మెట్రో సొరంగాల వెబ్‌లో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయిల్ కు సవాల్
హమాస్ ఇజ్రాయిల్ మధ్య మోగిన యుద్ధ బేరి 21 రోజులు గడిచిన ఇంకా వినపడుతూనే ఉంది. హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయిల్లో 1400 మంది పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడికి పూనుకుంది. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతీకార దాడుల్లో 7200 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికి ఇజ్రాయిల్ గాజా పైన తన ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. అయితే హమాస్ ను నాశనం చేస్తాని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్లుగానే హమాస్ పైన దాడులు జరుపుతున్నా.. హమాస్ ను పూర్తిగా శిథిలావస్థకు తేవాలి అనుకునే ఇజ్రాయిల్ కి గాజా స్ట్రిప్ లోని సొరంగాలు సవాల్ విసురుతాన్నయి. స్మగ్లింగ్ కోసం అలానే యుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించే విస్తారమైన సొరంగాల నెట్‌వర్క్ గాజా స్ట్రిప్ క్రింద ఉంది .
నేడు మరోసారి ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు.. ఈ సారి ఏకంగా రూ.200కోట్లు డిమాండ్
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ కంపె చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి కూడా అతనికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అది మునుపటి ఈ-మెయిల్ ఐడి నుండి పంపబడింది. ఈసారి తన ప్రాణాలను కాపాడినందుకు ప్రతిఫలంగా ముఖేష్ అంబానీ నుండి 200 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు, ముఖేష్ అంబానీని షార్ప్ షూటర్‌తో కాల్చివేస్తానని శుక్రవారం సాయంత్రం తనకు ఇ-మెయిల్ వచ్చిందని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించాడు. రూ.20 కోట్ల ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న గాందేవి పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి అదే ఈ-మెయిల్ ఐడీ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 27న ముకేశ్ అంబానీకి మొదటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. భారత్‌లో అత్యుత్తమ షార్ప్ షూటర్లు అతని వద్ద ఉన్నారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రాణం కాపాడుకోవాలంటే రూ.20 కోట్లు ఇవ్వాలని అందులో ఉంది. ఆ తర్వాత, సెక్యూరిటీ ఇన్‌చార్జి సమాచారం మేరకు, ముంబై పోలీసులు ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
చదువుకు డబ్బులు ఇస్తే.. లవర్ కోసం కారు కొన్నాడు.. దీంతో కొడుకుపై కోర్టుకెళ్లిన తల్లి
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యతు ఉన్నతంగా ఉండాలని చాలా కష్టపడుతారు. అప్పు చేసైనా మంచి చదువులు చెప్పించాలని అనుకుంటారు. అదే కుటుంబ పెద్ద లేని కుటుంబం అయితే ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. అలాంటి ఓ తల్లి చాలా కష్టపండి ఎంతో కొంత డబ్బు కూడబెట్టి కొడుకును విదేశాల్లో చదివించింది. అతని యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు కోసం తన జీవితాంతం సంపాదనను కొడుకు చదువు కోసం త్యాగం చేసింది. అయితే కొడుకు ఫీజు కట్టకుండా ఈ డబ్బును వేరే పనికి వాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ తన కుమారుడిపై కోర్టును ఆశ్రయించింది. లూయిస్(41) కుమారుడు జియోవే(19) ఈ డబ్బుతో తన లవర్ కోసం కొత్త కారును కొనుగోలు చేశాడు.
ఈ విషయం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినది. లూయిస్ చాలా చిన్న వయస్సులోనే తన భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆమె తన కొడుకును ఒంటరిగా పెంచింది. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు ఆమె తన జీవితకాల సంపాదన 500,000 యువాన్‌లను (సుమారు రూ. 57 లక్షలు) తన కుమారుడు జియోవేకి బదిలీ చేసింది. కాబట్టి కొత్త భర్త భవిష్యత్తులో ఈ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు విదేశాల్లో చదివేందుకు అని కొడుకుకు ఇచ్చింది. కష్టపడి పనిచేస్తే మరో 500,000 యువాన్లు ఇస్తానని ఆమె తన కొడుకుకు వాగ్దానం చేసింది. అతను యూనివర్సిటీలో చేరాడు.
చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు
నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలోసతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు అయినటువంటి సతీష్ తో కాంటాక్ట్ లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్ లోని స్వన ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు.
కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి! 20 మందికి తీవ్ర గాయాలు
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపుగా 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. ఉదయం 9 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో క్రిస్టియన్ ప్రేయర్ మీట్ ‘యాహోవా సాక్షి’ కార్యక్రమం శుక్రవారం నుంచి జరుగుతోంది. ఈ కార్యక్రమంకు చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం 9.20కి ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై హాలు నుంచి బయటకు పరుగులు తీశారు.
