ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయలేదు.. అర్హులైన వారికి ఏడాదికి రూ. 15 వేలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశాం.. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని చర్చించాం.. కేబినెట్ మీటింగ్ లో సీఎం ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారు.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు.. ఇక, ఎన్నికల సమయంలోనే ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకున్నాను.. ప్రభుత్వానికి భారమైన మీ కోసం ఆనందంగా దాన్ని మోస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
జపాన్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ప్రధానిగా తొలిసారి మహిళ ఎన్నిక
జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. అమెరికా వాణిజ్యం, భద్రతా ఉద్రిక్తతల మధ్య జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి (64) ఎన్నికయ్యారు. శనివారం జరిగిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచి విజయం సాధించారు. అధికార పార్టీ నాయకత్వ రేసులో సనే తకైచి విజయం సాధించారు. ఈ పోటీలో పురుష ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించారు. 44 ఏళ్ల యువ రాజకీయ నాయకుడు షింజిరో కోయిజుమిని ఓడించి నిలిచారు. దీంతో ఆమె దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.
అమ్మవారి గుడిలోకి షూతో వచ్చిన ఎమ్మార్వో.. పొట్టు పొట్టు కొట్టిన భక్తులు
దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా, బతుకమ్మ ఆడుతారు. అయితే, నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఓ ఉన్నతాధికారి అమ్మవారి గుడిలోకి బూట్లతో వచ్చి అపవిత్రం చేశాడు. దీంతో భక్తులు అతడిపై దాడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పండుగ స్థానిక సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయింది. కఠినమైన ఆచారాలు, ప్రోటోకాల్‌లను పాటిస్తారు, ముఖ్యంగా దేవతలు, వారి ఊరేగింపులకు సంబంధించి. పవిత్ర స్థలాలలోకి ప్రవేశించే ముందు పాదరక్షలను తొలగిస్తారు.
గతంలో గుంతల రోడ్లు.. ఆటో డ్రైవర్ల ఆదాయం అంతా రిపేర్లకు పోయేది..
ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ OG సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు.. విజయవాడ ఉత్సవ్ తో నగరానికి కొత్త కళ వచ్చింది.. నేరుగా లబ్ధిదారులకు డబ్బులు జమ అయ్యాయి.. ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు, డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి.. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటు తో గెలిచారు.. నాలుగోసారి గెలిచిన నాకు కూడా ఏం చేయాలో మొదట్లో అర్థం కాలేదు.. స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఎక్కడకి అంటే అక్కడి వెళ్ళగలుతున్నారు.. దసరా సమయంలో అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు ఇంద్రకీలాద్రికి వచ్చారు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. తాజా దాడుల్లో ఆరుగురు మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. కానీ ఇజ్రాయెల్ అతిక్రమించింది. హమాస్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఆరుగురు పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. గాజా నగరంలోని ఒక ఇంటిలో జరిగిన దాడిలో నలుగురు.. దక్షిణాన ఖాన్ యూనిస్‌లో జరిగిన మరొక దాడిలో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. ట్రంప్ షరతులకు హమాస్ అంగీకరించిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఆటోల వెనుక కొటేషన్లపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని సెటైర్లు వేశారు. డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్ లు కూడా నటించారు.. ఈ సందర్భంగా ఆటోల వెనక ఉండే కొటేషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎప్పుడు ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను.. ఒక ఆటో డ్రైవర్ వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పోద్దు.. మొక్క నాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని చెప్పారు.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు.. ఇక, ఆటోలో బ్యాగ్ మర్చిపోతే జాగ్రత్తగా పోలీసుకలు అప్పగిస్తారు ఆటో డ్రైవర్లు అని నారా లోకేష్ వెల్లడించారు.
నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్.. భారత్‌కు అప్పగించేదెప్పుడంటే..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లలో మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలును యూకే అధికారులు పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని బ్రిటిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే తన అప్పగింతను సవాల్ చేస్తూ నీరవ్ మోడీ మరోసారి కోర్టును ఆశ్రయించారు. భారత్‌కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. అలాంటి పనులకు పూనుకోబోమని హామీ పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. దీంతో నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మూడో రోజున విజయం సాధించింది. కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించి భారత్‌ను విజయ పంథాలో నడిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా నాలుగు వికెట్లు, సిరాజ్ మూడు వికెట్లు, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు.
రోహిత్ శర్మకు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్..
భారత క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం, అక్టోబర్ 4వ తేదీన సమావేశమైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ, భారత వన్డే జట్టు కెప్టెన్‌గా యువ సంచలనం శుభ్‌మాన్ గిల్‌ను నియమించింది. వారాలుగా సాగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఉన్నా కానీ కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌పైనే పడ్డాయి.
హరీష్ రావు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..
జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.. “పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలి. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్ కోసం టెండర్లు పిలిచారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి” అని అన్నారు.