Rashmika Mandanna Reacts-to Allu Arjuns Viral Cigar Photo Says: అందాల భామ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ తోపాటు తమిళ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మన దగ్గర బడా హీరోల సరసన నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు సరనస సర్కారు వారి పాట.. అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప సినిమాల్లో నటించింది రష్మిక. ప్రస్తుతం పుష్ప 2 లో చేస్తోంది. ‘పుష్ప’ కంటే ముందు.. రశ్మికా మందణ్ణ ఒక్కో సినిమాకి గాను రూ. 1 కోటి పారితోషికం తీసుకునేది. కానీ.. తన రెమ్యునరేషన్ ఫిగర్‌ను ఏకంగా రూ. 4 కోట్లకు పెంచేసిందట! అయితే.. తెలుగు సినిమాలకు మాత్రం రూ. 3 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీకో రేటు.. తెలుగుకో రేటునా అంటూ కమెంట్లు ఎదుర్కొంటున్న రష్మికకు మరో తలనొప్పి వచ్చి పడింది.
రీసెంట్ గా సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించింది ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు రష్మిక చేసిన ట్విట్ ఒక బాగా ట్రోల్ అవుతుంది. అది కూడా అల్లు అర్జున్ గురించి ట్విట్ చేయడంతో బాగా ఆడేసుకుంటున్నారు అల్లు ఫ్యాన్స్. అంతగా రష్మిక ఏంచేసిందనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నగా మరింది. టాలీవుడ్ లో హిట్ లు కొట్టి ఎంత బాలీవుడ్ కి వెల్లినంత మాత్రాన మరీ ఇంత మతిపరుపా? లేక ఇంకేమైనానా అంటూ రష్మికాను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే అల్లు అర్జున్ రీసెంట్ గా ఓయాడ్ కోసం తన లుక్ స్టైల్ మొత్తంగా మార్చేసిన విషయం తెలిసిందే. ఆయాడ్ కోసం బన్నీ సూపర్ స్టైలిష్‌గా మారి లైట్ గా నెరిసిన జుట్టు, గడ్డం, నోట్లో సిగార్‌తో బన్నీ లుక్ ఓ రేంజ్ లో అదిరిపోయింది.
Read also: Bihar Political Crisis: బీజేపీకి నితీష్ కుమార్ గుడ్ బై.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం
దీనిపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బన్నీ అభిమానుల ఈ లుక్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే బన్నీ లుక్ పై ఇటీవలె రష్మిక చేసిన కామెంట్ ఇప్పుడు అల్లు అభిమానులు రష్మికాను తెగ ఆడేసుకుంటున్నారు. ట్రోల్ చేస్తున్నారు. అల్లు తన స్టైల్ ఫోటోను పోస్ట్ చేయగా దానికి ట్యాగ్ చేస్తూ రష్మిక ఓ కమెంట్ చేసింది. “సార్ మిమ్మల్ని ఒక్క క్షణం గుర్తుపట్టలేక పోయా”ను అంటూ కమెంట్ చేయడంగంతో షర్మికపై బన్నీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. నీతో నటించిన హీరోను కూడా గుర్తుపట్టలేవా? ఇది మరీ ఓవరాక్షన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు తెలుగు హీరోల కంటే హిందీ హీరోల ముఖాలే నీకు గుర్తంటాయా? అంటూ రష్మికపై మండిపడుతున్నారు. బన్నీనే గుర్తుపట్టకపోవడం దారుణం ఇది కాస్త ఓవర్ గా లేదు. ఎంత బాలివుడ్ ఆఫర్ వస్తే మాత్రం టాలీవుడ్ హీరోలు నీకు కనిపించడంలేదా అంటూ బన్నీ ఆర్మీ, రష్మీకను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని కామెంట్లు చేస్తున్నా రష్మిక నోరు మెదక పోవడం, లేకా ఎందుకులే అనుకుందో సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతుంది. అయినా రష్మికా అది హాస్యంగా కామెంట్ చేసిందో.. లేక బాలీవుడ్ లో ఆఫర్లు రావడం వల్ల చేసిందో గాని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
CPI Mahasabhalu: అక్టోబర్ 14 నుంచి 18 వరకూ సీపీఐ జాతీయ మహాసభలు