బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భుతమైన మేనిఫెస్టో అని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి 16 వేలు ఇవ్వనోతున్నాం అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బీఎంఆర్ కన్వెన్షన్ హల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులకు మావోయిస్థుల హెచ్చరిక:
తాజాగా సిద్ధిపేటలో మావోయిస్థులు ప్రదర్శించిన పోస్టర్లను కలకలం రేపుతున్నాయి. పోస్టర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులకి హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇసుక మాఫీయా, భూ కబ్జా లు చేస్తున్నారని.. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని.. ప్రజలపై బీఆర్‌ఎస్ నాయకులు పెత్తనం చెలయిస్తున్నారని.. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని.. లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవు అంటూ మావోయిస్టులు పోస్టర్ల ద్వారా బీఆర్‌ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.
నా ప్రాణాలకు ముప్పు ఉంది: చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. 3 పేజీల లేఖ రాశారు. అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు పంపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో బాబు పేర్కొన్నారు.
చంద్రబాబు పిటిషన్ విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి:
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ దసరా పండగ సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని స్పష్టం చేశారు. ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారని తెలిపారు.
Also Read: Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు
ఇజ్రాయెల్ చట్టాలను ఉల్లంఘిస్తోంది:
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. గాజాలో ఏడు వేల మందిని చంపిన తర్వాత కూడా రక్తపాతం, హింస ఆగలేదన్నారు. మూడు వేల మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడి తర్వాత, ఇజ్రాయెల్ నిరంతరం గాజాలో ఘోరమైన బాంబు దాడులను నిర్వహిస్తోంది. నగరాన్ని శ్మశాన వాటికగా మార్చినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని నిరంతరం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ప్రియాంక గాంధీ కూడా సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆమె అన్నారు.
టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్:
సిద్దూ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ‘ టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కుతోంది.
ఓటీటీలోకి వచ్చేసిన పెదకాపు 1:
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ యాక్షన్ మూవీ పెదకాపు 1. ఈ సినిమా లో విరాట్ కర్ణ, ప్రగతి ప్రధాన పాత్రలలో నటించారు. శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సినిమా ఓటీటీలో కి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సెప్టెంబర్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.