Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 2021 Rewind 2021 Grand Weddings In Film Industry

2021 గ్రాండ్ వెడ్డింగ్స్ తో జిల్ జిల్ జిగా జిగా!

Published Date :December 23, 2021 , 2:19 pm
By Prakash
2021 గ్రాండ్ వెడ్డింగ్స్ తో జిల్ జిల్ జిగా జిగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా కారణంగా మనుషుల మధ్య దూరం పెరిగినా, మనసులు దగ్గరై ముమ్మరంగా మనువులు జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణగా టాలీవుడ్, బాలీవుడ్ లో జరిగిన పలు వెడ్డింగ్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో సెకండ్‌ మ్యారేజెస్ కూడా ఉన్నాయి సుమా! అంతేకాదు… గతంలో పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు పేరెంట్స్ గానూ ఈ యేడాది ప్రమోషన్ కొట్టేశారు.

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బాలీవుడ్ రచయిత్రి కనికా థిల్లాన్‌, ఫిల్మ్ రైటర్‌ హిమాన్షు శర్మను జనవరి 5న వివాహం చేసుకుంది. విశేషం ఏమంటే… గతంలో ఆమె దర్శకులు కె. రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి సూర్య ప్రకాశ్‌ ను వివాహమాడి, ఆ పైన విడాకులు ఇచ్చేసింది.

Kanika Dhillon on her relationship with husband Himanshu Sharma: He has set  a high benchmark as a companion | PINKVILLA
కనికా థిల్లాన్‌, హిమాన్షు శర్మ

జనవరి 7వ తేదీ నటి ఆనంది కోలీవుడ్‌ కు చెందిన సహాయ దర్శకుడు సోక్రటీస్‌ ను వరంగల్‌ లో పెళ్ళాడింది. తెలుగు అమ్మాయి అయిన ఆనంది ‘బస్టాప్‌, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో నటించింది. ఆపైన కోలీవుడ్ లో నటిగా బిజీ అయ్యింది. ఈ యేడాది తెలుగులో ఆనంది ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రాలలో నాయికగా నటించింది.

tamil: News and Stories | TrendDekho
ఆనంది, సోక్రటీస్‌

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్‌ వివాహం హైదరాబాద్‌లో జనవరి 9వ తేదీన జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్ళి!

Everybody needs a life partner and I'm glad I've found mine in Ram: Sunitha  | Telugu Movie News - Times of India
సునీత, రామ్‌

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ ధావన్‌ వివాహం అతని స్నేహితురాలు నటాషా దలాల్ తో జనవరి 14న ముంబైలోని ఓ రిసార్ట్ లో జరిగింది.

Varun Dhawan-Natasha Dalal wedding highlights, photos, videos, news | Varun  Dhawan Marriage Images and Pictures
వరుణ్‌ ధావన్‌, నటాషా దలాల్

ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్‌ వివాహం దీపికతో హైదరాబాద్‌ శివార్లలోని ఫామ్‌ హౌస్ లో ఫిబ్రవరి 13న జరిగింది.

PICS: Sumanth Ashwin ties the knot with Deepika Raju in a fairytale  ceremony, opens up about his love story | The Times of India
సుమంత్ అశ్విన్‌, దీపిక

హైదరాబాదీ మహిళ, బాలీవుడ్ బ్యూటీ దియామీర్జా వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్‌ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్‌ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు.

Dia Mirza-Vaibhav Rekhi Wedding: Couple looks like a dream together; see  pics - ToysMatrix
దియా మీర్జా, వైభవ్‌ రేఖీ

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. గుత్తా జ్వాల ‘గుండెజారి గల్లంతయ్యింది’ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ చేయగా, విష్ణు విశాల్‌ ఈ యేడాది విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్ళి.

