పునీత్ నుంచి తారకరత్న దాకా.. 18నెలల్లో ఏడుగురు మృత్యువాత
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు నటుడు తారకరత్న. అనారోగ్యంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు తారక రత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు..ఉదయం 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు భౌతిక కాయం తరలించనున్నారు..మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లోనే తారక రత్న భౌతిక కాయం అక్కడే ఉంటుంది. మధ్యాహ్నం 3.30 తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ నుంచి తారకరత్న దాకా.. గుండెపోటుతో 18 నెలల్లో ఏడుగురు సెలబ్రెటీలు మృత్యువాత పడడం విషాదం నింపింది. నిత్యం వ్యాయామం చేసేవారినీ హార్ట్ ఎటాక్ లు వదలడం లేదు. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం విషాదం కలిగిస్తోంది. విభ్రాంతికరంగా మారింది. అభిమానుల్లో విషాదం నింపుతున్న సెలబ్రెటీల మరణాలకు కారణం ఏంటో తెలియాల్సి ఉంది. గుండెపోటు.. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా నాలుగు పదుల వయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది.
యువకుడిని బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్
ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఎందరో జీవితాల్ని నాశనం చేశాయి. కొందరి ప్రాణాల్ని సైతం బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. చేతికి అందివచ్చిన కొడుకుని పొట్టనబెట్టుకుంది. తల్లి దాచిన బంగారాన్ని బెట్టింగ్‌లో ఓడిపోవడం, తల్లి నిలదీయడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు రాజశేఖర్ (26) ఇంటర్మీడియట్ వరకు చదివాడు. కొంతకాలం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్.. గత సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్లేయింగ్ కార్డ్స్, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఏదో ఒకరోజు జాక్‌పాట్ తగులుతుందన్న ఆశతో.. అతడు బెట్టింగ్స్ వేయడం షురూ చేశాడు. అయితే.. ఆ బెట్టింగ్స్ వల్ల ఇతనికి డబ్బులు రాకపోగా, అప్పుడు ఎక్కువ అయ్యాయి. మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. బీరువాలో తల్లి శశికళ దాచిపెట్టిన బంగారాన్ని సైతం కుదవపెట్టి, బెట్టింగ్‌లో ఓడిపోయాడు.
నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై
దేశరాజకీయాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాట్ టాపిక్. ఆమె ఇటు తెలంగాణతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్….. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కిందపడ్డారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా…. కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు. ఆమె వెంట ఉన్న అధికారులు, సిబ్బంది ఆమె పైకి లేచేందుకు సాయం చేశారు. తాను కిందపడ్డా బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని ఈ సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ చమత్కరించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదో కానీ తాను కింద పడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందన్నారు. మొత్తం మీద తమిళిసై స్వంత రాష్ట్రంలో చేసిన పర్యటన కూడా చర్చనీయాంశం అయింది.
కంటోన్మెంట్ కి ఉప ఎన్నికల లేనట్టే.. ఎందుకంటే?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. నేడు బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉండవు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 151A ప్రకారం, ఎన్నికల సంఘం కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహించదు. ఈ చట్టం ప్రకారం జి. సాయన్నకు ఎమ్మెల్యేగా ఏడాది పదవీ కాలం లేదు కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. సాయన్న ఎమ్మెల్యేగా పదవీకాలం కేవలం తొమ్మిది నెలలే మిగిలి ఉంది. సాధారణంగా, ఒక ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే లేదా ఉప ఎన్నిక నిర్వహించే స్థితిలో EC లేనట్లయితే ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించదు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని 151A ప్రకారం, సెక్షన్ 147, 149, 150 మరియు 151లో పేర్కొన్న ఖాళీల భర్తీకి కాల పరిమితి ఇలా చెబుతోంది, “సెక్షన్ 147, సెక్షన్ 149, సెక్షన్ 1151 మరియు సెక్షన్ 1151, ఏదైనా ఖాళీని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక పేర్కొన్న విభాగాలు ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో నిర్వహించబడతాయి.
రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా?
మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. ఈ వ్యక్తులు రోజులో అనేక కప్పుల టీ తాగుతూనే ఉంటారు. అయితే, టీని ఇష్టపడే చాలా మంది దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే ఆనారోగ్యాల గురించి పట్టించుకోరు. అసలు ఈ టీని తాగితే ఏమవుతుంది.. ఎంత పరిమితిలో తీసుకోవాలో తప్పకుండా తెలుసుకోవాలి. టీలో కెఫీన్, షుగర్ రెండూ ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. రోజుకి 5 నుంచి 10 కప్పుల టీ తాగుతున్నారంటే ఎక్కడో ఒక చోట మీరే పొరపాటు చేస్తున్నట్లే. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పాలి. టీ తాగడం వల్ల ఎటువంటి హాని లేదు. అందులోనూ ఈ పానీయం శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఇది మనల్ని రిఫ్రెష్ చేయడానికి, మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఇదంతా మనం ఒక పరిమితికి మించి టీ తాగితేనే. అంతకు మించితే.. అది మలబద్ధకం, గుండెల్లో మంట, ప్రేగులపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఎసిడిటీ, అధిక రక్తపోటు తదితర సమస్యలు అధికంగా టీని సేవించడం ద్వారా తలెత్తవచ్చు.
కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?
అనవసరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. వధుకు పెళ్లి నచ్చకపోవడం లేదా వరుడు పెళ్లి నచ్చకపోవడం ఇలాంటి కారణాతో పెళ్లి ఆగిపోతూఉంటుంది. దీని ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ పాతబస్తీ చంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మేనఫాతిమాకు చంద్రయాణాగుట్ట బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న వరుడు జక్రియతో పెళ్లి నిశ్చయించారు. ఇది ప్రేమ వివాహం కూడా కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతా హడావుడిగా బయలు దేరి పెళ్లికి రెడీ అయ్యారు. పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒకరినొకరు ఏకమయ్యే వేళ. పెళ్లి మండపం నిశ్శబ్ద వాతావరణం. అసలు ఏం జరిగిందో తెలియని ఆయోమయంలో కొందరు వుంటే మరికొందరు షాక్ లో వున్నారు.
గుజరాత్ లో నోట్ల వర్షం.. దేశమంతా ఇదే చర్చ
ప్రస్తుతం గుజరాత్‌లో ఓ పెళ్లి వార్త వైరల్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ ఇంట వివాహం ఆ ప్రాంతంలోనే కాకుండా దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లిలో ఏం జరిగిందనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఓ మాజీ సర్పంచ్ ఇంటి పై కప్పుపై 100, 500 రూపాయల నోట్ల వర్షం కురిసింది. తన మేనల్లుడి పెళ్లికి రూ.లక్షలు వెచ్చించినట్లు సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. గుజరాత్‌లోని మెహసానాలోని అగోల్ గ్రామ మాజీ సర్పంచ్ కరీం యాదవ్‌కు మేనల్లుడు రజాక్‌తో వివాహం జరిగింది. పెళ్లిలో మాజీ సర్పంచ్ కరీం యాదవ్ నోట్ల వర్షం కురిపించారు. ఇతను కేక్రి తహసీల్‌లోని అంగోల్ గ్రామ మాజీ సర్పంచ్. ఇంటి పైకప్పుపై నిలబడి రూ.100, రూ.500 నోట్లను ఊపుతూ గాల్లోకి వదిలారు. ఇంటి కింద జనం గుమిగూడి సేకరించారు. నోట్లను తీసుకోవడానికి పలువురి మధ్య గొడవ కూడా జరిగింది.
పరిహారం కోసం రైతుల పోరుబాట
అక్కడి రైతులు పరిహారం కోసం పోరు బాటపట్టారు..పండగ రోజు సైతం దీక్ష కొనసాగించారు…రిజర్వాయర్ కోసం భూములిస్తే పరిహారం ఇవ్వడంలేదంటూ ఆందోళన బాటపట్టారు..టెంట్ వేసుకోని మరీ పనిప్రదేశంలో దీక్షలకు దిగారు అన్నదాతలు..ఇంతకీ ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోఠి రైతుల బాధేంటీ..అధికారులేమంటున్నారు..పరిహారం చెల్లింపుల్లో పరిహాసం ఏంటీ. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లో చనాక కోర్టా బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారు.. అయితే దీనికి సంబందించిన హత్తీ ఘాట్ పంప్ హౌజ్ నుంచి నీరు ఎత్తిపోస్తే గ్రావిటీ ద్వారా పిప్పల్ కోటి శివారులో రిజర్వాయర్ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది… పిప్పల్ కోటి రిజర్వాయర్ 368 కోట్ల అంచానా వ్యయం తో 1.423 టీఎంసీ ల సామర్థ్యం తో నిర్మాణం ప్రారంభించింది…అయితే దీనికోసం 1024 ఎకరాల భూమి అవసరం కాగా ముందు గ్రావిటీ కాల్వ,ఆనకట్ట కట్టడం కోసం 187 ఎకరాలు 8 లక్షల చొప్పున పరిహారం చెల్లించి తీసుకున్నారు….ఇంతవరకు బాగానే ఉన్న మిగతా 837 ఎకరాలకు అదే ధర కాకుండా తగ్గించి అంటే 7 లక్ష 8 వేల 517 రూపాయల చొప్పునకట్టించి భూమి తీసుకునేందుకు సిద్దం అయ్యాయారు..కాని భూముల ధరలు పెరుగుతున్న దృష్ట్యా సర్కార్ తగ్గించి పరిహారం చెల్లిస్తుందా అంటూ రైతులంతా ఆందోళన బాటపట్టారు..వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
మరో రిమేక్‌తో వస్తున్న అజయ్ దేవ్‌గన్.. న్యూ అప్డేట్
అజయ్ దేవగన్ చివరి చిత్రం దృశ్యం 2, బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. అన్ని హిందీ రీమేక్‌లు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పుడు, అజయ్ దేవగన్ యొక్క దృశ్యం 2 మాత్రమే రీమేక్ అయినప్పటికీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ స్టార్ నటుడు మరో సౌత్ రీమేక్‌తో మళ్లీ వచ్చాడు. భోలా అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం సౌత్ బ్లాక్ బస్టర్ ఖైతీకి రీమేక్. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.అజయ్ దేవగన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు కీలక మార్పులు చేసాడు. మొదటగా నటుడు ఇన్‌స్పెక్టర్ పాత్ర కోసం ఒక మహిళా స్టార్‌ని తీసుకున్నారు. దీనిని ఒరిజినల్‌లో నారాయణ్ పోషించారు. భోలాలో టబు ఈ పోలీసు పాత్రను పోషిస్తుంది. ఇది చాలా కాలం క్రితం రివీల్ చేయబడింది. ఇప్పుడు బృందం మొదటి పాటను విడుదల చేసింది. అజయ్‌కు జోడీగా డస్కీ బ్యూటీ అమలా పాల్ నటిస్తోంది. ఒరిజినల్ వెర్షన్‌లో రొమాంటిక్ ట్రాక్ లేదు మరియు అజయ్ దేవగన్ ఇప్పుడు రీమేక్‌కి ఈ కీలక మార్పు చేసాడు.