రజాకార్ల పాలనను తరిమికొడతా : బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అవిష్కరించారు. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రజాకార్ల పాలనను తరిమికొడతానన్నారు. రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని ఆయన వ్యాఖ్యానించారు. ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శివ లింగంపై మూత్రం పోయడానికి ప్రయత్నించిన మొగల్స్ ను తరిమికొట్టిన యోధుడు శివాజీ అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ కోసం పనిచేయడమే నాకు ముఖ్యమని, రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించబోనని, ధర్మం కోసం రాజకీయాలు చేస్తానన్నారు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదని, అయినా హిందూ ధర్మాన్ని కించపర్చడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఫాల్తుగాళ్లు హిందూ మతాన్ని కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయమని, అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్.
అది పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక.. ?
హీరోయిన్లు.. గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండాలంటే.. తమ అందాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. అందాన్ని బట్టే ఒక విలువ ఉంటుంది అనేది నమ్మదగ్గ విషయం. అందుకే హీరోయిన్లు అందం కోసం జిమ్ లు, యోగాలు, అవేవి కాకపోతే సర్జరీలు, ఇంజక్షన్స్ వాడుతూ ఉంటారు. ఇందులో నిజం ఎంత అనేది వారికి మాత్రమే తెలుసు. అందం కోసం కాకుండా చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నవారిని ఇంజక్షన్స్ చేసి వయసు పెరిగేలా, తగ్గేలా చేస్తారు అని ఇండస్ట్రీలో ఒక పుకారు ఉంది. ఒకప్పుడు బేబీ షాలినికి ఇంజక్షన్స్ ఇచ్చి వయస్సు కనపడకుండా చేసారని రూమర్ ఉంది. ఇక కుర్ర బ్యూటీ హన్సికకు ఇంజక్షన్స్ ఇచ్చి త్వరగా వయస్సు పెరిగేలా చేసారంటూ వార్తలు వచ్చాయి. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన విషయం తెల్సిందే. 8 ఏళ్ళ వయస్సులోనే ఆమె నటించడం మొదలుపెట్టింది. దీంతో అలా నటించడానికి హన్సిక తల్లిదండ్రులు ఆమెకు ఇంజక్షన్స్ ఇచ్చినట్లు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
ఇక తాజాగా ఈ వార్తలపై హన్సిక, ఆమె తల్లి స్పందించారు. హన్సిక వెడ్డింగ్ ను.. హన్సిక లవ్ షాదీ డ్రామా అనే పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒక సిరీస్ లా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. అందులో ఈ విషయాన్ని వారు పంచుకున్నారు. “నేను 22 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు కొంతమంది నామీద చెత్త వార్తలు చెప్పుకొచ్చారు. నేను త్వరగా పెరగడానికి మా అమ్మ నాకు ఇంజక్షన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నా గురించి, నా కుటుంబం గురించి ఎన్నో రాసుకొచ్చారు. 8 ఏళ్లకే నేను నటిగా మారాను.. దానికి మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి పెద్దదిగా మార్చిందని ఎలా అనుకుంటారు” అని ఎమోషనల్ అయ్యింది. ఇక హన్సిక అమ్మ ఈ విషయమై మాట్లాడుతూ.. ” ఈ వార్తే కనుక నిజం అయ్యి ఉంటే, నా కూతురుకు నేను ఇంజక్షన్స్ ఇచ్చి ఉంటే.. టాటా బిర్లా కన్నా ఎక్కువ ధనవంతురాలిని అయ్యేదాన్ని. మీరు కూడా ఆ ఇంజక్షన్స్ కావాలని మా ఇంటి ముందు క్యూ కట్టేవారు.. అసలు ఇలాంటి వార్తలు రాసేవారికి కామన్ సెన్స్ ఉంటుందా..” అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
శభాష్ తల్లి.. బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే పదోతరగతి పరీక్షకు హాజరు..
బీహార్ లో ఓ మహిళ చదువుకోవాలనుకుంటున్న వారికి స్పూర్తిగా నిలుస్తోంది. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ ఘటన బుధవారం రోజు బీహార్ లోని బంకాలో చోటు చేసుకుంది. కొడుకు జన్మించిన తర్వాత మూడు గంటల్లోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాసింది. పరీక్ష రాయాలనే ఆమె సంకల్పాన్ని ప్రసవవేదన కూడా కదిలించలేకపోయింది. పురిటి నొప్పుల ముందు ఎగ్జామ్ రాయాలన్న ఆమె స్థైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నరు.
బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రుక్మిణి కుమారి(27) బుధవారం ఉదయం ఆరుగంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడు గంటల తర్వాత సైన్స్ పేపర్ రాయడానికి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఆ పట్టణంలో చర్చనీయాంశం అయింది. మహిళా విద్యపై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత దీంతో తెలుస్తోందని.. షెడ్యూల్డ్ కులానికి చెందిన రుక్మిణీ అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారని జిల్లా విద్యాశాఖ అధికారి పవర్ కుమార్ అన్నారు.
ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 262 రన్స్‌కు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, రవి అశ్విన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17 లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్.. టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ఆపై విరాట్ కోహ్లీ(44)తో కలిసి రవీంద్ర జడేజా (26) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్‌కు 59 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశాక జడేజాను మర్ఫీ ఔట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ, భరత్ (6) ఔట్ అవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
మనమంతా కలిస్తే వచ్చే ఏన్నికల్లో బీజేపీకి 100 కన్నా తక్కువ సీట్లు
2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ హా అన్ని ప్రతిపక్షాలు చేతులు కలపాలని కోరారు. యునైటెడ్ ఫ్రంట్ బీజేపీని 100 కన్నా తక్కువ సీట్లకు పరిమితం చేయగలదని అన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు హాజరైన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత 22 రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. తారకరత్న కోసం విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగారు. ఆయనకు చికిత్స జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ సహా కుటుంబసభ్యులు మొత్తం హాస్పిటల్ కు చేరుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు సాయంత్రం 4.30కి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు. వెంటనే తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు.