గుడ్ న్యూస్.. శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పొందడానికి శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తులు తామున్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే.. నేరుగా శబరిమల నుంచి అరవణ ప్రసాదం ఇంటికే చేరుతుంది. దీనికోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తోంది.
అఖండ – 2 నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్స్ కీలక సమావేశం.. రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం
బాలయ్య – బోయపాటిల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరోవైపు ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. నిర్మాతలకు అడ్వాన్సులు కూడా భారీగా అందాయి. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ రాని కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. ప్రస్తుతం ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ అవడంతో రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 12 లేదా 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిర్మాతలతో రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజు హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సినిమా కోసం తాము బయట వడ్డీకి డబ్బులు తెచుకున్నాము వారి నుండి మాకు వత్తిడి వుంది. త్వరగా రిలీజ్ డేట్ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. తెలిసిన సమాచారం ప్రక్రారం 25న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దాదాపు ఒప్పుకున్నారని కానీ ఆ డేట్ కు వస్తే బాగా ఇబ్బంది అవుతుందని ఓవర్సీస్, బెంగుళూరు డిస్ట్రిబ్యూటర్స్ అభ్యంతరం తెలుపుతున్నారట. అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరుగుతన్న ఈ చర్చలు సాయంత్రం ఓ కొలిక్కి వస్తాయేమో చూడాలి.
ఇట్స్ అఫీషియల్.. స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ‘ఇక్కడితో ముగించాలనుకుంటున్నా’ అంటూ..!
భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal)ల వివాహం అధికారికంగా రద్దయింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలకు తెరదించుతూ.. పెళ్లి రద్దు విషయాన్ని మందాన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించింది. మందాన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా గోప్యతను కోరుకునే వ్యక్తిని, అలాగే ఉండాలని అనుకుంటున్నాను. కానీ, వివాహం రద్దు చేయబడింది అని స్పష్టం చేయాలనుకుంటున్నానని మందాన పేర్కొంది.
మమతా బెనర్జీ ‘‘ముస్లిం ఓట్ బ్యాంక్’’ ఖతం.. ఓవైసీతో పొత్తు పెట్టుకుంటాం..
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’కు శంకుస్థాపన చేసిన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న ఆయన బెల్దంగాలో మసీదుకు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ వివాదంపై తృణమూల్ ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీని తర్వాత, కబీర్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వచ్చే ఏడాది అధికారంలోకి రాకుండా చేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఆయన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “తృణమూల్ ముస్లిం ఓటు బ్యాంకు ముగిసిపోతుంది,” అని మమతాకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పిక్చర్ అభి బాకీ హై’’ అంటూ కామెంట్స్ చేశారు. బాబ్రీ మసీదుకు పునాదిరాయి వేసిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. డిసెంబర్ 22న తాను సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీలో పొత్తు పెట్టుకుంటానని కబీర్ అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని 294 స్థానాలకు గానూ 135 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీలోకి దింపుతానని చెప్పారు. ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పారు.
‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..
భారతదేశ ఆర్థిక మందగమనాన్ని హిందూ విశ్వాసంతో ముడిపెట్టే ప్రయత్నాలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఖండించారు. ‘‘హిందూ వృద్ధిరేటు’’ను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆయన అన్నారు. 23వ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మోడీ మాట్లాడుతూ.. దశాబ్ధాల పాటు భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ‘‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’’గా పిలుస్తూ, హిందూ జీవన విధానాన్ని కించపరిచేందుకు ఈ పదాన్ని ఉపయోగించారని అన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న భారత స్థాయి గురించి మాట్లాడుతూ.. ప్రపంచం విచ్ఛిన్నం, అనిశ్చితి ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ వారధిగా మారుతోందని అన్నారు. ప్రపంచంలో మందగమనంలో ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి కథలను రాస్తుందని అన్నారు. ప్రపంచంలోనే నమ్మకం తగ్గినప్పుడు, భారత్ నమ్మకానికి స్థంభంలా నిలుస్తుందని అన్నారు.
