గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టెలీవిజన్ రంగంలో ప్రముఖ యాంకర్స్ గా చెలామణిలో ఉన్న సుధీర్, రష్మిపై వచ్చినన్ని ప్రేమకథలు ఎవరి మీదా వచ్చిఉండవు. వీరి ప్రేమకథలను బేస్ చేసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పలు ఛానెళ్లలో వచ్చాయి. ‘సుధీర్, రష్మి కళ్యాణం’ పేరుతో కూడా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందింది. అయితే ఈ జంట ఎప్పటి కప్పుడు అవన్నీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేటానికి మాత్రమేనని తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదని అని స్పష్టం చేస్తూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో విషయం మారినట్లు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అని స్పష్టం అవుతోంది. ఇదే విషయాన్ని వారిద్దరూ కూడా ఇన్ డైరెక్ట్ గా అంగీకరించటం గమనార్హం.
Read Also : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్… వాళ్ళపై కూడా కేసు పెట్టాలి : ఆర్పీ పట్నాయక్
వినాయక చవితి పండగ సందర్భంగా ఓ ఛానెల్ లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అయింది. ఇందులోనూ సుధీర్, రష్మీ ప్రేమ వ్యవహారమే ప్రధానమైన థీమ్. ఈ సందర్భంగా ఇంద్రజ రష్మిని మాట్లాడమని బలవంతం చేసింది. అప్పుడు రష్మీ, సుధీర్ కళ్ళతోనే మాట్లాడేసుకున్నారు. గత 9 సంవత్సరాలలో ఎప్పుడూ వ్యక్తిగతంగా తాము కనెక్ట్ కాలేదని సుధీర్ ధృవీకరించారు. అయితే గత కొంత కాలంగా అందులో మార్పు వచ్చిందన్నాడు. దీనిని బట్టి వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా అంగీకరించనట్లు అయింది. సుధీర్ మాటలకు రష్మి మౌనంగా ఉండటంతో అది అర్ధంగీకారంగా భావించవచ్చని ఇంద్రజ పేర్కొన్నారు. ఎంతోకాలంగా రష్మి-సుధీర్ ఫ్యాన్స్ వీరిద్దరినీ జంటగా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు వారి కోరిక ఫలించబోతోంది. మరి సుధీర్, రష్మీ జంట తమ బంధాన్ని ఏడడుగులు వేసే దిశగా తీసుకువెళుతుందని భావించవచ్చు. అదే జరిగితే తెలుగు టెలివిజన్ రంగంలో ఈ జంట పవర్ ఫుల్ కపుల్ గా మారే అవకాశం ఉంది. లెట్స్ హోప్ సో…