రొమాంటిక్ మూవీ ‘డీజే టిల్లు’లో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధూకి హీరోయిన్ పుట్టుమచ్చల గురించిన ప్రశ్నను సంధించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సిద్ధు ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు లేదా తన అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఈ రోజు తన ట్విట్టర్ లో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి స్పందించాడు. ప్రతి ఒక్కరూ ‘నటులను గౌరవించండి’ ఈ నోట్ ను పోస్ట్ చేశాడు.
Read Also : ప్రముఖ దర్శకుల మధ్య వార్… వరుస ట్వీట్లతో రచ్చ
“నా కొత్త చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాపై చాలా కించపరిచే ప్రశ్న విసిరారు. ఆ సమయంలో నా రెస్పాన్స్ కోసం చాలా మంది అడిగారు. కానీ నేను ఆ టైంలో సింపుల్ గానే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా స్కిప్ చేసే ప్రయత్నం చేశాను. కానీ ఇపుడు ఆ విషయంతో మరింత మంది ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కోసం, ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని తెలిసింది. మేము యాక్టర్స్… కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో చాలా కష్టంగా, ఇబ్బంది పడుతూనే నటిస్తాము. ముఖ్యంగా ఇది ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. సినిమా యూనిట్ అంతా ఆ సీన్ టైంలో ఉంటారు. అందరి ముందు అలాంటి సీన్స్ చెయ్యాలి అంటే ఎంతో గుండె ధైర్యం కావాలి.
ఈ విషయంలో మమ్మల్ని అర్ధం చేసుకొని మా వృత్తిని గౌరవిస్తారు అనుకుంటాము. కానీ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మేము ఏది చేసినా, ఎంత చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే అని అంతా అర్ధం చేసుకోవాలి. నేను నా డీజే టిల్లు సినిమా ప్రమోట్ చేసుకోడానికి మాత్రమే వచ్చాను. మా సినిమాలో అన్ని హంగులూ ఉన్నాయి, అందరికీ నచ్చుతుంది… మళ్ళీ కలుద్దాం” అని ఈ ప్రెస్ నోట్ తో క్లారిటీ ఇచ్చాడు. కాగా సదరు సీనియర్ జర్నలిస్ట్ బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఇక విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ ఫిబ్రవరి 11న విడుదల కానుంది.