కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్.. కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.. ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది ఏపీ ఆర్ధిక శాఖ. తుఫాన్లు, రాయలసీమ ప్రాంతంలో…
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే…
హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము! తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని,…
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్! తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే, ఫిబ్రవరి 3వ తేదీన వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే…
కష్టపడిన వారికే ప్రాధాన్యత: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు,…
మామునూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.. సీఎం దిగ్భ్రాంతి వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ.. రెండు ఆటోలను ఢీ కొట్టింది. దీంతో.. భారీ ఐరన్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు…
బీజేపీలో చేరిన మేయర్, కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ పరిస్థితి ఏంటి?…
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక.. కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు…
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు,…