ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా…
బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భుతమైన మేనిఫెస్టో అని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి 16 వేలు…
పాక్ ఆర్థిక సంక్షోభం: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం…
52 మందితో బీజేపీ తొలి జాబితా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతో పాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్…