తారకరత్నకు కన్నీటి వీడ్కోలు.. వడివడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు
యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనయింది. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఉ. 8:45 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం అవుతుది. తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు జనం తరలి వస్తున్నారు. నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ ని తెస్తున్న సమయంలో అంబులెన్స్ వెనకే వచ్చిన బాలయ్య, ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం పక్కనే నిలబడి ఉన్నాడు. విజయ్ సాయి రెడ్డి, నందమూరి రామకృష్ణ, ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కూడా వేదికపైనే నిలబడి ఉన్నారు. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుల దౌర్జన్యం
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడు ఇంతియా బాషా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి పక్కనే నివాసం ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఇంతి యాజ్ అనే వ్యక్తి 20 మందితో కలిసి తమపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్నూలు పాతబస్టాండు అర్బన్ బ్యాంకు ఎదురుగా మున్సిపల్ ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం పక్కనే చింత కృష్ణయ్య కుమారుడు చింత నరసింహయ్య (ఇంటి నంబరు 67/53) కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. మున్సిపల్ స్థలంలోంచే నరసింహయ్య కుటుంబం రాక పోకలు సాగిస్తోంది. అయితే.. ఈ స్థలంపై కన్నేసిన ఇంతియాజ్ దానిని ఆక్రమించి చిన్న గుడిసె నిర్మించారు. పక్కింటివారు ఎవరూ కూడా ఈ దారిలో నడవరాదని ఇంతియాజ్ ఆంక్షలు విధించారు. ఆ ఇంటికి వేరే దారి లేదు. ఈ నేపథ్యంలో బాషా ఆక్రమించుకున్న మున్సిపాలిటీ స్థలాన్ని నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరుతూ నరసింహయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతియాజ్ కూడా హైకోర్టుకు వెళ్లి తనకు ఇంజక్షన్ ఆర్డరు ఇవ్వాలని కోరారు. ఇంతి యాజ్ పిటిషన్ను 2017 ఆగస్టు 18న హైకోర్టు కొట్టేసింది.
మోర్బీ వంతెన…విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
గతేడాది గుజరాత్‌తో మోర్బీ వంతెన కూలిన ఘటన గుర్తుందా? ఈ ప్రమాదంలో మొత్తం 135 మంది మరణించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణలో.. కూలడానికి ముందే ఈ బ్రిడ్జిలో చాలా లోపాలు ఉన్నాయని తేలింది. కేబుల్‌పై దాదాపు సగం వైర్లు తుప్పుపట్టడం, పాత సస్పెండర్లను కొత్తవాటితో వెల్డింగ్ చేయడం వంటి తప్పిదాలు.. ఈ వంతెన కూలిపోవడానికి దారతీశాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. వంతెన మరమ్మత్తులు, నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ బేనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ తదితరులు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. 1887లో మచ్చు నదిపై బ్రిటీష్ వాళ్లు నిర్మించిన ఈ వంతెనలో రెండు ప్రధాన తీగలున్నాయి. గతేడాది అక్టోబర్ 30న ఆ వెంతనే కూలిపోవడానికి ముందే.. ఆ రెండు కేబుల్స్‌లోని ఒక కేబుల్ తుప్పు పట్టిపోవడంతో పాటు అందులోని సగానికి పైగా వైర్లు తెగిపోయి ఉండొచ్చని సిట్ గుర్తించింది. నదికి ఎగువన ఉన్న ఆ కేబుల్ తగిపోవడం వల్లే.. ఈ విషాదం చోటు చేసుకుందని సిట్ పేర్కొంది.
