Chiranjeevi Latest Photos Viral : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీబిజీగా గడుపుతున్నారు. కథలను ఓకే చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నారు. ఒకటిరెండు కాదు ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నారు చిరు. అయితే.. అప్పట్లో మోగాస్టార్ ఎంత బిజీ షెడ్యూల్ తో వున్నారో ఇప్పుడు కూడా చిరు క్రేజ్ అస్సలు తగ్గలేదు. కాగా.. మోగాస్టార్ చేతిలో ఇప్పటికి నాలుగు సినిమాలు వున్నాయి. అయితే చిరు ఇప్పుడు ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు అభిమానులకు తీవ్ర నిరాశ పరిచింది.
read also: Mahesh babu: వరల్డ్ వైడ్ 175 పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ స్పెషల్ షోస్!
ప్రస్తుతం చిరు తదుపరి చిత్రాలపై పూర్తీగా దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలో.. తాజాగా చిరు దిగిన ఫోటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరు ఓ ఫోటోషూట్ చేశాడు. ఈ ఫోటోషూట్‌లో భాగంగా పలు కాస్ట్యూమ్స్ ధరించి కెమెరాకు ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫోటోలలో చిరు క్లాస్‌లుక్‌లో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. దీంతో.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా చిరు పోస్ట్ చేయడంతో.. అభిమానుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్, ఎవర్ గ్రీన్ అఫ్ టాలీవుడ్, అటు క్లాస్ అయినా, ఇటు మాస్ అయినా బాస్ తరువాతే ఎవరైనా అంటూ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఫోటోలు చూస్తూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. చిరు సూపర్ , స్టైల్ అదిరింది అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Be it Mass or Class he is the "BOSS" 🔥🔥
Megastar @KChiruTweets looks suave in these clicks..his style and charm are irreplaceable 💥💥🤙🤙#Chiranjeevi #BholaaShankar #GodFather #Mega154 #MegastarChiranjeevi pic.twitter.com/l81BLawUK6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 7, 2022