ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నింటితో పాటు సినిమా పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా రోజులు థియేటర్లు మూతపడడంతో పాటు ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ కుప్పలు తెప్పలుగా వాయిదా పడ్డాయి. రీసెంట్ గా థియేటర్లు రీఓపెన్ కావడంతో వారానికి కనీసం 5 సినిమాల చొప్పున బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. థియేటర్లను మళ్ళీ తెరచినప్పటి నుంచి నిన్నటి వరకు 15 నుంచి 20కి పైగానే సినిమాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 3 సినిమాలు మాత్రమే…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మరింత లోతుగా విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాల కింద అవసరమైతే ఇంటర్పోల్ మద్దతు తీసుకునే ఆలోచనలో ఈడి ఉన్నట్లుగా సమాచారం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రక్స్ కొనుగోలుపై పునాదులు తవ్వుతోంది ఈడి. ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్ళించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 12 మంది సినీ తారలకు ఈడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిచ్చే సమాచారాన్ని బట్టి…
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఈశ్వరయ్య అనే వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12 రోజులు ప్రయాణించి చిరంజీవిని కలిశారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు చిరు. అనంతరం ‘భీమ్లా నాయక్’ సెట్ లో పవన్ ను కలిశాడు. ఈ సందర్భంగా చిరంజీవి ‘తనను కలిసేందుకు అభిమానికి…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతీయ సినిమా రంగంలో థియేట్రికల్ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్న ఏకైక సినిమా పరిశ్రమ టాలీవుడ్. థియేటర్లు తిరిగి తెరిచినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. నెమ్మదిగా ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం 5 సినిమాలకు తక్కువ కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రానురానూ చిన్న సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం (ఆగష్టు 27న) కూడా…
(ఆగస్టు 27న కె.ఎస్. ప్రకాశ రావు జయంతి)కోవెలమూడి సూర్యప్రకాశరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, కథకునిగా పలు విన్యాసాలు చేసి అలరించిన ఘనుడు కె.ఎస్.ప్రకాశరావు. ఆయన తనయుడే దర్శకేంద్రునిగా జనం మదిలో నిలచిన కె.రాఘవేంద్రరావు. ఆయన వారసులందరూ చిత్రసీమలోనే రాణించారు. పెద్దకొడుకు కె.కృష్ణమోహనరావు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. చిన్న కొడుకు కె.ఎస్.ప్రకాశ్ పేరు మోసిన సినిమాటోగ్రాఫర్, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. ప్రకాశరావు అన్న కొడుకు కె.బాపయ్య కూడా దర్శకునిగా…
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విషయం మరోసారి తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న రానా, రకుల్ వంటి ఇతర ప్రముఖులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసును ఇప్పటికీ అయిన త్వరగా తేలిస్తే మంచిదని అన్నారు. Read Also : ‘మోసగాళ్ళకు…
ఎస్ఎమ్ 4 ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న ‘కాలం రాసిన కథలు’ సినిమా గురువారం ఆరంభించింది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైన ఈ సినిమాకు పృథ్వీ క్లాప్ కొట్టగా వెంగళరావు నగర్ కార్పోరేటర్ కెమెరా స్విచాన్ చేశారు. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో సాగర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘కొంటె కుర్రాడు’ అలియాస్ లోఫర్ గాడి ప్రేమకథ అనే సినిమా తీశానని, ఈ సినిమాలో వెన్నెల, రీతూ జంటగా నటిస్తున్నారని చెప్పాడు…
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ సెలెబ్రిటీల పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. 2017 లోనే ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు రవితేజ, ఛార్మి, రకుల్, రానా, తరుణ్, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ తదితరుల నుంచి శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ నిర్ధారణ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు. ఆ తరువాత ఈ కేసులో వేగం తగ్గిపోయింది. తాజాగా ఈడీ సెలెబ్రెటీలకు…