బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫేమ్ సంపాదించుకున్నారు చాలా మంది ఆర్టిస్టులు. ఎంతో మందికి మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఈ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. షోతో పాటు హైపర్ ఆది క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన వేసే పంచులు, కామెడీ టైమింగ్ తెలుగు బుల్లితెర ప్రియులకు బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఆది “ధమాకా” అనే సినిమాతో పాటు పలు టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల వివాదంలో చిక్కుకున్న హైపర్ ఆదిపై దాడి జరిగింది అంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also : “అర్జున ఫల్గుణ” యాక్షన్ ప్యాక్డ్ టీజర్
ఆది తన తాజా స్కిట్ లో ఓ ప్రముఖ హీరోపై పంచులు వర్షం కురిపించాడని, అది ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆది ఎక్కడ కన్పించినా కొడతామని సదరు హీరో అభిమానులు ఫైర్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వారు అన్నంత పనీ చేశారని, హైపర్ ఆదిపై దాడి జరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది.