ఏపీ లో సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఏపీ ఫిలిం ఛాంబర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖ లో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఆన్లైన్ టికెట్ సదుపాయం ను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఇస్తామని లేఖలో వివరించింది.
ఆన్లైన్ టికెట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన 69 జీవో కంటే ప్రస్తుతం ఉన్న విధానం బాగుందంటూ లేఖలో పేర్కొంది ఏపీ ఫిలిం ఛాంబర్. ఎం ఓ యూ లో పొందుపరిచిన విషయాలు వివరంగా లేవని,కాలపరిమితి తక్కువగా ఉందని లేఖలో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఎం ఓ యూ పై సంతకాలు పెట్టమని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్న ఫిలిం ఛాంబర్ సీఎంకి రాసిన లేఖలో వివరించింది. జీవో 69 వల్ల సినీ పరిశ్రమ దెబ్బ తింటుందంటూ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం FDC టికెట్ అమ్మకాల ఆదాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పలేదని ఫిలిం ఛాంబర్ సీఎం జగన్ దృష్టికి తెచ్చింది.
Cinema Ticket War: ఏపీలో టికెట్ల వార్.. తాడోపేడో అంటున్న ఎగ్జిబిటర్లు