రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు మోడీ.. 5800కోట్ల పనులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబరు 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయన గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్టోబర్ 30న అంబాజీ ఆలయంలో పూజలు, దర్శనంతో తన పర్యటన ప్రారంభిస్తారు. అనంతరం మెహసానాకు వెళ్లి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ. 5800 కోట్ల విలువైన రైలు, రోడ్డు, తాగునీరు, నీటిపారుదల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (WDFC), కటోసన్ రోడ్-బెచ్రాజీ-మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, విరామ్‌గామ్-సాంఖియాలి రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడంలో కొత్త భాండూ-న్యూ సనంద్ (N) విభాగం మెహ్‌సానాలో ప్రారంభించబడతాయి. ఇది కాకుండా, సబర్మతి నదిపై వల్సనా బ్యారేజీ, విజాపూర్, మాన్సా తాలూకాలోని వివిధ గ్రామ సరస్సుల రీఛార్జ్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
స్టార్ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముక్కుసూటి మనిషి.. తనకు నచ్చితే ఏదైనా చేస్తుంది.. నచ్చక పోతే ఇక అంతే.. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది..
ఈ చిత్రంలో ఈమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళం లోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళం లో నటించిన చంద్రముఖి-2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది.. అయితే సినిమా పై కంగనా ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. కంగనా పాత్ర ఎక్కువగా లేదని చాలా ఫీల్ అయ్యారు కూడా..
నేడు హజురాబాద్ నుంచి ఈటల ఎన్నికల శంఖారావం
కరీంనగర్ జిల్లా హజురాబాద్‌లో ఎన్నికల శంఖారావంను ప్రారంభించనున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉదయం 8 గంటలకు జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఉదయం 10:00 లకు కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. అక్కడి నుండి బైక్ ర్యాలీ ద్వారా కన్నూరు క్రాస్ రోడ్ లోని ఉమామహేశ్వర గార్డెన్ కు చేరుకుని బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. నిన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. మాటలు చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
ఫోన్ కోసం ప్రాణం తీశాడు.. పోలీసుల ఎన్ కౌంటర్లో బలయ్యాడు
ఢిల్లీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీటెక్ విద్యార్థిని కీర్తి సింగ్ మొబైల్ ఫోన్ దోచుకున్న రెండో నిందితుడిని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో జితేంద్ర అలియాస్ జీతు మరణించాడు. ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగానాహర్ ట్రాక్‌పై జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అతను, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు కూడా గాయపడ్డాడు. అక్టోబరు 27న ఓ బీటెక్ విద్యార్థిని ఆటోలో వెళ్తుండగా నిందితులు ఆమెను దోచుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో విద్యార్థి ఆటోలో నుంచి కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఫ్యామిలీ స్టార్ స్టోరీ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా.. ఈ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీడా కోలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు..కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కథపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.. ప్రతి ఫ్యామిలీ లో నుంచి ఓ పిల్లాడు ఆ ఫ్యామిలీ కష్టాలను, డైరెక్షన్‌ను, ఫ్యూచర్ జనరేషన్‌ను మార్చేస్తాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అలాంటి కథే అని తెలిపాడు. ఆ సినిమా తన రియల్ లైఫ్‌కు కనెక్ట్ అయ్యిందని తెలిపాడు. నా వల్ల నా ఫ్యామిలీ లైఫ్ అంతా మారింది. తరుణ్ కారణంగా వాళ్ల ఫ్యామిలీ లైఫ్ మారిపోయిందని విజయ్ తెలిపాడు.చిన్నతనం నుంచి తాను ఎన్నో భయాలతోనే పెరిగానని, అలాంటి భయాలను బ్రేక్ చేసే ఒక్కడు రావాలని విజయ్ తెలిపాడు.