Vishnu Vishal and Jwala Gutta are married! See couple's first photo as  newlyweds
గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌

‘అదిరింది, విజిల్‌, క్రాక్‌’ తదితర చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె. విష్ణు వివాహం చెన్నయ్ లోని ఇస్కాన్‌ టెంపుల్ లో ఏప్రిల్ 25న సి. మహాలక్ష్మితో జరిగింది.

Cinematographer GK Vishnu ties the knot with Mahalakshmi
జి.కె. విష్ణు, సి.మహాలక్ష్మి

బాలీవుడ్ దర్శకుడు ఆనంద్‌ తివారి, నటి అంగీరాధర్‌ వివాహం ఏప్రిల్ 30న నిరాడంబరంగా జరిగింది. ‘లవ్‌ ఫర్‌ స్క్వేర్‌ ఫూట్’ మూవీలో కలిసి పనిచేసినప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆనంద్‌ తివారి ‘కైట్స్, ఉడాన్‌, గో… గోవా… గాన్‌’లో నటించగా అంగీరాధర్‌ ‘కమాండో -3’, ‘బ్యాంగ్‌ బాజా బారాత్‌’లో నటించింది.

Love Per Square Foot' film-maker Anand Tiwari and actress Angira Dhar  reveal they got married in April - The Economic Times
ఆనంద్‌ తివారి, అంగీరాధర్‌

ప్రముఖ కథానాయిక ప్రణీత సుభాష్‌ వివాహం మే 30న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో జరిగింది. ప్రణీత పలు తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. ‘అత్తారింటికి దారేదీ’ మూవీ ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Pranitha Subhash And Nitin Raju Wedding News: Actress Pranitha Subhash gets  married to Nitin Raju in Bengaluru
ప్రణీత సుభాష్‌ , నితిన్‌ రాజు

తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలలో నాయికగా నటించిన యామి గౌతమ్ వివాహం, బాలీవుడ్ దర్శకుడు, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్‌ ఆదిత్య ధర్‌ తో జూన్ 4న జరిగింది.

Yami Gautam on simple wedding with Aditya Dhar: 'Even without pandemic, it  would've been the same wedding' | Entertainment News,The Indian Express
యామి గౌతమ్, ఆదిత్య ధర్‌

ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నిర్మాత రియా కపూర్‌, తన చిరకాల మిత్రుడు కరణ్ బులానీని ఆగస్ట్ 14న వివాహం చేసుకుంది. దాదాపు పుష్కర కాలంగా వారు సహజీవనం చేస్తుండటం విశేషం.

Rhea Kapoor drops NEW photos from wedding ceremony with Karan Boolani |  PINKVILLA
రియా కపూర్‌, కరణ్ బులానీ

నటుడు, జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాశ్‌ వివాహం అతని స్నేహితురాలు అనూజా వాకిటితో అక్టోబర్ 20న జరిగింది. అదే రోజున హాస్య నటుడు, యూట్యూబర్‌ వైవా హర్ష వివాహం అక్షర రేసుతో జరిగింది.

Mukku Avinash : ఓ ఇంటివాడు కాబోతున్న ముక్కు అవినాష్ | jabardasth fame mukku  avinash engaged
అవినాశ్‌, అనూజా వాకిటి

దాదాపు 11 సంవత్సరాల డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ తన గర్ల్ ఫ్రెండ్‌ పత్రలేఖ ను చండీఘర్ లో నవంబర్ 15న పెళ్ళి చేసుకున్నాడు.

10 pictures that take us inside Rajkummar Rao and Patralekhaa Paul's  wedding | Vogue India
రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ

యంగ్ హీరో, ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్‌ కార్తికేయ వివాహం ప్రియురాలు లోహితతో హైదరాబాద్ లో నవంబర్‌ 21న జరిగింది. వీరిద్దరూ కలిసి 2010లో వరంగల్ నిట్‌ లో కలిసి చదువుకున్నారు.

Chiranjeevi and other superstars attend Kartikeya Gummakonda's wedding to  Lohitha Reddy - Zee5 News
కార్తికేయ, లోహిత

ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం హీరో విక్కీ కౌశల్ తో డిసెంబర్ 9న రాజస్థాన్ లోని బర్వారా లోని సిక్స్ సెన్సెన్స్ ఫోర్ట్ లో జరిగింది.

