భాషాపండితులపై సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి : టీఎస్‌యుటీఎఫ్
పదోన్నతులు దక్కటం లేదనే ఆవేదనతో నిరసన తెలుపుతున్న పండితులను సస్పెండ్ చేయటాన్ని టీఎస్‌యుటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. టీఎస్‌యుటీఎఫ్ నేతలు తాజాగా ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అందులో.. సంవత్సరాల తరబడి ప్రమోషన్ లేకపోయినా, పాఠశాలల్లో వివక్షకు గురౌతున్నా….విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉన్నత తరగతులు బోధిస్తున్న భాషా పండితులకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పోస్టులు అప్ర్గేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారని టీఎస్‌యుటీఎఫ్ పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్లో కూడా తమ పదోన్నతుల అంశం లేకపోవడంతో ఆవేదనకు గురైన భాషా పండితులు తమ.జాబ్ చార్ట్ లో లేని హైయర్ క్లాస్ బోధన చేయబోమని ఇచ్చిన పిలుపు నిరసన మాత్రమే అన్నారు. అయినా వారు అనధికారికంగా పాఠాలు బోధిస్తూనే ఉన్నారని, నిరసన లేఖల ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి విద్యాధికారులు భాషా పండితులపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమన్నారు. డీఈఓల చర్యను టీఎస్‌యుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని, భాషాపండితులపై వేసిన సస్పెన్షన్ వేటు వెంటనే ఎత్తివేయాలని, పదోన్నతులపై ఉన్న కేసును ప్రభుత్వం చొరవతీసుకుని వేకెట్ చేయించి, ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్లోనే పండితులకు సైతం పదోన్నతులు ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నదన్నారు.
ఈశా ఆశ్రమంలో మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్
మహాశివరాత్రి పురస్కరించుకుని కోయంబత్తూరు లోని ఈశా ఆశ్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దంపతులు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించిన సద్గురు ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొనేందుకు తన సతీమణి తో కలిసి కోయంబత్తూరు ఈశా ఆశ్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో : వల్లభనేని వంశీ
చంద్రబాబు పెద్ద సైకో.. లోకేష్ పిల్ల సైకో అని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆడొళ్ల బొమ్మలతో నా ఫొటో పెట్టి వల్లభ వల్లభ అని పాటలు పెట్టే మానసిక దౌర్భల్యం లోకేషుదే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐటీడీపీనే ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ ఆడొళ్లని అడ్డం పెట్టుకుని బతుకుతారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడినని చంద్రబాబు, ఎన్టీఆర్ మనవడినని లోకేష్ పదే పదే చెప్పుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్జూరపు నాయుడు కొడుకునని, మనవడినని చంద్రబాబు, లోకేషులు ఎందుకు చెప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ లవి కృష్ణదేవరాయల డీఎన్ఏ ఏంటో అర్థం కావడం లేదని, ఎవరైనా డీఎన్ఏ అంటే తల్లిదండ్రుల పేర్లు చెబుతారు.. కానీ చంద్రబాబు, లోకేషులవి కృష్ణ దేవరాయలు డీఎన్ఏ అని టీడీపీ నేతలు ఎందుకు చెబుతున్నారో..? అని ఆయన ఎద్దేవా చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో లోకేష్ ఎలా చదువుకున్నారో అందరికీ తెలుసు అని, లోకేష్ చదువులకు డబ్బెవరు పంపారో ప్రజలందరికీ తెలిసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. పకోడి గాళ్లంతా నాకు డిపాజిట్ లేకుండా చూస్తామంటున్నారు.. వేరే వాళ్లెందుకు.. చంద్రబాబో.. లోకేషో రావచ్చు కదా..? అని ఆయన సవాల్ విసిరారు.
ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..
జీఎస్టీ పరిహారం బాకాయిలు రూ.16,982 కోట్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని మండలి భావించినట్లు తెలిపారు. జూన్ నెల వరకు రాష్ట్రాలకు రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు. పాన్ మసాలా, గుట్కా పరిశ్రమలు పన్నులను ఎగవేస్తున్నట్లు మంత్రుల బృందం మండలిలో ప్రస్తావించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ పై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ ట్రిబ్యునల్ లో ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలని సభ్యులు ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దీనికి అధ్యక్షత వహించాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి టెక్నికల్ సభ్యులకు చోటు ఇవ్వాలని సూచించారు.
