ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అతని అభిమానులు ‘మహా సముద్రం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం ‘జబర్దస్త్’ మూవీలో నటించిన సిద్ధార్థ్, మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… అతనిది సమ్ థింగ్ స్పెషల్ పాత్రే అయి ఉంటుందని ఊహించుకున్నారు. వీటికంటే ప్రధానంగా ‘ఆర్. ఎక్స్. 100’ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా, కాదని డైరెక్టర్ అజయ్ భూపతి…
మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా…
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రతి రోజూ మీడియాలో నానుతూనే ఉంది. అయితే అక్టోబర్ 15 న దసరా సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల తెలుగులోనూ సమంత ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికె తో మరో…
సి.ఎల్.ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ‘పాయిజన్’ ఒకే సారి విడుదల కాబోతోంది. ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ ప్రాంతాల్లో విభిన్నమైన లొకేషన్లలో భారీ స్థాయిలో చిత్రీకరించామని, దర్శకుడు శ్రీ రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే స్టైలిష్ తెరకెక్కించారంటున్నారు నిర్మాత. ఫ్యాషన్ తో పాటు గ్లామర్ ఉన్న ఇండస్ట్రీలో జరిగే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్…
భారత పర్యాటక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన హంపీ క్షేత్రం నేపథ్యంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. లండన్ లో చదువుకుని, నటనలో మెళకువలు నేర్చుకున్న హృతిక్ శౌర్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కంప్యూటర్ గేమింగ్ లో మోకో గా పాపులర్ అయిన ముంబై ముద్దుగుమ్మ కసిక కపూర్, చెన్నైలో బాక్సింగ్ శిక్షణ పొంది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షెర్లిన్ సేథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభాకర్…
దసరా వార్ లో ముగ్గురు యంగ్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు. వారాంతం వచ్చేసింది. అలాగే ఈ వారాంతంలోనే దసరా కూడా ఉండడంతో సినీ ప్రేక్షకులకు, అలాగే మేకర్స్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సందడి మొదలు కానుంది. ఈ వీకెండ్ దసరా కూడా ఉండడంతో విడుదల కాబోతున్న మూడు సినిమాలకు మంచి న్యూస్ అని చెప్పొచ్చు. మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలు ఈ సీజన్లో…
కన్నెలను కన్నెత్తి చూడని ఋష్యశృంగులనైనా వీపున బాజా మోగించి, తనవైపు చూపు తిప్పేలా చేసే కాకినాడ ఖాజాలాంటి అమ్మాయి పూజా హెగ్డే. ముంబైలో పుట్టిన పూజా హెగ్డే దక్షిణాది మూలాలు ఉన్నదే! ఉత్తర దక్షిణాలను తన అందంతో కలగాపులగం చేస్తోన్న ఈ భామ నేడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాజ్యమేలుతోంది. టాలీవుడ్ లో టాపు లేపుతూ సాగుతోంది పూజా హెగ్డే. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది. ఆమె కన్నవారు కర్ణాటకలోని ఉడుపికి…
అంతా అనుకున్నట్టే జరిగింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారంతా “మా” పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు రూట్ క్లియర్ అయినట్టుంది. రెండేళ్ల పాటు “మా”లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఎవరూ ఉండరు. “మా” సభ్యుల మంచికోసమే ఈ రాజీనామాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించింది. ఈ రెండేళ్లలో విష్ణు చేసే పనులుకు అడ్డుగా ఉండకూడదనే ఈ రాజీనామాలన్నారు. మీడియాను పిలిచి ఈ విషయం స్వయంగా చెప్పారు ప్రకాష్ రాజ్. మూకుమ్మడి…
గోపీచంద్, తమన్నా జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ విడుదలైన కమర్షియల్ గా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. భూమిక, రెహ్మాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కి, యువతనూ ఆకట్టుకుంది. కమర్షియల్ హంగుల్ని దర్శకుడు సంపత్ నంది చక్కగా అద్దగా, దానికి తగ్గట్టుగానే మణిశర్మ మాస్ ను అలరించే ట్యూన్స్ ఇచ్చారు. దాంతో ఇది మ్యూజికల్…