krithi shetty gets offers from bollywood: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటోంది. అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన ఆమె బాలీవుడ్ ఆఫర్ గురించి ఓ విషయాన్ని బయటపెట్టింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పింది. టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదనుకుని ఆఫర్ తిరస్కరించినట్లు వివరించింది. మాచర్ల నియోజకవర్గంలో నటించిన సీనియర్ నటీనటులందరూ తన పట్ల ఎంతో ప్రేమ చూపించారంది. సముద్రఖని తన పాత్రని అవలీలగా పోషించారని పేర్కొంది.
read also: Yogi Adityanath: బీజేపీ లీడర్ ను అరెస్ట్ చేసిన యోగీ సర్కార్..
ఈ చిత్రం కోసం నటీనటులు సహా టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారని, అందుకు వాళ్లపై తనకు గౌరవముందని, తన సపోర్టివ్‌గా ఉన్న యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. ఈ నెలలో బింబిసార, సీతారామంల రూపంలో టాలీవుడ్‌కి రెండు బ్లాక్‌బస్టర్ విజయాలు దక్కాయని.. అందుకు చాలా సంతోషిస్తున్నానని కృతి చెప్పింది. తమ సినిమాను కూడా అలాగే ఆదరించి, మంచి సక్సెస్ ఇవ్వాలని కోరింది. ఇక చివర్లో అభిమానుల్ని ఉద్దేశిస్తూ.. స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బేబమ్మ, ఈ సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడాలని కోరింది. దీంతో కీర్తిపై నెటిజన్ వావ్ అంటూ ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ అంటూ ఎంత ప్రేమ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Rashmika Mandanna: ఏంటమ్మ మరీ టూ మచ్ చేశావ్..? ఆడేసుకుంటున్న అల్లు ఫ్యాన్స్..!