యాక్షన్ హీరో విశాల్ కెరీర్లో 31వ చిత్రంగా రూపొందుతోంది ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. నిజానికి ఈ…
పూర్ణ ప్రధాన పాత్రధారిణిగా తేజ త్రిపురాన హీరోగా నటించిన సినిమా ‘బ్యాక్ డోర్’. కర్రిబాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పాటు 3వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కె.ఆర్. ఫిలిమ్ ఇంటర్నేషనల్ అధినేత, పంపిణీదారుడు కందల కృష్ణారెడ్డి పొందారు. ఈ సినిమా విడుదల పురస్కరించుకున్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపీనాథ్, ‘రావణలంక’ హీరో…
కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఈ యేడాది థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ అభిమానులు ఈ విషయంలో కాస్తంత నిరాశకు గురైనా, ఒకే సమయంలో 190 దేశాలలో 17 భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అయ్యి విడుదల కావడం వారికి కొంత ఓదార్పును కలిగించింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పునరావృతం కాబోతోంది. ధనుష్ నటించిన తాజా హిందీ చిత్రం ‘అత్రంగీ రే’…
స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీ నిండా సన్నిహితులే. ఆమెకు శిల్పారెడ్డి, చిన్మయి శ్రీపాద వంటి ఇండస్ట్రీకి చెందిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటీవలే ఈ బ్యూటీ తమిళ నటీమణులు నయనతార, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో సెల్ఫీలు దిగగా, శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాతిక యాత్రను చేసింది. ఇక తాజాగా పాపులర్ సింగర్ చిన్మయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆమెపట్ల ప్రేమను వ్యక్త పరిచింది. అంతేకాదు చిన్మయి తాజాగా స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్…
(నవంబర్ 18న నయనతార పుట్టినరోజు)నయనతార అందంలో అయస్కాంతముంది. అభినయంలో అంతకు మించిన ఆకర్షణ ఉంది. ఏ తీరుగ చూసినా నయనతార అందాల అభినయం నయనానందం కలిగిస్తుంది. నయనతారను ఈ తరం వారి సీతమ్మ అని చెప్పవచ్చు. అలాగే నిర్మాతల పాలిటి లక్ష్మీ అని భావించవచ్చు. సౌత్ లో నంబర్ వన్ నాయికగా తన తీరే వేరంటూ సాగుతోంది నయన్. తాను నటించిన సినిమాల ప్రచారపర్వంలో పాలు పంచుకోవడానికి నయన్ అంత సుముఖత చూపించరు. ఆమె పెట్టే షరతులను…
ఇటీవలే తెలుగు నటి చౌరాసియాపై కేబీఆర్ పార్క్ వద్ద ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్క్‌లో ఎప్పటిలాగే వాకింగ్ కోసమని వెళ్లాలనని, పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని నటి చౌరాసియా తెలియజేసింది. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మొహంపై గుద్దాడని తెలిపింది. తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే ఫోన్‌పే చేస్తానని, నెంబర్ ఇవ్వమని అడిగినట్టు నటి…
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని..…
ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు చక్కని ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని అన్నారు. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం ఈ మూవీని యూనిక్ గా మార్చాయని, సినిమాలోని…
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకీ జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం సినిమా ఈనెల 19 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. తమ బేనర్లో వస్తున్న మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు నిర్మాత ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. ఈనెల 19 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నట్టు…