పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ..
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాను..
సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు.. దర్యాప్తు పూర్తి
సంచలనం సృష్టించిన ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. హత్య కారణం కాదని, మద్యం తాగిన ఉన్న స్థితిలో సెల్ఫ్ యాక్సిడెంట్ ఏకైక కారణమని తేల్చి చెప్పారు. ఇవాళ రాజమండ్రిలో ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 42 సిసి ఫుటేజ్ లను విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణం గుర్తించామని స్పష్టం చేశారు. ప్రవీణ్ మూడు చోట్ల మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిసి ఫుటేజ్ లను ఫోరెన్సిక్ ద్వారా నిర్ధారణ చేసుకున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఆల్కహాల్ వచ్చిందని వెల్లడించారు.
చైనాలో భీకర గాలులు.. 700 విమాన సర్వీసులు రద్దు
చైనాలో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం భారీ గాలులు వీచడంతో రాజధాని బీజింగ్‌లో చెట్లు కూలిపోగా.. పాత ఇళ్లులు ధ్వంసం అయ్యాయి. భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా.. పార్కులు మూసేశారు. ఇక భీకర గాలులు కారణంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 700 విమాన సర్వీసులు రద్దైనట్లుగా తెలుస్తోంది. దీంతో బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీ మాత్రమే!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని చేసినవే అని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపై రాష్ట్రస్ధాయి కార్యాచరణ సమావేశానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.
పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. జనాలు పరుగులు
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వచ్చిన భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు రాలేదు. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తింపబడినట్లుగా తెలిపింది. కాశ్మీర్ వరకు ప్రకంపనలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. అయితే హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా మాత్రం కొనసాగుతున్నాయి.
కేటీఆర్‌కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి.. డీకే అరుణ సవాల్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే.. ఓ బీజేపీ ఎంపీకి కూడా లింక్ ఉందని కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా… ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..
కాళేశ్వరం అడవుల్లో కార్చిచ్చు హాహాకారం.. వనమూల్యానికి పెద్ద నష్టం
కాళేశ్వరం ప్రాంతంలో కార్చిచ్చు మంటలు అదుపుతప్పి అడవిని కబళిస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో వేలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. దహనంల వ్యాప్తి కారణంగా దట్టమైన పొగ ప్రాంతమంతా కమ్మేసింది. మంటలు వ్యాపించడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పలువురు స్థానికులు బకెట్లతో నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం కష్టతరంగా మారింది.
ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు.. మంత్రి సంచలన ఆరోపణలు
ఇసుక దోపిడీ కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ గేట్లను విరగొట్టారు అంటూ సంచలన ఆరోణలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. బల్లికురవలో ఈర్ల గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం సాగు నీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి దిశానిర్దేశం చేవారు.. ఎండాకాలం పూర్తి అయ్యేలోపు కాలువ పూడికతీత, మరమత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి గొట్టి పాటి మాట్లాడుతూ.. వ్యవసాయం సీజన్ నాటికి పంట కాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.. గుండ్లకమ్మ చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు రైతాంగాన్ని కాపాడుకుంటాం అన్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ కోసమే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లను విరగొట్టారని ఆరోపించారు.. గుండ్లకమ్మ నుంచి వైసీపీ నేతలు కోట్లాది రూపాయిల ఇసుక దోపిడీ చేశారని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమత్తుల కోసం నిధులు కేటాయించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3 టీఎంసీల నీటిని నిల్వ చేసి 20 లక్షల చేపపిల్లలను వదిలామని వెల్లడించారు.. జలాశయం మీద ఆధారపడి జీవించే వారికి జీవనోపాధి కలిస్తున్నాం అన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులు స్వాధీనం.. రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ షాక్..
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చేసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్ 11న, ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేుసింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్‌కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పబ్లిష్ చేసిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్‌ని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించింది ఈ కేసు. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. రూ. 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని నియంత్రించడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్, అసోసియేట్ జర్నల్ ఆస్తుల్ని దుర్మార్గపు పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
అత్యధిక ద్రవ్యోల్బణం నుండి అత్యల్ప స్థాయికి.. ప్రజల ప్రభుత్వం ప్రగతి ఇది
తెలంగాణలో పాలన మారిన కొద్ది నెలల లోపే, సామాన్య ప్రజల జీవనశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా ప్రకటించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా మారడం “ప్రజల ప్రభుత్వ” విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ద్రవ్యోల్బణ భారం ఎదుర్కొనాల్సి వచ్చిందని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భాలు తరచూ చూశామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సాధారణ ప్రజానీకాన్ని కేంద్రీకరించి అమలు చేస్తున్న విధానాలు తక్షణ ఉపశమనం కలిగించాయన్నారు.