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: Vicky-Katrina Kaif  Marriage News LIVE, Katrina-Vicky Wedding Venue Six Senses Fort Barwara,  Katrina Kaif and Vicky Kaushal's Wedding LIVE Coverage here
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్

మాతృత్వ మధురిమల ఆస్వాదనలో…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీకి జనవరి 11న కూతురు జన్మించింది. ఆ చిన్నారికి వామిక అనే పేరు పెట్టారు.

Virat Kohli wishes his father was alive to meet daughter Vamika |  Entertainment News,The Indian Express

తెలుగులో పలు చిత్రాలలో నటించిన ‘నువ్వు-నేను’ ఫేమ్‌ అనిత హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. ఆరేళ్ళ క్రితం ఆమెకు వ్యాపారవేత్త రోహిత్‌ రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఫిబ్రవరి 9న మగబిడ్డ జన్మించాడు.

Anita Hassanandani and Rohit Reddy get into 'Pawri' mode as their baby boy  turns a month-old - Times of India

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కు మరోసారి ఫిబ్రవరి 21న మగబిడ్డ పుట్టాడు. గతంలో పుట్టిన బాబుకు తైమూర్ అనే పేరు పెట్టిన వీరు, తాజా సంతానానికి జహంగీర్ అనే పేరు పెట్టారు.

Kareena Kapoor Khan And Saif Ali Khan's Son: Times when Saif Ali  Khan-Kareena Kapoor's second son Jehangir Ali Khan looked like a copy of  elder brother Taimur

ఈ యేడాది ఫిబ్రవరి 15న వైభవ్ రేఖీని వివాహమాడిన దియా మీర్జా మే 14న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి అవ్యాన్‌ ఆజాద్‌ రేఖీ అనే పేరు పెట్టారు.

Image

మే 22న ప్రముఖ గాయని శ్రియా ఘోషల్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. 2015లో శైలాదిత్య ముఖోపాధ్యాయతో ఆమెకు వివాహం జరిగింది.

Shreya Ghoshal introduces her son Devyaan with her fans as he turns 6  months old – See photos | Hindi Movie News - Times of India

నటి రిచా గంగోపాధ్యాయ, జో లాంగెల్లా దంపతులకు మే 27న మగబిడ్డ జన్మించాడు. పలు తెలుగు చిత్రాలలో నటించిన రిచా వివాహం జో తో 2019లో జరిగింది.

Image

కోలీవుడ్ తో పాటు పలు టాలీవుడ్ చిత్రాలలో నటించిన మహత్ రాఘవేంద్ర కు జూన్ 7న కొడుకు పుట్టాడు.

Mahat Raghavendra and Prachi have named their darling son

హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్‌ దంపతులకు జూలై 23న ఆడపిల్ల జన్మించింది. వీరిద్దరి ప్రేమ వివాహం 2019లో పెద్దల అంగీకారంతో హైదరాబాద్ లో జరిగింది.

CELEBRITY PICS: Sayesha Saigal with baby

అక్టోబర్ 3 వ తేదీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పలు చిత్రాలలో నటించిన నేహా ధూపియా, అంగద్‌ బేడీ దంపతులకు కొడుకు పుట్టాడు.

Neha Dhupia And Angad Bedi Take Time Off Baby Mehr Duties, Get Clicked At A  Lunch

నటి ప్రీతిజింతా సరొగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవంబర్ 18న ఆమె భర్త్ జీన్‌ గుడెనఫ్ తెలిపారు. పిల్లలు జియా, జై అనే పేర్లు పెట్టినట్టు ప్రకటించాడు.

Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2021 Grand Weddings in Film Industry
  • Celebrities Wedding in 2021
  • Married South Stars in 2021
  • Stars Marriage in 2021
  • Tollywood

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions