యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్ తో మిగతా హీరోలతో పోలుస్తూ రచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కన్పించడం లేదా ? అన్నట్టుగా మీమ్స్ తోనే నిలదీస్తున్నారు. అయితే ఈ గోలంతా ప్రభాస్, మహేష్ సినిమాల గురించే. ఈ నిలదీత ఇద్దరు స్టార్ హీరోల మేకర్స్ ను ఉద్దేశించే.
గత వారం రోజుల నుంచి టాలీవుడ్ లో ఇతర హీరోల సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల అవుతున్నాయి. డిసెంబర్ లో విడుదల కానున్న సినిమాలతో మొదలుకొని సంక్రాంతి రేసులో ఉన్న అన్ని సినిమాల నుంచి రోజుకో అప్డేట్ వస్తోంది. ఆర్ఆర్ఆర్, పుష్ప, భీమ్లా నాయక్, అఖండ, ఆచార్య, బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్, ఖిలాడీ చిత్రాల నుంచి ఈ వారం రోజుల్లో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వారి వారి అభిమానులను ఫుల్ ఖుషి చేసింది. గత 5 రోజుల్లో వచ్చిన అన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి సినిమాలకు కావాల్సినంత బజ్ పెంచేశాయి.
Read Also : బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ?
కానీ ప్రభాస్ నటించిన పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”, మహేష్ బాబు “సర్కారు వారి పాట” మేకర్స్ ఇంకా నిద్రపోతున్నారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరి సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ లేవు. ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘సర్కారు వారి పాట’ జనవరి 13న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 1కి వాయిదా పడింది. అయితే ఈ ఇద్దరు స్టార్ల సినిమాల నుంచి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. తమ నిరాశను, అసంతృప్తిని సోషల్ మీడియాలో ఇతర హీరోల ప్రమోషన్ కార్యక్రమాలతో పోల్చుతూ మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ‘రాధేశ్యామ్’ విడుదలకు ఇంకా దాదాపు 2 నెలలు, ఇక “సర్కారు వారి పాట” రిలీజ్ కు చాలా సమయం ఉంది.