బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు..
బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత ఎంబసీపై దాడి చేసే యత్నం చేసింది. రాజకీయ, మత శక్తులు తమ ప్రయోజనం కోసం ప్రభుత్వ సంస్థల్ని ఉద్దేశపూర్వకంగా బలహీన పరుస్తున్నాయని ఒక నిఘా నివేదిక స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా, బంగ్లాదేశ్ ఆర్మీని బలహీనపరచాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని రిపోర్ట్ పేర్కొంది.
‘‘హాది కలను నెరవేరుస్తాం’’.. భారత వ్యతిరేకికి మద్దతుగా యూనస్ వ్యాఖ్యలు..
రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, పచ్చి భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసకు కారణమైంది. శనివారం హాది అంత్యక్రియలకు లక్షలాది జనం ఢాకాకు తరలివచ్చారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే, హాది అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. సంతాప సభలో ప్రసంగిస్తూ, హాదికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది ఆదర్శాలను అనుసరిస్తామని, పరోక్షంగా భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తామని యూనస్ చెప్పకనే చెప్పాడు. సంతాప సభలో యూనస్ మాట్లాడుతూ.. ‘‘ ప్రియమైన ఉస్మాన్ హదీ, మేము మీకు వీడ్కోలు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీరు మా హృదయాలలో ఉన్నారు, బంగ్లాదేశ్ ఉన్నంత కాలం, మీరు బంగ్లాదేశీయులందరి హృదయాలలో ఉంటారు. మిమ్మల్ని అక్కడి నుండి ఎవరూ తొలగించలేరు. ఈ రోజు లక్షలాది మంది ప్రజలు తరంగాల వలె గుమిగూడారు, బంగ్లాదేశ్ అంతటా కోట్లాది మంది ప్రజలు, విదేశాలలో నివసిస్తున్న బంగ్లాదేశీయులు హదీ గురించి వినడానికి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని అన్నారు. ఈ సమావేశం వీడ్కోలు కాదని, ప్రతిజ్ఞ అని నొక్కి చెబుతూ.. ‘‘ మేము ప్రపంచం ముందు తలెత్తుకుని తిరుగుతాం. మేము ఎవరి ముందు తలవంచం’’ అని చెప్పారు.
రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 26, 2025 నుంచి ప్రయాణికుల రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అయితే, ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రధానంగా సుదూర ప్రయాణికులపై ప్రభావం పడనుంది. అయితే, రోజూవారీ ప్రయాణికులు, స్వల్ప దూరాలు ప్రయాణించే ప్రయాణికులకు ప్రభావం ఉండదు. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులను నిర్వహించడానికి, చాలా మందికి రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రోజూవారీ ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలను పెంచింది. సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని రైల్వే ప్రకటించింది. ఈ చర్య వల్ల రోజూవారీ ప్రయాణం కోసం స్థానిక రైళ్లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. 215 కిలోమీటర్ల (కి.మీ.) దూరం వరకు జనరల్ క్లాస్ టిక్కెట్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదు. మునుపటి ఛార్జీలే వీరికి వర్తిస్తాయి. తక్కువ దూరం ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పడకుండా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య అరెస్ట్..
మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య అరెస్ట్.. గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)తో పాటు మరి కొందరిపై కేంద్ర నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేసులు నమోదు చేసింది. నిషేధిత సంస్థలు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నాయి, తద్వారా భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని ఎన్ఐఏ తెలిపింది. సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన ఏబీఎంఎస్ (అమరుల బంధు మిత్రుల సంఘం) ఏర్పాటు చేసిన అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య ప్రసంగిస్తూ.. భారత ప్రభుత్వంతో పాటు భద్రతా బలగాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారని.. అలాగే, రామచంద్రారెడ్డి (వికల్ప్) బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేయబడ్డారని గాదె ఇన్నయ్య ఆరోపించారు.
‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..
అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ “పాపం” చేసింది’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. ఈ ఆరోపణల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించే ప్రతిపాదన లేదని ఆయన అన్నారు. అస్సాం హిందూ మెజారిటీ ప్రావిన్స్ అని, విభజన ప్రణాళికలో పాకిస్తాన్ భాగంగా అస్సాం లేదని, అస్సాంలోని సిల్హెల్ జిల్లా ముస్లిం మెజారిటీ ప్రాతం అని ఆయన అన్నారు. ఇప్పుడు సిల్హెల్ జిల్లా బంగ్లాదేశ్‌లో భాగంగా ఉంది.
బీజేపీ కోణంలో ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడం పెద్ద తప్పు..
పోలికల ద్వారా, రాజకీయ కోణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను అర్థం చేసుకోవడం తరుచుగా అపార్థాలకు దారి తీస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కోల్‌కతాలో జరిగిన ‘‘ఆర్ఎస్ఎస్ 100 వ్యాఖ్యాన మాల’’ కార్యక్రమంలో ఆయన పఈ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్‌ను కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో ముడిపెట్టవదని ఆయన చెప్పారు. చాలా మంది సంఘ్‌ను బీజేపీ కోణం నుంచి అర్థం చేసుకునే ధోరణిని కలిగి ఉన్నారని, అది ఒక పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు.
ఆర్థిక ఇబ్బందులతో హైడ్రా గన్‌మ్యాన్ ఆత్మహత్య యత్నం
హైడ్రా కమిషనర్ వద్ద గన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. భార్యతో కలిసి హయత్‌నగర్‌లో నివసిస్తున్న కృష్ణ చైతన్య తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ చైతన్య పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ వెంటనే కామినేని ఆసుపత్రికి చేరుకుని వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణ చైతన్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన కమిషనర్, చికిత్సకు హైడ్రా సంస్థ పూర్తిస్థాయిలో సహాయం చేస్తుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండేళ్ల క్రితం బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అప్పుల భారం పెరగడంతో తీసుకున్న లోన్లకు జీతం ఎక్కువగా కట్ అవుతూ రావడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ ఒత్తిడే అతన్ని ఆత్మహత్య యత్నానికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్ సత్తా ఇంకా తెలిసేది
తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పాలన కేవలం తనను దూషించడం, అవమానించడమే పరమావధిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే విలువైన సమయాన్ని వెచ్చిస్తోందని ఆయన ఆక్షేపించారు.
జూబ్లీహిల్స్, పంచాయతీ ఫలితాలే సాక్ష్యం..
టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ముందే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఉద్యోగ హామీల విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ మొదటిసారిగా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి వారైనా వదలకుండా విచారించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.