పరిచయం అక్కర్లేని పేరు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్. ఇప్పటివరకు ఈయన నటించిన ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. అయినా కానీ తెలుగు ప్రేక్షకులలో రణ్‌బీర్‌పై ఎనలేని అభిమానం ఉంది. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన ఫ్యాన్స్ మీట్లో అది రుజువైంది కూడా. రణ్‌బీర్ కూడా తెలుగు ప్రేక్షకులు తనను అంతగా ఆదరిస్తారని అనుకొలేదని స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సంజూ’ తరువాత దాదాపు నాలుగేళ్ళకు ఈ చిత్రంతో…
బాలతారలుగా భళా అనిపించి, నాయికలుగానూ మెప్పించిన వారున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు తులసి. పిన్నవయసులోనే కెమెరా ముందు అదురూ బెదురూ లేకుండా నించుని డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేసేసి మురిపించిన తులసి, తరువాత నాయికగానూ కొన్ని చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు. తులసి 1967 జూన్ 20న మద్రాసులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేది తులసి. ఆమె తల్లికి అంజలీదేవి, సావిత్రి మంచి స్నేహితులు. ‘భార్య’ అనే సినిమాలో…
ప్రతి వ్యక్తి జీవితంలో తొలి హీరో తండ్రి అనే చెప్పాలి. మన వెనుక నీడగా వుండి, అండగా నిలబడి తన బిడ్డ గొప్పగా ఎదగాలని, తన కొడుకు గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని ఆపడతాడు ఆతండ్రి. తన కొడుకు మరొకరు పొగుడుతుంటే నాన్న ఆనందం ఆశాన్నంటుతుంది. తన కొడుకు ఉన్నతికి పాటు పాడే నాన్న గొప్పతనాన్ని ఓ రోజులో చెప్పుకుంటే సరిపోతుందా! అంటే సరి కాదనే సమాధానమే వినిపిస్తుంది. కుటుంబం కోసం తండ్రి చేసే త్యాగాలను గుర్తు…
సినీనటి సాయిపల్లవి ని సాదరంగా స్వాగతించి చిరు సత్కారం చేశారు సరళ కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో కామంచికల్ గ్రామస్తులు తూము భిక్షమయ్య చిన్న కూతురు సరళ యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా విరాటపర్వం. ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ గారి చెల్లెలే అమర జీవి సరళ. సరళ పాత్రను అద్భుతంగా నటించిన (జీవించిన) ప్రముఖ నటి సాయి పల్లవిని తమ ఆడబిడ్డ గా ఇంటికి పిలిచి చీరె…
ఏపీ లో సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా ఏపీ ఫిలిం ఛాంబర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖ లో పేర్కొంది ఫిలిం ఛాంబర్. ఆన్లైన్ టికెట్ సదుపాయం ను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కు ఇస్తామని లేఖలో వివరించింది.…
సక్సెస్ కు ఫార్ములా అనేది ఏదీ ఉండదు అని చెప్పే సినీ ప్రముఖులు చాలామంది ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఒక నటుడికి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక అతనితో అవే పాత్రలు చేయిస్తుంటారు తప్పితే వారికి వేరే పాత్రలు ఇచ్చి, కొత్తగా చూపించే సాహసం చేయరు. అందుకే మనకు పర్మనెంట్ లెక్చరర్స్, పర్మనెంట్ ప్రిన్సిపాల్స్, పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్స్, పర్మనెంట్ జడ్జెస్ క్యారెక్టర్స్ కు నటులు ఉన్నారు. ఈ స్టీరియో టైప్ క్యారెక్టర్స్…
సుమంత్ సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించారు. 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో భేటీ అయ్యారు. సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ జూలై 20కి పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. తన కెరీర్లో సక్సెస్ ఫుల్ సినిమాలు…
తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు. వైష్ణవి…
రెండేళ్ల పాటు కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇంతలోనే కొత్త సమస్యలు కొన్ని చిత్రసీమను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఫిల్మ్ ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన వేతనాలను సవరించాల్సి ఉండటంతో వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే వేతనాలను పెంచకపోతే, జూలై 1వ తేదీ నుంచి యూనియన్లు సమ్మె బాట పట్టినా ఆశ్చర్యం లేదని ఫెడరేషన్ పెద్దలు కొందరు చెబుతున్నారు. సమ్మె నోటీస్‌ను ఫెడరేషన్ ఇటు ఫిల్మ్…
తెలుగు చిత్రసీమలో యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు వి.మధుసూదనరావు. ఆయన పూర్తి పేరు వీరమాచినేని మధుసూదనరావు అయినా, అందరూ ‘విక్టరీ’ మధుసూదనరావు అనే పిలిచేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు విజయకేతనం ఎగురవేయడంతో ‘విక్టరీ’ ఇంటిపేరుగా మారింది. ఇక ‘రీమేక్ కింగ్’ గానూ ఆయన అలరించారు. మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన పలు రీమేక్ మూవీస్ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మధుసూదనరావు 1923 జూన్ 14న కృష్ణాజిల్లాలో జన్మించారు. చదువుకొనే…