తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బండ్లగణేష్ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కానీ తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనాన్ని రీ ట్వీట్ చేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందులో బండ్ల ఒక జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. దీన్ని రీట్వీట్ చేసి ఆ విషయం నిజమేనని బండ్ల గణేష్ నిర్ధారించారు. దీంతో…
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ…
“వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో 2013లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అప్పటి నుండి ఆమె టాలీవుడ్లోనే కాకుండా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో కూడా బిజీ అయిపోయింది. రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.…
వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు. రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే…
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం…
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం…
ఆగష్టు 15న అంటే నేడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ జెండా వందనం జరిగింది. తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జెండాను ఎగరవేశారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి అణచివేత పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన…
మోహన్ బాబు కు కోపం ఎక్కువ. ఇది అందరూ చెప్పే మాట. అయితే ఆయనకు కోపం ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అనేది మాత్రం ఆయనతో పనిచేసిన వారికి, సన్నిహితులకు మాత్రమే తెలిసిన సత్యం. సమయపాలన, క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు… దానిని పాటించని వారి పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఎంతమంది ముందు అయినా వారిని గట్టిగా మందలిస్తారు. దాంతో ఆయన ఆగ్రహం హైలైట్ అవుతుంది తప్పితే, దాని వెనుక కారణం కాదు. ఇదిలా ఉంటే… నటుడిగా…