రమణ్ సింగ్ నుండి అక్బర్ వరకు… ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ అధినేతల భవితవ్యం
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు. మొదటి దశలో బఘెల్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి విశ్వసనీయత ప్రమాదంలో ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞుడైన బిజెపి నాయకుడు డాక్టర్ రమణ్ సింగ్‌తో సహా పలువురు సీనియర్ ప్రతిపక్ష నాయకులకు అగ్ని పరీక్ష జరగనుంది. ఈ హై ప్రొఫైల్ సీట్లలో కొన్ని చోట్ల అనుభవజ్ఞులైన నాయకుల ప్రతిష్ట ప్రమాదంలో ఉంది. కొన్ని చోట్ల ఇది గట్టి పోటీగా పరిగణించబడుతుంది.
ఛత్తీస్‌గఢ్ తొలి దశలో కాంగ్రెస్, బీజేపీలకే కాకుండా ఇరు పార్టీల సీనియర్ నేతలకు కూడా పరీక్ష రానుంది. రాజ్‌నంద్‌గావ్ స్థానం నుంచి మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రమణ్ సింగ్ పోటీ చేశారు. ఈ సీటు రమణ్ సింగ్ సిట్టింగ్ సీటుగా పరిగణించబడుతుంది. 2008 నుంచి వరుసగా విజయాలను నమోదు చేస్తూనే ఉన్నాడు. దీంతో పాటు నారాయణపూర్ సీటుపై మాజీ మంత్రి కేదార్ కశ్యప్, కొండగావ్ సీటుపై మాజీ మంత్రి లతా ఉసేంది, బీజాపూర్ సీటుపై మాజీ మంత్రి మహేశ్ గగ్డా, భానుప్రతాపూర్ సీటుపై మాజీ మంత్రి విక్రమ్ ఉసెందిల విశ్వసనీయత బీజేపీ సీనియర్ నాయకుల్లోనే ఉంది.
నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం జోరుగాసాగుతోంది. అయితే.. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల వర్గాల వారీగా ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మందమర్రి, మంథని, పెద్దపల్లిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం సుడిగాలి ప్రచార యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హామీ ఇచ్చి 14 ఏళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్‌దే బాధ్యత అని, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగలకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు.
పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. “పురందేశ్వరి గారు.. కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే.. మీ అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే.. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప.. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భార్య ఆత్మహత్య చేసుకున్న 6 ఏళ్లకు భర్తకు జైలు శిక్ష.. కారణం ఇదేనా..?
విలువ తెలిసిన వాళ్ళకి దొరకదు. దొరికిన వాళ్లకి విలువ తెలియదు అన్నట్లు.. పెళ్లికాక కొందరు బాధపడుతుంటే.. పెళ్లి చేసుకుని నమ్మి వెంట వచ్చిన భార్యను చిత్రహింసలు పెట్టి అర్ధాయుష్షుతో తనువు చాలించేలా చేస్తున్నారు మరికొందరు. కన్నవాళ్ళను వదిలి కట్టుకున్న భర్తే జీవితం అనుకుని వచ్చిన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారు. వేధింపులు తాళలేని మహిళలు తనువు చాలిస్తున్నారు. వరకట్నం వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. అలానే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. నిందితులకు ఏనాటికైనా శిక్ష పడుతుంది. న్యాయస్థానం కేసు నమోదైన సంవత్సరాల తరువాత నిందితులను శిక్షించిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే మరోసారి తాజాగా కర్నూలులో వెలుగు చూసింది.
నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటాపోటీ సమావేశాలతో పార్టీలు రణరంగంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో నిర్వహించే ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఆయన పాల్గొంటారు. మోడీ మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5.25 గంటలకు సభ జరిగే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు.
సాయంత్రం 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి. ఇదిలావుండగా బీసీ ఆత్మగౌరవ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో నేటి అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పలువురు బీసీ నేతలు హాజరుకానున్నారు.
సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా మోసం చేశారు..
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటనపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ స్పందించారు. ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు.. అవినీతి పేట్రేగిపోతోంది అంటూ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయసాయి రెడ్డి ప్రతి ట్వీట్ ప్తె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఆయనంత తెలివి నాకు లేదు.. ఏపీ మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిధ్రం అయ్యాయి.. ఈ కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్తెసీపీప్తె ఉంది.. జనం ప్రాణాలు పోతున్న జేబులు నిండాలన్న ఆలోచన వారిలో ఉంది అని ఆమె తెలిపారు. విపక్ష పార్టీలకు మేము చేసిన అభివృద్ధి చూపించడం కోసమే సెంట్రల్ యూనివర్సిటీ పనుల పరిశీలన చేశామన్నారు.
శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. హింట్ ఇచ్చేసిన సారా అలీ ఖాన్!
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆట కంటే.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ న్యూస్ హల్చల్ చేస్తోంది. దాంతో ఇంతకీ గిల్.. సారా టెండుల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడా? లేదా సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేతున్నాడా? అని అందరూ అయోమయంలో ఉన్నారు. దీనిపై సారా అలీ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీ ఖాన్, అనన్యా పాండేలు తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌పై సారా స్పందించారు. గిల్‌తో నువ్వు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, దానిపై మీ సమాధానం ఏంటి? అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. ‘ఆ సారాను నేను కాదు. సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనుక పడుతోంది’ అని సారా అలీ ఖాన్ బదులిచ్చారు.
నిరుద్యోగ సమస్యల కొసం బీజేపీ పొరాటం చేస్తే జైలుకు పంపారు
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో అంబేద్కర్ నగర్ నుంచి కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. 30 తేదిన విజయానికి సంకేతమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బీజేపీ గెలుస్తదని డిసైడ్ చేసాడన్నారు. బండిసంజయ్ భూదందాలు చేయలేదని, ఖబ్జా లు చేయలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కి నిధులు తీసుకువచ్చింది ఎవరు,అభివృద్ధి అడ్డం పడ్డది ఎవరూ అని ఆయన ప్రశ్నించారు. బండిసంజయ్ ని అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కోట్లు కరీంనగర్ కి పంపుతున్నారని, కరీంనగర్ బండిసంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారన్నారు.
ఏపీ గురించి తర్వాత.. హైదరాబాద్ నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు చూస్కోండి
శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు. తెలంగాణలో రాజకీయాలకు ఉపయోగపడితే మాట్లాడుకోండి మా నాయకుడు అటు కన్నెత్తి కూడా చూడరు అంటూ మంత్రి మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు NCR రిపోర్టులో దళితుల మీద దాడులు అఘాయిత్యాలలో ఏపీ మూడో స్థానంలో ఉంది అని దేశం మొత్తం కోడైకూసింది అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇప్పుడు చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులు, అవగాహన, ఆలోచన లేని వాళ్ళు చర్చ గోస్ట్ అని పెట్టి జగన్ దళితుల మీద జరుగుతున్న దాడులను పట్టించుకో లేదంటు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను పట్టించుకోలేదని జగన్ పై విమర్శించిన వాళ్ళకు చంద్రబాబుతో సహా ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.
మైనర్‌ను కాజువల్‌గా తాకడం పోక్సో కింద లైంగిక నేరం కాదు
లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు పోక్సో చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం ప్రకారం మైనర్‌ను సాధారణం గా తాకడం లైంగిక నేరం కాదని హైకోర్టు పేర్కొంది. చొచ్చుకుపోయే లైంగిక నేరానికి పాల్పడే మైనర్ శరీరాన్ని సాధారణ తాకడాన్ని వేధింపులుగా పరిగణించలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ పేర్కొన్నారు. తన ఉపాధ్యాయుడి సోదరుడి వద్ద ట్యూషన్ తీసుకుంటున్న ఆరేళ్ల బాలిక ప్రైవేట్ పార్ట్‌లను తాకినందుకు నిందితుడిని… ‘తీవ్రమైన చొచ్చుకుపోయే’ లైంగిక నేరానికి పాల్పడినట్లు పేర్కొంటూ.. నిందితులను దోషిగా నిర్ధారించే నిర్ణయాన్ని సమర్థించేందుకు ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది. అయితే, న్యాయమూర్తి అతనిని చట్టం ప్రకారం ‘తీవ్రమైన’ లైంగిక నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి, అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలన్న వ్యక్తి నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు.
ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఎవరు ఆపలేరు..
విశాఖపట్నంలో వైసీపీ సీనీయర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలో ఈ నెల 25 తేదీన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరు అని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ప్రోత్సహించిన పార్టీ వైసీపీనే అని వైవీ తెలిపారు. 30 లక్షలు మంది ప్రజలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేసిన నాయకుడు జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గొప్పగా చేయడం అభినందనీయం అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడు
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్‌కే వస్తున్నాయన్నారు. దళితులని సీఎం చేస్తానని దళితులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. భద్రాద్రి రాములోరి కల్యాణానికి కేసీఆర్ రారు.. మజ్లీస్ దావత్ లకు మాత్రం వెళ్తారన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల జనాలు, అమరవీరులు వదిలిన బాణం ఈటల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలవడని, ఈటల రాజేందర్ గజ్వేల్ కి రాగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండన్నారు కిషన్ రెడ్డి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఒడిపోతాడన్నారు.
చంద్రబాబు హయాంలో స్కీంలు లేవు.. అన్నీ స్కామ్ లే..!
పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గతంలో ఎప్పుడూ కూడా ఆయన చేయ్యలేదు.. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కరువు ఉంది అని సీఎం ఆరోపించారు. నేను అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షం పడింది అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు వెనక గజదొంగల ముఠాతో పాటు దత్తపుత్రుడు ఉన్నాడు అని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హాయంలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించే ఆలోచనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ స్కామ్, ఇసుక స్కామ్, అమరావతి భూముల స్కామ్ లు మాత్రమే జరిగాయని సీఎం జగన్ ఆరోపించారు.