బీహార్ రాజధాని పాట్నాలో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు రాజీవ్ నగర్ ప్రాంతంలోని నేపాలీ నగర్‌పై దాడి చేసి 4 జంటలు, 1 మైనర్ బాలుడు, బాలికను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి గదిలో అబ్బాయి, అమ్మాయి అభ్యంతరకర స్థితిలో కనిపించారు. హోటల్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందని, ఆ తర్వాత పోలీసులు దాడి చేశారని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.
ఈ కేసు పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేపాలీ నగర్‌కు చెందినది. ఇక్కడ ఉన్న ఒక హోటల్‌లో దాదాపు 20 గదులు ఉన్నాయి. ఇక్కడ చాలా సేపు యువతీ యువకుల సందడి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసు బృందం అక్కడికి చేరుకోగా, గదుల్లో అబ్బాయిలు, బాలికలు అభ్యంతరకర స్థితిలో కనిపించారు. హోటల్‌లో అక్రమంగా బాలబాలికలకు గదులు ఏర్పాటు చేసి గంటా చొప్పున డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హోటల్ మేనేజర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికక్కడే హోటల్‌లో దొరికిన వారందరి పేర్లు, చిరునామాలు రిజిస్టర్‌లో నమోదు కాలేదు. ఘటనా స్థలంలో నలుగురు పెద్దలు, మైనర్ జంటను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది.. నా ఉద్దేశం అది కాదు: గోరంట్ల మాధవ్
తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని, పద దోషంతో నారా చంద్రబాబు నాయుడుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఎంపీ గోరంట్ల ఏంటి ఇలా అనేశారు? అని జనాలు మాట్లాడుకునేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై ఏపీ అంతటా టీడీపీ శ్రేణులు నిరసన జ్వాలలు చేపట్టాయి.
తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024లో నారా చంద్రబాబు చస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టారు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి.. ఢిల్లీ యాత్ర చేశారు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టి.. వదిలిపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా.. జగన్ జైత్రయాత్రను ఆపలేరు. 2024లో జగన్ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తాడు’ అని గోరంట్ల హాట్ కామెంట్స్ చేశారు.
ఉల్లిపై జనాల్లో లొల్లి.. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం టమాటా ప్లాన్
కొద్ది నెలల క్రితం టమాటాల ధరలు ఉన్నట్లుండి విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ప్రజల వంటగది బడ్జెట్‌తో పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణ రేటును కూడా టమాటా ప్రభావితం చేసింది. ప్రస్తుతం ఉల్లి విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉల్లి ధరలు వరుసగా పెరుగుతూ సెంచరీకి చేరువలో ఉన్నాయి. కానీ, ఈసారి టమాటా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించి, దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించింది. దీని ద్వారా త్వరలో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సారి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా..
మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నేడు కొనసాగింది. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డికి గజ మాలతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ తో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఊహించని రీతిలో జనాలు వస్తున్నారని, ఈ సారి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపిస్తానని, నన్ను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు మల్లారెడ్డి. నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్న.. నా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తున్న అని ఆయన అన్నారు.
తను చనిపోతూ 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్..
మనలో చాల మంది నిత్యం ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆ వాహనాన్ని నడిపే డ్రైవ్ పైనే ఉంటుంది. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను పణంగాపెట్టి ప్రయాణికుల్ని కాపాడుతుంటారు డ్రైవర్ లు. అయితే తాజాగా ఓ బస్సు డ్రైవర్ తను చనిపోతూ కూడా బస్సు లోని ప్రయాణికుల్ని రక్షించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశాలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే విధులకు వచ్చిన డ్రైవర్ 48 మంది ప్రయాణికుల్ని బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ నగరానికి బయలు దేరాడు. కాగా బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నటుండి డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది.
మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు
నిన్న జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర కారణాలు మీటింగ్లో తనపై చేసిన అసత్య ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని, కొడంగల్ లో తమ పార్టీ అభ్యర్థి పై గెలిచి తీరాలని రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. పట్నం బ్రదర్స్ ను ఎదుర్కోలేకనే కుట్ర పన్నుతున్నారని, పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులు పెట్టి కొన్నారని ఆ పార్టీ నాయకులే ఆరోపించారన్నారు రోహిత్ రెడ్డి. అంతేకాకుండా.. ‘వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి తాండూరు నుంచే డబ్బులు వెళుతున్నాయి. రేవంత్ రెడ్డి కూసిన పిచ్చికూతులను ప్రజలు గమనిస్తున్నారు. తనపై భూకబ్జాల విషయంలో ఆరోపణలు వాస్తవం కాదు… తాను ఏ గుడిలోకైనా, మసీదులో కైనా వెళ్లి ప్రమాణం చేయమంటే చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి 2018లో ఎన్నికల అపెడబిట్ లో చూపించిన ఆస్తి వివరాలు 2019లో లోక్సభకు పోటీ చేసినప్పుడు చూపించిన ఆస్తి వివరాలు మూడు కోట్లు అదనంగా ఉన్నాయి…