కూకట్ పల్లి కోర్టులో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు విచారణ చేపట్టారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఆ లోగానే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్తలు రాశారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పు జరిగిందని భావిస్తే పరువునష్టం…
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాలార్’ సినిమాలో మరో సౌత్ ఇండియన్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలలో పరభాషా తారలను నటింపచేయటం ఆసక్తికరంగా మారింది. అలా యష్ నటిస్తున్న ‘కెజిఎఫ్2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించడంతో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నెగటివ్ రోల్ పోషిస్తుండటం ఆ సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న…
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘నాట్యం’ సినిమాకు ప్రశంసలు అందించారు. ‘నాట్యం’ సినిమా చాలా చక్కగా ఉండి మంచి ఫీలింగ్‌ను కలిగించింది. నాట్యం అంటే ఓ కథను అందంగా, దృశ్యరూపంలో చూపించడం. నాట్యం అంటే కాళ్లు, చేతులు లయబద్దంగా ఆడించడం అనుకుంటారు కానీ దర్శకుడు రేవంత్, సంధ్యా…
గర్భధారణ నుంచి కుమార్తె పుట్టుక వరకూ దాదాపు ఒకటిన్నర సంవత్సరం రహస్యంగా ఉంచిన శ్రియా శరన్ తన కుమార్తెను పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక శ్రియ ఆమె భర్త ఆండ్రీ తమ కూతురుకు ‘రాధ’ అని పేరు పెట్టారు. అయితే ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది శ్రియ. అమ్మకు అమ్మాయి పుట్టింది అని చెప్పిన క్షణంలో ఆమె ‘ఓ… రాధా రాణి వస్తోంది’ అనేసింది. అప్పుడు ఆండ్రీ మీ అమ్మ చాలా…
రంగస్థల నాటిక, నాటక కళాకారుల అభ్యున్నతి సాంస్కృతిక సంస్థ కళల కాణాచి. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. ఆయన ఆధ్వర్యంలో తెనాలి లో నిర్వహించిన సాంఘిక నాటక పోటీల ముగింపు సందర్భంగా న్యాయ నిర్ణేత గా ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ పొల్గాన్నారు. ఈ సందర్భంగా కళల కాణాచి, వేద గంగోత్రి సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించి ‘నట విశిష్ణ’ బిరుదును ప్రదానం చేసి సన్మానించాయి. తెనాలి వ్యాస్తవ్యులు,…
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు…
విజయవాడ : శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు శ్రీ లీల హీరో హీరోయిన్లు గా పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని విజయ వంతంగా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల వివాదంలో చిక్కుకుంది. శ్రీ లీల తన కూతురే కాదని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో…
హీరో సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్ 10 వ తేదీన సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. 35 రోజులపాటు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పోందారు. సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజ్‌కు ఇది పునర్జన్మ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేశారు. అంతఇష్టం అనే టైటిల్ తో కూడిన సాంగ్ పూర్తి మెలోడీగా శ్రీకాకుళం యాసతో సాగింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. బీమ్లా నాయక్ టైటిల్ పాత్రలో పవన్ నటిస్తుండగా, రానా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.…
ఆర్ఆర్ఆర్ సినిమాను కంప్లీట్ చేసిన రామ్ చరణ్ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్‌తో సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీరావా, జర్సీ వంటి హిట్ చిత్రాలకు గౌతమ్…