పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు..
హైదరాబాద్ లో పీఎంఓ అధికారిగా నటించి మోసాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు అయింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. PMOలో సీనియర్ అధికారిగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం రామారావు సిఫార్సు లేఖ రాశాడు. కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు లేఖ రాసి భూముల రికార్డులు కావాలని రామారావు కోరారు. ప్రముఖ యూనివర్సిటీకి లేఖ రాసి అడ్మిషన్ కావాలని సిఫార్సు చేశాడు. పీఎంఓ కార్యాలయాన్ని టీటీడీ సంప్రదించింది. ఇక, రామారావు పేరుతో డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరని పీఎంవో తెలిపింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసింది.
పవన్ కల్యాణ్‌పై మరోసారి సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఓజీ డైలాగ్ చెప్పి మరి..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సుగాలి ప్రీతి తల్లి.. సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు తల్లి పార్వతి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం పోరాటం చేస్తున్నా.. 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాను.. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను.. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదు అన్నారు.. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు తన కేసును సీబిఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు..
నకిలీ మద్యం.. సర్కార్‌పై ఎంపీ అవినాష్‌రెడ్డి సంచలన ఆరోపణలు..
నకిలీ మద్యం వ్యవహారంపై కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో ఇట్టే అర్థమయిపోతోందని మండిపడ్డారు… రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో నకిలీ మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి.. నారావారి ఎన్ బ్రాండ్ తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారన్న ఆయన.. మొలకలచెరువులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం సీజ్ చేశారని.. దీంతో టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయిందన్నారు… మొలకలచెరువులో తయారు చేస్తున్న మద్యాన్ని రాయలసీమకు మల్లిస్తూ కృష్ణా జిల్లాలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని కోస్తాంధ్రకు తరలిస్తూ.. కోట్ల దండుకున్నారని.. ఇప్పటి వరకు 5,280 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిగాయని అన్నారు..
మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు..
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఎన్టీవీతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. పొన్నం వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. అయినా, అది మా పార్టీ, మా కుటుంబ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం.. త్వరలోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటున్నాను.. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి నాతో మాట్లాడారు అని చెప్పుకొచ్చారు.
త్వరలోనే కలుస్తా.. బాధితులకు విజయ్ ఫోన్‌కాల్
టీవీకే అధినేత విజయ్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను కలిసేందుకు పరామర్శ బాటపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేసి విషయం తెలియజేశారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. మీరు కారణమంటే.. మీరే కారణమంటూ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
మత్తు మందిచ్చి రేప్ చేశాడు.. హీరోపై హీరోయిన్ కేసు.. అరెస్ట్!
చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ‘మీటూ’ (#MeToo) ఉద్యమం ఇప్పుడు కన్నడ పరిశ్రమ (శాండల్‌వుడ్)ను తాకింది. ‘రిచ్చి’ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన హేమంత్‌పై ఆ సినిమా హీరోయిన్ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజాజీనగర్ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన కన్నడ చిత్రసీమలో తీవ్ర కలకలం రేపింది. బాధిత నటి 2022లో హేమంత్‌ను కలిశారు. ‘రిచ్చి’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని, రూ. 2 లక్షల పారితోషికం ఇస్తానని హేమంత్ హామీ ఇచ్చారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ. 60 వేల చెక్ కూడా బౌన్స్ అయిందని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. సినిమా షూటింగ్ సమయం నుంచే వేధింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది. అసభ్యకరమైన సన్నివేశాలలో, పొట్టి దుస్తులతో నటించాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని ఆమె వాపోయింది. షూటింగ్ పూర్తయిన తర్వాత, ఒంటరిగా హోటల్‌కు రమ్మని పిలుస్తూ వేధించడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. వేధింపుల పర్వం ఇక్కడితో ఆగలేదు.
రేవంత్ రెడ్డి మాటల్లో ఫేకుడు.. చేతల్లో జోకుడు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు అని ఆయన హెద్దెవ చేశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం శూన్యం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రెగ్యులర్ ఉద్యోగులకు రెండు మూడు వారాలు దాటినా జీతాలు రాకపోవడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి వేతనాలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. “బస్తీ దవాఖానల వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది బతుకమ్మ, దసరా పండుగలను ఆనందించలేకపోయారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్టోబరు 10 నుంచి రచ్చబండ కార్యక్రమం.. కోటి సంతకాలను సేకరిస్తాం!
అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని, అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు ఉంటాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు.
కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా.. వారికి మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కేసీఆర్, హరీశ్ తమ పిటిషన్లలో వాదించారు. ఆ నివేదికను పూర్తిగా రాజకీయ ఉద్దేశ్యాలతో రూపొందించారని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం చట్టపరంగా సరైంది కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా ఆదేశించింది.