నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్… సామ్ తో విడిపోవడానికి రీజన్ ఇదేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాము అని ప్రకటించి షాక్ ఇచ్చినప్పటి నుంచి, ఇప్పటికీ వీళ్లిద్దరి విడాకుల విషయమే హైలెట్ అవుతోంది. అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఇద్దరూ స్పందించకపోవడంతో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక అప్పటి నుంచి సమంత నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది.
నాగ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పాత్రలు చేయడానికి ఇష్టపడనని వెల్లడించాడు. విభిన్న రకాల పాత్రలు చేయడం గురించి ఆయనను అడిగినప్పుడు చై బదులిస్తూ “నేను అన్ని రకాల పాత్రలకు చేస్తాను. అయితే ఆ పాత్రలు నా కుటుంబాన్ని, మా ప్రతిష్టను ప్రభావితం చేయకూడదు. నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే పాత్రలను నేను అంగీకరించను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చై చేసిన వ్యాఖ్యలు సామ్ కు కూడా వర్తిస్తాయి అంటూ ఆయన మాజీ భార్య సమంతను, ముఖ్యంగా ఆమె కెరీర్ లో పాత్రల ఎంపికలను ప్రస్తావిస్తున్నారు.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్
సామ్ ఇటీవల కాలంలో బోల్డ్ గా కన్పిస్తూ మరింత గ్లామర్ ను ఒలకబోస్తున్న విషయం తెలిసిందే. సమంత కెరీర్ నిర్ణయాలను నాగ చైతన్య, ఆయన కుటుంబం ప్రోత్సహించకపోవడమే ఈ ఇద్దరు విడిపోవడానికి కారణం అని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నా… ఇప్పుడు చై చేసిన కామెంట్స్ తో విడాకులకు ముఖ్య కారణం ఇదేనని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. వాళ్ళు విడిపోయే ముందు విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దీనంతటికీ కారణం అని, అందులో సామ్ తన పాత్ర గురించి కుటుంబ సభ్యులకు ముందుగా చెప్పలేదని, దీంతో విషయం విడాకుల దాకా వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సామ్ ఈ వెబ్ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారి విడాకుల కోసం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ప్రస్తుతం తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. నాగ చైతన్య… అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా”లో భాగం అయ్యాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు విడిపోయిన తర్వాత సమంత కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె తన మొట్టమొదటి ఐటెమ్ సాంగ్‌కు సంతకం చేసింది. అలాగే తన మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో కూడా నటించబోతోంది. సమంత తన ప్రతి సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ పోతోంది.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!