తండ్రి భౌతిక కాయం వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.
తాత అంటే ఇష్టం.. ఆయన పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు
నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తారకరత్న ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో తారకరత్న సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏ ఈవెంట్స్‌కి వెళ్లినా తన తాతగారు, బాబాయ్ గొప్పదనం గురించి చెప్పేవారు. కుటుంబం అంటే తారకరత్నకు అంత ఇష్టం. తారకరత్నకు తన తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ. అందుకు తన పిల్లలకు తాత ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. తాను అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారంతే తారకరత్నకు అమితమైన అభిమానం. తారకరత్నకు మొత్తం ముగ్గురు పిల్లలు. మొదటగా కుమార్తె పుట్టగా నిష్క అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు ఎన్టీఆర్ అని వచ్చే విధంగా తారకరత్న దంపతులు పెట్టుకున్నారు.
ప్లేస్‌మెంట్లలో సత్తాచాటిన విద్యార్థులు.. 87 శాతం మందికి జాబ్స్
ఆర్థిక మాంద్యం మరియు కోవిడ్ -19 తమపై విసిరిన సవాళ్లను అధిగమించి, సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం హైదరాబాద్ డీమ్డ్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు వార్షిక నియామకాలలో మంచి ప్రతిభ కనబరిచారు. వీరిలో 87 శాతం మందికి 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ప్లేస్‌మెంట్లు వచ్చాయి. ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో, GITAM హైదరాబాద్‌లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (CDC) డైరెక్టర్ డాక్టర్ వేణు కుమార్ నాథి మాట్లాడుతూ, అమెజాన్ GITAM యొక్క ఒక విద్యార్థికి సంవత్సరానికి రూ. 17.4 లక్షలు ఆఫర్ ఇచ్చిందని, అదే సంస్థలో విభిన్న పాత్ర కోసం మరో విద్యార్థికి సంవత్సరానికి రూ. 14 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలిపారు. మరో MNC కూడా ఏడాదికి రూ.23 లక్షలు ఆఫర్ చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక విద్యార్థి సాధించిన అత్యధిక ప్యాకేజీ ఇదే. క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టాప్ రిక్రూటర్‌లలో వర్టుసా, టీసీఎస్ డిజిటల్, బాష్ (బీజీఎస్‌డబ్ల్యు), డెల్ టెక్నాలజీస్, ప్రొడాప్ట్, టెక్ సిస్టమ్స్, కిండ్రిల్, వాల్యూమొమెంటమ్, ఇవై జిడిఎస్, హిటాచీ వంతరా కార్పొరేషన్, ము సిగ్మా మరియు ఇతరులు ఉన్నారు.
జనం అడవి బాట.. పక్షుల కోసం కెమేరాల వేట.. బర్డ్ వాచ్ ఫెస్టివల్
అందమైన పక్షులు..అంతకు మించి అడవి అందాల సొగసు..ఎగిరి సందడి చేసే పక్షుల కిలకిల రావాలు…ఆహ్లాదకరమైన వాతావరణం..భానుడి లేలేత కిరణాలు నేలను తాకుంటే అడవిలో అడుగులేస్తూ పక్షులను చూడ్డం…తమ కెమెరాల్లో బంధిస్తే ఆ కిక్కే వేరుకదా…ఇక కవ్వాల్ టైగర్ జోన్ లో అడుగుపెడితే ఆ థ్రిల్లింగే వేరు…ఎన్నో అనుభూతులు..ఎన్నో రకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించిన పక్షి ప్రేమికుల ఆనందం అంతా ఇంతా కాదు..చెప్పలేని ఆనందం …పట్టలేని ప్రకృతి ప్రేమలో తడిసి ముద్దయ్యేలా చేసిందే బర్డ్ వాచ్ ఫెస్టివల్ ..ఇంతకీ బర్డ్ వాక్ , బర్డ్ వాచ్ ఫెస్టివల్ ఏంటీ…కవ్వాల్ టైగర్ జోన్ లో జరిగిన ఆవిశేషాలేంటో తెలుసుకుందాం. కవ్వాల్ టైగర్ జోన్ అందరికి తెలుసు..దేశంలోని పులుల ఆవాసకేంద్రాల్లో ఇదొక్కటి..జన్నారం మండలంలోని ఎక్కువ భాగం విస్తరించిన ఈఅడవుల్లో ఇప్పుడు బర్డ్ వాచ్ పెస్టివల్ కు పెట్టింది పేరుగా మారిపోయింది…ఒక్కటి రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఇక్కడి అధికారులు .బర్డ్ వాచ్ ఫెస్టివల్ నిర్వహించి అడవిలోని మైసమ్మకుంట, గనిషెట్టి కుంట,కల్పకుంటలో పక్షిప్రేమికులు రెండు రోజుల పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు..పట్టణాల్లో తిరిగే వారంతా ఇప్పుడు అడవి బాటపట్టారు. భుజాన కెమెరాలు వేసుకుని పచ్చని అడవుల్లో కాలినడకన తిరగాడుతున్నారు…అరుదైన పక్షులను తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందంగా ముందుకు సాగారు, ఢిల్లీతోపాటు హైదరాబాద్ ,కరీంనగర్ ,ఆదిలాబాద్ ,తోపాటు సుదూర ప్రాంతాలనుంచి 72 మంది బర్డ్స్ లవర్స్ తరలి రాగా వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా రాత్రి క్యాంప్ ఫైర్ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ముగిసిన తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు
తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. అయితే ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, సుప్రియతో పాటు కోశాధికారిగా టి.రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిగిలిన పోస్టులకు ఎన్నికలు జరిగాయి. సి. కళ్యాణ్ ఆధ్వర్యంలోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్, దిల్ రాజు ఆధ్వర్యంలోని ప్రోగ్రసీవ్ ప్రొడ్యూసర్స్ పానెల్ ఈ పోటీలో తలపడ్డాయి. మొత్తం 1134 ఓట్లకుగాను 677 ఓట్లు పోలయ్యాయి. అందులో రెండు ఓట్లు చెల్లలేదు. ఇక అధ్యక్షుడిగా దిల్ రాజు ప్యానెల్ కి చెందిన కె.ఎల్. దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ ప్యానెల్ క్యాండిడేట్ జెమినీ కిరణ్ పై 24 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 16 రౌండ్స్ లో 15 రౌండ్లలో దామోదర ప్రసాద్ ఆధిపత్యం కనబరిచారు. ఒక సమయంలో ఇద్దరికీ సమానమైన ఓట్లు రావటంతో ఇరువర్గాలలోనూ ఆందోళన నెలకొంది. అయితే చివరికి దాము విజయం సాధించారు. ఇక ప్రధాన కార్యదర్శులుగా కళ్యాణ్ ప్యానెల్ తరపున టి. ప్రసన్నకుమార్(397), వైవియస్.చౌదరి (380) భారీ అధిక్యంతో గెలిచారు. ఉప కార్యదర్శులుగా దిల్ రాజు ప్యానెల్ తరపున భరత్ చౌదరి (412) ఘన విజయం సాధించగా, కళ్యాణ్ మద్ధతులో స్వతంత్ర అభ్యర్ధి నట్టికుమార్ (247) గెలిచారు.