ఒకవైపు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
బీజేపీ చేపట్టిన మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విషయమై మాట్లాడే అర్హత బీజేపీకి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల మెప్పు పొందిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన బీజేపీ నేతలు ఇప్పుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థితిలో ఉందని, అలాంటి పరిస్థితిలో ఉన్న కిషన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం గర్వంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుందని, ప్రజల మద్దతుతో ప్రజల ముందే గర్వంగా నిలబడుతున్నామని చెప్పారు.
పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఈ రూట్ లోనే..
వందే భారత్ ట్రైన్స్ రవాణా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. అయితే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు భారతీయ రైల్వే రెడీ అయ్యింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ రూట్ లో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. తేజస్ లాంటి వేగం, రాజధాని లాంటి సౌకర్యం, వందే భారత్ అధునాతన సాంకేతికత ఇప్పుడు ఢిల్లీ-పాట్నా మార్గంలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయనున్నది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి పాట్నా- ఢిల్లీ మధ్య కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఈ చారిత్రాత్మక ప్రారంభానికి రైల్వేలు చివరి దశ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకులు ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న ఉప్పల్
హైదరాబాద్ మహానగరం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగస్వామ్యంతో కూడిన ఫ్రెండ్లీ మ్యాచ్ డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఓవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా, మరోవైపు ఈ ఫుట్‌బాల్ ఈవెంట్ నగరానికి మరింత గ్లోబల్ గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యంగా, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జట్టుకు సారథ్యం వహించనుండటంతో ఈ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఈ అద్భుతమైన ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రోగ్రాం వివరాల విషయానికి వస్తే, లియోనల్ మెస్సీ డిసెంబర్ 12వ తేదీ రాత్రి కోల్‌కతా చేరుకుంటారు. ఆ తర్వాత, 13వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన 200 మంది సిబ్బంది బృందంతో కలిసి హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌తో పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈవెంట్‌లో ప్రధానంగా, వివిధ రంగాల సెలబ్రిటీలతో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇందులో రెండు జట్లు తలపడతాయి – ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు సాక్షాత్తూ మెస్సీ సారథ్యం వహిస్తారు.
గ్లోబెల్ సమ్మిట్ కు విద్యుత్ శాఖ విస్తృత ఏర్పాట్లు
భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసిందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ తెలిపారు. 33 /11 కేవీ మీర్ ఖాన్ పేట్ సబ్ స్టేషన్ నుండి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్ అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేసారు. ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ కెపాసిటీ లు కలిగిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రాంగణం లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పటు చేసారు. దీనికి తోడు ఒక 315 కేవీఏ కెపాసిటీ కలిగిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ ను కూడా అందుబాటులో ఉంచారు. సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ డా. నర్సింహులుని సదస్సు కు ఇంచార్జి గా నియమించడం జరిగింది. దీనికి తోడు దాదాపు 150 మంది విద్యుత్ అధికారులు, సిబ్బంది రేపు శనివారం నుండి సదస్సు ముగిసే వరకు ఆ ప్రాంతంలో సరఫరా తీరును పర్యవేక్షిస్తుంటారని సీఎండీ తెలిపారు. శుక్రవారం ఉదయం చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్ లో సీఎండీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబెల్ సమ్మిట్ కు దేశ, విదేశాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారని విద్యుత్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వుంటూ, విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సర్కిళ్ల సిబ్బంది తప్పనిసరిగా సేఫ్టీ జాకెట్లు ధరించాలని, క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలు, ఇతర పరికరాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హీరోయిన్ను భయపెట్టిన ఆత్మ.. చివరికి ఏమైందంటే!
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ రూంలో ఒక ఆత్మను చూశానని తెలిపింది. తమిళ నటుడు కార్తీ హీరోగా, నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ సినిమాలో కృతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక జిప్సీ యువతి రోల్ ను పోషిస్తుంది. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రోజు రాత్రి నాకు ఓ వింత అనుభవం ఎదురైంది.. మా అమ్మతో కలిసి నేను హోటల్ గదిలో ఉన్న సమయంలో ఒక ఆత్మ రూపం కనిపించింది.. మేం లైట్ వేయగానే పెద్దగా శబ్దం వచ్చి అది మాయమైంది అని బేబమ్మ పేర్కొనింది.