రెంటల్ కి డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ
రోజులు మారుతున్నాయి. పరిస్థితులు కుదుటపడుతున్నాయి. మన దేశంలోని వివిధ రంగాల్లో మళ్లీ కరోనా ముందు నాటి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అద్దె ఇళ్ల మార్కెట్ దీనికి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లినవాళ్లు ఇప్పుడు క్రమంగా నగరాలకు చేరుకుంటున్నారు. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో సిటీల్లో అద్దెకు ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ఈ డిమాండ్‌కు తగ్గట్లు సప్లై లేకపోవటంతో యజమానులు ఇళ్ల అద్దెలను.. మిద్దెలు దాటిస్తున్నారు. ఫలితంగా.. 2022వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇళ్ల అద్దెలు పదమూడున్నర శాతం భారమయ్యాయి. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవల్లో రెంట్లు యావరేజ్‌గా 7 శాతం బరువయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే సగటున ఈ మేరకు అద్దెలు మోపయ్యాయి. పోయినేడాది మొత్తమ్మీద రెంటల్ హౌజింగ్ డిమాండ్ ఎనిమిదిన్నర శాతం పెరగ్గా సప్లై మాత్రం 17 శాతం పడిపోయింది. స్వగ్రామాలకు వాపస్ వెళ్లినవాళ్లు తిరిగి వలస బాట పడుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల టైం
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 79,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆదివారం 21,504 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు హుండీల లెక్కింపు మరింత సులభతరం కానుంది. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి హుండీలో రోజుకే కోట్లాది రూపాయలు కానుకగా వచ్చిపడుతుంటాయి. రోజూ కనీసం 4 నుంచి 5 కోట్ల రూపాయల కానుకలు వస్తాయి. వాటిలో వచ్చే నగదుని లెక్కించడం అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్.. కారణం ఇదే
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. మధ్యతరగతి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినైనా మోసం చేయడం ఇలా అరెస్ట్ కావడం ఆయనకు ఇది నాలుగోసారి. ఇటీవల అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన శ్రీధర్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ట్రాక్టర్లు ఇస్తానని చెప్పి రూ. 250 కోట్లు మోసం చేశారంటూ అమితాబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ రావు కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ లో శ్రీధర్ రావు ఉన్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అలాగే శ్రీధర్ రావు గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. శ్రీధర్ రావు హైదరాబాద్‌తో పాటు ముంబైలో పలువురు బిల్డర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీధర్‌రావుపై గతంలో అసహజ లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. జిమ్ ట్రైనర్ అయిన తనపై శ్రీధర్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. సనత్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గతేడాది గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్‌పై శ్రీధర్‌రావు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ కొన్ని కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్ పై విడుదలయ్యారు.
టీసీఎస్ లో తీసివేతల్లేవ్.. కూడికలే. మరిన్ని వార్తలు
జీ20 దేశాల ఆర్థికమంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల మీటింగ్ ఈ నెలాఖరులో.. అంటే.. శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరగనుంది. జీ20 దేశాలకు ఇండియా అధ్యక్షత చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి సమావేశమిది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ భేటీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సహధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జీ20 దేశాలతోపాటు ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన దేశాల ఆర్థిక మంత్రులు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల గవర్నర్లు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులు.. మొత్తం 72 మంది హాజరవుతారని భావిస్తున్నారు. తమ సంస్థలో ఉద్యోగుల తీసివేతలు ఉండవని, కూడికలు మాత్రమే ఉంటాయని ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ పేర్కొంది. ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి కొనసాగిస్తాం తప్ప ఇంటికి పంపే ఉద్దేశంలేదని స్పష్టం చేసింది. వేతనాల పెంపు విషయంలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వ్యాపార పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గతంలో మాదిరిగానే ఇంక్రిమెంట్లు ఉంటాయని తెలిపింది. స్టార్టప్ సంస్థల్లో పనిచేసి ఇటీవల లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది. ఈ సంవత్సరం కొత్తగా 40 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది.
వందకే పఠాన్ టికెట్.. ఆ రికార్డుల కోసమేనా ఇదంతా
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని చూపిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్, ‘పఠాన్’ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ పఠాన్ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. మరో రెడ్ను రోజుల్లో ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీ ఉంది. మూడు వారాలుగా బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న షారుఖ్ అండ్ యష్ రాజ్ ఫిల్మ్స్ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశాయి. హిందిలో పఠాన్ సినిమా 496 కోట్లు రాబట్టి, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో ఉంది. పఠాన్ కన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 సినిమా ఉంది. ఈ మూవీ 511 కోట్లని రాబట్టి 2017 నుంచి టాప్ ప్లేస్ లో ఉంది. పఠాన్ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యాలి అంటే ఈ వీకెండ్ వరకూ థియేటర్స్ ని హోల్డ్ చెయ్యాలి.