ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది.
Read Also : భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
కీర్తి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ వీడియోను పంచుకుంది. వీడియోలో పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు ? అని కీర్తి ఒక పాపను అడిగింది. ఆ పాప వెంటనే ‘సమంత’ అని చెప్పింది. ఆ చిన్న అమ్మాయి తాను సమంతాకి వీరాభిమానిని అని చెప్పింది. ఈ వీడియోను పంచుకుంటూ కీర్తి “సమంతా మీ అభిమాని… మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్” అని కోరింది. కాసేపటికే సమంత ఆ వీడియోకు రిప్లై ఇస్తూ.. ‘‘ఎవరు ఈ క్యూటీ’’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.