మంచిని పక్కన పెడితే… నేను ఏం చేయగలనో అందరికీ తెలుసు…
మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయన తొత్తుల తోలు తీస్తానని ఆయన వ్యాఖ్యానించారు. సైదిరెడ్డి ఏజెంట్ బూతులో కూర్చుంటే…. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏజెంట్ కూర్చునే పరిస్థితి లేదన్నారు. నేను ఏడవ తరగతి లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఊర్లోకి రానివ్వలేదని, హత్య కేసులు పెట్టి వేధించిన వెనక్కి తగ్గలేదన్నారు శానంపూడి సైదిరెడ్డి. అంతేకాకుండా.. మంచినీ పక్కన పెడితే… నేను ఏం చేయగలనో అందరికీ తెలుసునని శానంపూడి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు ఏ రాజకీయం చేసి వదిలిపెట్టానో మళ్ళీ అది మొదలు పెడతానని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విడిచి వెళ్లిన వారికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇస్తానని, పార్టీలో ఉండి సంపాదించింది అంతా వడ్డీతో సహా వసూళ్లు చేస్తానన్నారు శానంపూడి సైదిరెడ్డి.
చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.. రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ ఈ పేరుకి పెద్ద పరిచయం అవసరం లేదు. నాగార్జున నటించిన శివ చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు వర్మ. వైవిధ్య భరితమైన చిత్రాలు తియ్యడంలో వర్మ ప్రావీణ్యుడు అనే చెప్పాలి. ఈ దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ఏ బెరుకు లేకుండా పూర్తిగా వినియోగించుకునే ఏకైక వ్యక్తి వర్మ అని చాలమంది అభిప్రాయం. తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది నా ఇజం.. రాముఇజం అని చేప్తారు. అయితే ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు వైస్సార్ సీపీ పార్టీకి మద్దతుగా కూడా నిలుస్తున్నారు.
హంతకులని బతకనీయం… రష్యా విమానాశ్రయంలో మూకుమ్మడి హత్యాయత్నం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేటితో 24వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అనేక దేశాలలో హమాస్‌కు మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే రష్యాలో జరిగిన ఇటువంటి నిరసనలు గతంలో ఎన్నడూ చూడలేదు. రష్యాలోని డాగేస్తాన్‌లోని మఖచ్‌కాలా విమానాశ్రయంలో ఒక గుంపు ఇజ్రాయెల్‌పై దాడి చేసి వారిని కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి విమానం వస్తోందన్న సమాచారం అందిన వెంటనే ఆందోళనకారులు రన్‌వేపై విమానాన్ని చుట్టుముట్టారు. వేలాది మంది ముస్లింలు విమానాశ్రయం గేటును పగులగొట్టి లోపలికి వచ్చా
చంద్రబాబుకి పవన్ కల్యాణ్ అంటే అభిమానం
చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని, అలాగే చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కి గౌరవమన్నారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు కలిసి రాష్ట్రం బాగుపడాలని బలంగా కోరుకుంటున్నారని, టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి ఇద్దరి అధ్యక్షుల సూచనలతో ముందుకు నడవాలన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ చంద్రబాబు, పవన్ కళ్యాణుపై విమర్శలు చేస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. ఎన్నికలకు 90 రోజులే ఉంది కాబట్టి కలిసి కార్యాచరణ వేసుకుని ముందుకు సాగాలన్నారు బండారు సత్యనారాయణమూర్తి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పోరాటమనే ఆయుధం మనకు ఇచ్చారు.. ఆ ఆయుధంతో కలిసి ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు బండారు సత్యనారాయణమూర్తి. జనసేన, టీడీపీలది ఒకే మాట ఒకే బాట అని, రెండు పార్టీల అధ్యక్షుల సూచనల మేరకు మనం ముందుకు సాగాలన్నారు బండారు సత్యనారాయణమూర్తి. తెలుగుదేశం – జనసేనలను విభజించి పాలించాలనే కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన కలయిక చారిత్రక అవసరమన్నారు బండారు సత్యనారాయణమూర్తి.
‘అభి తో పార్టీ షురు హుయ్ హై’.. యువకులపై మీద పడిన డీజే
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో కొందరు బాలురు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. మినీ ట్రక్కులో డీజేని అమర్చారు. ట్రక్కు ముందుకు కదులుతోంది. 12 నుండి 13 మంది అబ్బాయిలు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ దానిని అనుసరిస్తున్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా డీజే ట్రక్కు నుంచి కింద పడింది. అది కూడా నేరుగా అబ్బాయిలపైకి. ఈ క్రమంలో నలుగురు అబ్బాయిలు గాయపడ్డారు. డీజే పడిపోయిన వెంటనే సమీపంలోని వ్యక్తులు దానిని వెంటనే ఎత్తుకున్నారు. దీని వల్ల చాలా మందికి గాయాలు కాలేదు.
దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఫుల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. ఇక్కడ దసరా తర్వాత కూడా విగ్రహ నిమజ్జనం జరుగుతుంది. ఈ క్రమంలో కొందరు బాలురు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. విగ్రహాన్ని మినీ ట్రక్కులో ఉంచారు. అదే సమయంలో, ఈ వ్యక్తులు డీజేని ఇన్‌స్టాల్ చేసారు. ఈ సమయంలో దాదాపు 12 నుంచి 13 మంది అబ్బాయిలు డీజే ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ‘అభి తో పార్టీ షురు హుయ్ హై’ పాట ప్లే అవుతోంది.
నాపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దు
తనపై జరిగిన దాడిని చిన్నదిగా చూడొద్దని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. నాపై దాడి వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారిలో 9 మందిని గుర్తించి ఆరుగురిని అరెస్టు చేశారని తెలిపారు. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నేను భువనేశ్వరిని తప్పుగా మాట్లాడలేదని మంత్రి వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పీకే కాదు..కిరాయి కోటిగాడు అని అభివర్ణించారు. చంద్రబాబును ఏదైనా అంటే పవన్ మాత్రం రోడ్డు మీద పడుకుంటాడు.
ముద్రగడపై దాడి చేసినప్పుడు పవన్ ఖండించాడా అని ప్రశ్నించారు. కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారు. వారు టీడీపీని నాశనం చేస్తున్నారు. టీడీపీ అంత బలంగా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా?. భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీకానీ, వ్యక్తిగానీ బ్రతికి బట్ట కట్టలేదు. ముద్రగడ మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండించాను. పవన్ కల్యాణ్ అంటే పీకే కాదు.. కిరాయి కోటిగాడు. ఆయన కిరాయి తీసుకుంటాడు కాబట్టి ఖండించడు. ప్రగల్భాలు పలికే పవన్.. చంద్రబాబును ఏదైనా అంటే మాత్రం రోడ్డు మీదకు వచ్చి పడుకుంటాడు’ అని ఎద్దేవా చేశారు.
రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్
విజయనగరం రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అటు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరామర్శకు సీఎం వైయస్ జగన్ వెళ్తారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి రాయఘడ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సిగ్నల్ లేకపోవడంతో భీమాలి-అలమండ స్టేషన్ల మధ్యలో పలాస ప్యాసింజర్ అత్యంత నెమ్మదిగా వెళ్తోంది. ఆ సమయంలో ఈలోపు వెనుక నుంచి విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ వేగంగా వచ్చి ఢీకొంది. పలాస ప్యాసింజర్‌కు చెందిన గార్డ్ బోగీ ఎగిరి దూరంగా పడింది. దానికి ముందున్న రెండు బోగీలు పక్కకు ఒరిగి, అవతలి ట్రాక్‌పై బొగ్గు లోడ్‌తో ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. రాయఘడ ప్యాసింజర్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసమైంది. దాని రెండు బోగీలూ పట్టాలు తప్పాయి. ఘటనలో 13 మంది మృతి చెందగా.. 50 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.