నేడు పోలవరంలో పర్యటించనున్న మంత్రి అంబటి
నేడు పోలవరంలో మంత్రి అంబటి పర్యటించనున్నారు. ప్రాజెక్ట్ పనులు మంత్రి అంబటి పరిశీలించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక సాగునీటి పథకాలను ప్రభుత్వం పూర్తి చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. “ప్రాంతం యొక్క వాస్తవ అవసరాలను తీర్చడానికి పథకాలను పునరుద్ధరించడానికి మేము అన్ని చర్యలను తీసుకున్నాము. అనేక పథకాలు అమలులోకి వచ్చాయి’’ అని అధికార ప్రతినిధి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో సగటున 4.6 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ప్రస్తుతం 14 టీఎంసీలకు పెరిగిందని వివరించారు.
రేపటి నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర
మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అక్టోబర్ 26 నుంచి సామాజిక సాధికార యాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.ప్రతిపాదిత బస్సు యాత్ర ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతంతో సహా మూడు ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ చివరి వరకు కొనసాగుతుంది.అందులో భాగంగానే ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, రాయలసీమలోని సింగనమల, కోస్తా ప్రాంతంలోని తెనాలి నుంచి యాత్రను ప్రారంభించేందుకు పార్టీ బస్సులను సిద్ధం చేసింది.
హమాస్ గ్రూపుకు సంబంధించిన వివరాలు మాకు కావాలి..
హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే హమాస్ సాయుధ గ్రూపు బంధీలుగా మార్చుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఒక్కొక్కరిగా విడిచి పెడుతుంది. బంధీలు కూడా తమను హమాస్ తీవ్రవాద నేతలు బాగానే చూసుకున్నారని చెప్పారు. ఈ రకంగా ప్రపంచ దేశాల నుంచి సానుభూతి పొందే అవకాశాలను హమాస్ తీవ్రవాదులు సానుపొందాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ సైనికుల విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని.. అలా ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని ఆ కరపత్రాల్లో పేర్కొంది.
పగలేమో ఎండ.. రాత్రేమో వణికిస్తోన్న చలి
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట తీవ్రమైన ఎండలు, వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి అయితే చాలు. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం చల్లదనం పెరుగుతోంది. సోమవారం (అక్టోబర్ 23) రాత్రి… హనుమకొండలో 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.
ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో సాధారణం కంటే 1.7 డిగ్రీలు తగ్గింది. రాజేంద్రనగర్, పటాన్చెరులోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక మంగళవారం (అక్టోబర్ 24) పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో 1.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రేపు గజ్వేల్ కు ఈటల రాజేందర్
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ ఆలయం వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు చేరనున్నారు.
అయితే, తెలంగాణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తాను పోటీ చేస్తానని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇక, గజ్వేల్ బరిలో తాను ఉంటే కేసీఆర్ కు టెన్షన్ పక్కా అని చెప్తున్న ఈటల ఆలోచనలకు తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం ఆయనను హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా టికెట్ కేటాయించింది. ఇక, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులను బాగానే అధ్యయనం చేశానని ఆయన తెలిపారు.
పొంగులేటి ఖమ్మం రాలేదు… తుమ్మల పాలేరు కు పోలేదు..
పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సానుకలుమని ప్రకటిస్తున్న పార్టీలు తమ బాధ్యత నిర్వర్తించే క్రమంలో చేతులెత్తుస్తున్నారని తెలిపారు. దానివల్లనే 29 ఏళ్లుగా పోరాటం జరుగుతూనే ఉందన్నారు. నరేంద్ర మోడీ కూడా వర్గీకరణకు అనుకూలమని స్వయంగా నాతోనే అన్నారని.. దానికి కిషన్ రెడ్డి నే సాక్ష్యమని మందకృష్ణ అన్నారు. అమిత్ షా కూడా అనూకూలం అనే అన్నాడన్నారు. అది నిజమే అయితే వెంటనే బహిరంగంగా ప్రకటించాలి అది కూడా ఎన్నికలలోపే అన్నారు. ఇద్దరు ఒక అంశం ఎంచుకున్న ఏ చట్టం ఆగలేదన్నారు. పార్లమెంట్ లో ఎపుడూ బిల్ పెడతారో చెప్పాలన్నారు. Sc వర్గీకరణ కు అనుకూలమని YS హయాంలోనే హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టో లో కూడా పెట్టారని తెలిపారు. కమిషన్ వేసింది,అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కూడా పోరాటం చేయట్లేదని తెలిపారు. సోనియా గాంధీ కూడా పార్టీ అధ్యక్షురాలు హోదాలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఖర్గే కూడా చేవెళ్లలో సభలో డిక్లరేషన్ లో పొందుపరిచారని తెలిపారు. వర్గీకరణ హామీ అనేది పేపర్ల పై ఉంటుంది కానీ,దానిని వాస్తవరూపం దాల్చలేదన్నారు.
రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు..
రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారాల్సిన అవసరం నాలాంటి వాళ్లకు లేదని స్పష్టత ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కానీ… నా కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామన్నారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ ఇలాగే జరుగుతోందని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కేసీఆర్ విజయానికి అందరూ సహకరించాలని సూచించారు.
అదాన్ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారు
ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా అని మేం సవాల్ విసిరాం.. కానీ ప్రభుత్వం స్పందించ లేదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఇవాళ ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయన్నారు. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని, అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందన్నారు. రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయని, అదాన్ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారన్నారు పురందేశ్వరి.
ఒక్క అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తిప్పర్తి మండలం ఎంపీపీ విజయ లక్ష్మీ, జడ్పీటీసీ పాశం రాంరెడ్డితో పాటు 12 మంది సర్పంచ్ లు చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు మద్దతు ఇవ్వండి.. 20 ఏండ్లు నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం అని పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్నాను.. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా.. ఐదోసారి ఓడిపోయినా.. భువనగిరి ఎంపీగా గెలిపించారు అంటూ కోమటిరెడ్డి తెలిపారు.
నేను నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీరే నాయకులుగా ఉండి గెలిపించండి.. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.. రెండుసార్లు కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు.. ఈసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. వేనేపల్లి చందర్ రావు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరారు.. స్థానిక ఎమ్మెల్యే గెలిచిన రెండు నెలలకే వేనేపల్లిని అనరాని మాటలు అన్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడితేనే మేము ఎమ్మెల్యేలము అవుతాము.. గతంలో మిగిలిన పనులు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.
బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్‌లోకి..!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగలవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వివేక్ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది.
నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు
నారా భువనేశ్వరి నిజం గేలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు కొడాలి నాని. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది…. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2వేల కోట్లు దాటిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
టీడీపీ-జనసేన పొత్తు అనైతికం
టీడీపీ- జనసేన పొత్తు అనైతికమన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి జైలులో చంద్రబాబు నాటకం రచిస్తున్నాడని విమర్శించారు. రేపటి నుంచి మా సైన్యం సామాజిక న్యాయ బస్సు యాత్రకు బయలుదేరుతుందని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడుగా చెప్పుకోవడం తప్ప అచ్చెన్నాయుడును లోకేశ్ పక్కకు నెట్టేస్తున్నారని ఆయన అన్నారు. బీసీలు అంటే లోకేష్ కి చులకన భావమని, 2019లో నారాసుర వద జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నారాసురుడు అంటే చంద్రబాబు.. పది తలలతో వస్తున్నాడని, మీ తండ్రి మానసిక క్షోభ కి చంద్రబాబు ఎంత పరితపించాడో భువనేశ్వరి తెలుసుకోవాలన్నారు.