ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్రప్రసాద్ కు ఎంపీ సంతోష్ కుమార్ ట్వీటర్ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతి చేత రాజ్యసభకు నామినేట్ అయినందున మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మన స్వంత కథా రచయిత విజయేంద్రప్రసాద్ అంటూ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లైక్స్‌తో ఫ్లోర్‌ను పంచుకోవడం నాకు గౌరవంగా ఉంటుంటూ.. ట్విటర్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ అభినందనల వర్షం కురిపించారు. ఎంపీ సంతోష్ కుమార్ తో ప్రముఖ సినీ…
టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది. శుక్రవారం ఆరు…
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కింది. ఇంకా ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసింది. అయితే, కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. కొందరు అజ్ఞానులైతే దీనిని ‘గే సినిమా’గా పేర్కొన్నారు కూడా! ఇప్పుడు అలాంటి వారి జాబితాలో తాజాగా ఆస్కార్ విన్నింగ్…
పురం సినిమా, అభిమాన థియేటర్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ‘కొంచెం హట్కే’ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కుమార్ మాట్లాడుతూ ‘సినిమా నేపథ్యంలో ప్రధాన పాత్రల వ్యక్తిగత జీవితాలు వారి సినీ జీవితాల వల్ల ఎలా ప్రభావితం అయ్యాయి. సినీ జీవితం వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా తారుమారు అయ్యాయి అనే అంశాన్ని కొత్త తరహాలో చూపించటం జరిగింది. ఇది అన్ని వర్గాల…
ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో హీరోగా నటించాడు. అలానే నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ ‘దొరసాని’ మూవీతో తెరంగేట్రమ్ చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటించబోతున్నారు. దీనిని ‘తెల్లవారితే గురువారం’ మూవీ దర్శకుడు మణికాంత్ గెల్లి తెరకెక్కిస్తున్నాడు. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ -2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్రం రెగ్యులర్ జరుపుకోనుంది.…
‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలి పట్టణంలో యన్టీఆర్ తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ఓ థియేటర్ ను నిర్మించారు. అదే థియేటర్ ప్రస్తుతం పెమ్మసాని పేరుతో నడుస్తోంది. ఇదే థియేటర్ లో యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ యేడాది మే 28వ తేదీ నుండి వచ్చే యేడాది మే 28వ తేదీ దాకా అంటే సంవత్సరం పాటు యన్టీఆర్ నటించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రోత్సవం సందర్భంగా పలువురు సినీ, నాటకరంగప్రముఖులను, యన్టీఆర్ తో…
కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోకు ‘క్యూట్’ అంటూ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ కామెంట్ పెట్టాడు. అంతే, అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ రూమర్స్‌ని వాళ్లు ఖండించకపోవడంతో.. అవి మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రియాంక షేర్ చేసిన ఒక ఫోటో.. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. అయితే.. ఆ ఫోటోలో ఉన్న సదరు వ్యక్తి ఫేస్ కనిపించడం లేదు. అతను అటువైపుకి…
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నటుడు పృథ్వీరాజ్.. మొదట్లో మంచి రోజులు చూశారు కానీ, ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నారు. ఒకానొక సమయంలో.. అటు రాజకీయంగానూ, ఇటు సినిమాల పరంగానూ దాదాపు ఆయన కెరీర్ ముగిసిపోయిందన్న దుస్థితికి చేరుకున్నారు. అయితే.. తన తప్పుల్ని తెలుసుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన ఈయన ఇప్పుడు తిరిగి పుంజుకున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన పృథ్వీరాజ్.. ఓవైపు అవకాశాలు అందిపుచ్చుకుంటూ, మరోవైపు తప్పుల్ని సరిదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ..…