ఇదిలా ఉంటే కొన్ని వస్తువులపై కౌన్సిల్ జీఎస్టీని తగ్గించింది. కంటైనర్లకు అతికించే ట్యాగ్ లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. బెల్లం పాకంపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే ముందుగా ప్యాక్ చేసి, సీల్ చేసిన బెల్లం పాకానికి జీఎస్టీ 5 శాతం ఉంటుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
రెండో పెళ్లి వద్దన్నందుకే హత్య.. అంతకు ముందే నిక్కీ-సాహిల్ పెళ్లి
శ్రద్ధా వాకర్ హత్య తర్వాత ఢిల్లీలో చోటు చేసుకున్న నిక్కీ యాదవ్ హత్య సంచలనంగా మారింది. సహజీవనంలో ఉన్న 23 ఏళ్ల నిక్కీ యాదవ్ ను, అతని ప్రియుడు సాహిల్ గెహ్లాట్(24) ఛార్జింగ్ కేబుల్ తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచి పెట్టి మరో యువతిని వివాహం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సహజీవనంలో ఉన్నారని అనుకున్నప్పటికీ.. నిక్కీ యాదవ్- సాహిల్ గెహ్లాట్ కు అంతకుముందే పెళ్లి అయిందని పోలీసులు తెలిపారు.
వీరిద్దరికి 2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిక్కీ యాదవ్ ను పెళ్లి చేసుకోవడంపై సాహిల్ కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని.. తరుచుగా నిక్కీని వెళ్లిపోవాలని కోరారు. ఈ హత్యలో సాహిల్ కుటుంబంతో పాటు స్నేహితుల ప్రమేయం ఉండటంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాహిల్ తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేష్, అమర్‌లను అరెస్టు చేశారు.
ఇష్టమైన ఫుడ్ దొరికింది.. కోహ్లీ కాక కుమ్మేస్తాడు పో!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. అంతమాత్రాన సొంత ఊరుకు వెళ్లి మనకు నచ్చిన ఫుడ్ తినకపోతే ఎలా! ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేశాడు. కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. నార్త్ ఇండియాలో మాత్రమే దొరికే చోలే బటురే(రోటి, శనగల కూర).ఈ కాంబినేషన్ అంటే కోహ్లీకి అమితమైన ప్రేమ. మీకు అనుమానంగా ఉంటే గూగుల్‌లో కోహ్లీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని వెతికితే కనిపించే పేరు చోలే బటురే. ఈ వంటకం తింటే తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని కోహ్లీ కూడా చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా దానిని మరోసారి నిరూపించాడు విరాట్.
నటుడు జోగినాయుడుకి కీలక పదవి
ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగినాయుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎల్. జోగి నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. జోగి నాయుడు 1998 లో జెమిని టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ అనే కార్యక్రమంతో పేరు తెచ్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో మరో వ్యాఖ్యాత కృష్ణంరాజుతో కలిసి సినిమాల గురించి ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ సమీక్షించేవారు. దర్శకుడు అవుదామని హైదరాబాదుకు వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో ప్రవేశించాడు. కొద్ది రోజులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు.
సీఎం కేసీఆర్‌కు వేములవాడ రాజన్న శాపం తగులుతుంది : బండి సంజయ్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణకాశీగి పేరుగాంచిన వేములవాడ శ్రీరాజారాజేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. వేములవాడను సీఎం కేసీఆర్ కావాలనే పక్క ప్లాన్ ప్రకారం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొండగట్టు వరకూ వచ్చిన సీఎం కేసీఆర్ వేములవాడకు రాకపోవడం నిధులు ప్రకటించక పోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు వేములవాడ రాజన్న శాపం తగులుతుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పాలన పోవాలి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. వేములవాడ రాజన్న పేదల దేవుడని, కేసీఆర్ హిందూ ద్రోహి పేదల ద్రోహి అని ఆయన వ్యాఖ్యానించారు.
మాస్ మహారాజా.. నీ గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉందయ్యా
ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఇదే జోష్ తో తన తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ నటిస్తుండగా హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శివరాత్రి పండగను పురస్కరించుకొని రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్యార్ లోనా పాగల్ నేను అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మాస్ మహారాజా స్వయానా ఈ సాంగ్ ను పాడడం విశేషం. పప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారి ఫంక్షన్ కు వెళ్లిన హీరో తన ప్రేమకథను చెప్పే సందర్భంలో ఈ సాంగ్ వస్తున్నట్లు తెలుస్తోంది.