అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు. అయితే…
తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ ఆగ్ని ప్రమాదం.. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఫైర్ సిబ్బంది…
ఇంత సైంటిఫిక్‌గా కుల గణన ఎప్పుడూ జరగలేదు.. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్‌గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు…
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు.. బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది. బ్యూటిషన్, టైలరింగ్ పేరుతో హైదరాబాద్ వచ్చిన యువతులు.. వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠా.. తాజాగా ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ ఘాట్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఇక,…
తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం.. దానికి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో ఇవాళ చర్చిస్తాను.. డీలిమిటేషన్ అనేది సౌత్ ను లిమిటేషన్ చేయడానికే.. డీలిమిటేషన్ పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కచ్చితంగా హాజరు కావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి…
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్…
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు…
సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాక్ నుంచి బెదిరింపులు.. పోలీసుల దర్యాప్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపు సందేశం…